ప్రతి మీడియాకు ఓ రాజకీయ ఎజెండా ఉంది. తాము కొమ్ముకాసే పార్టీలకు అవి బాకాలూదుతుంటాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు ఇక్కడితో ఆగిపోవడం లేదు. స్వలాభం కూడా చూసుకుంటున్నాయి. ప్రజలకు చేరవేయాల్సిన కీలకమైన అంశాల్ని కూడా తొక్కిపెడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తగ్గిపోయిందనే భ్రమలో చాలా మంది ఉన్నారు. కానీ అది తగ్గలేదు, ఓ సెక్షన్ మీడియా తగ్గించింది. మొన్నటికిమొన్న తెలంగాణలోని ఓ ప్రాంతంలో వేలాది కోళ్లు బర్డ్ ఫ్లూతో మృత్యువాతపడితే, ఓ ప్రధాన వార్తాపత్రిక కనీసం దాన్ని లోపల పేజీల్లో కూడా వేయలేదు. దీనికి కారణం, సదరు మీడియా సంస్థ యజమాని దగ్గర బంధువుకు చెందిన పౌల్ట్రీలవి.
కేవలం ఆ పౌల్ట్రీలోనే కాదు, ఏ పౌల్ట్రీలో కోళ్లు చనిపోయినా, బర్డ్ ఫ్లూ భయంకరంగా విస్తరించినా ఆ మీడియా కవర్ చేయదు. ఎందుకంటే దగ్గర బంధువుకు వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి. ఈ విషయంలో ప్రజల ప్రాణాల కంటే, తన బంధువు వ్యాపారం సదరు మీడియాకు ఎక్కువైంది.
మరో మీడియా సంస్థలు బర్డ్ ఫ్లూ వార్తల్ని కవర్ చేయాలా వద్దా అనే అంశంపై ఏరోజుకారోజు నిర్ణయం తీసుకుంటుంది. తెరవెనక చర్చలు ఫలిస్తే ఆ ఛానెల్ లో బర్డ్ ఫ్లూ వార్తలు రావు. తెరవెనక ఒప్పందాలు కుదరకపోతే, మరుసటి రోజు నుంచే బర్డ్ ఫ్లూపై ప్రత్యేక కథనాలు. ఇలా ఉంది ఆ మీడియా తీరు.
తెలుగు రాష్ట్రాల్లో మేజర్ మీడియా సంస్థలు (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్) ప్రజలకు ఏది అవసరమనే విషయాన్ని ఎప్పుడో మరిచిపోయాయి. తమ ఎజెండా ప్రకారం వార్తలు వడ్డించి ప్రజల బుర్రలపై రుద్దుతున్నాయి. కనీసం బర్డ్ ఫ్లూ లాంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నప్పుడైనా, స్వలాభం కాస్త పక్కనపెట్టి, బాధ్యతగా వ్యవహరించాలనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది.
ఆ మీడియా తప్పుడు సాచ్చి కదా??
తప్పుడు సాచ్చి మీడియా కదా??
నీకు ఇంగిత జ్ఞానం గురించి మాట్లాడేంత జ్ఞానం ఎప్పుడు వచ్చింది????
అయితే నా డిపి చూడండి
మన గుడ్డు స్పెషలిస్ట్ అమర్నాథ్ ను అడగక పోయావా
ఇంతకీ మన ప్యాలెస్ పులకేశి కి వున్న 50 ఎకరాల్లో వున్న కోళ్ల పారం సంగతి, అందులో కోళ్ళు చచ్చిన సంగతి, సాక్షి లో రాశారా?
సజ్జల్ సాక్షి కి పోటీగా గ్రేట్ ఆంద్ర లో ఆ న్యూస్ వెయ్యి.
ప్యాలెస్ పులకేశి ప్యాలెస్ కి పిలిపించి సజ్జల చేత నీకు బొకే ఇప్పిస్తాడు.