నానికే అంతొస్తే..నాకెంత వస్తుందో?

ఓవర్ సీస్ వసూళ్లను ఓ మూసలో పోసి లెక్క పెట్టడం, ముందుగా అంచనావేయడం అన్నది కాస్త కష్టం. ఎందుకంటే అక్కడ ఆడియన్స్ పల్స్ అంత సులువుగా అందదు. పైగా ఓవర్ సీస్ ఆడియన్స్ ప్రీ…

ఓవర్ సీస్ వసూళ్లను ఓ మూసలో పోసి లెక్క పెట్టడం, ముందుగా అంచనావేయడం అన్నది కాస్త కష్టం. ఎందుకంటే అక్కడ ఆడియన్స్ పల్స్ అంత సులువుగా అందదు. పైగా ఓవర్ సీస్ ఆడియన్స్ ప్రీ సెట్ ఆఫ్ మైండ్ తో వుంటారు. దాని ప్రకారమే ప్రీమియర్ షోల కలెక్షన్లు ఆధారపడి వుంటాయి. ఆ తరువాత కలెక్షన్లు అన్నది సినిమాకు వచ్చిన టాక్ ను బట్టివుంటాయి.

కొన్ని చిన్న సినిమాలకు కూడా ప్రీమియర్ కలెక్షన్లు అదిరిపోతాయి. అలాఅని కొన్ని పెద్ద సినిమాలకు దారుణంగా వుంటాయి. భలే భలే మగాడివోయ్ కు భలేగా ప్రీమియర్ కలెక్షన్లు వచ్చాయి. అలాంటిది రామ్ సినిమా శివమ్ కు మాత్రం పూర్ కలెక్షన్లు. 

ఇలాంటి మార్కెట్ వుంటే, ఇప్పుడు నితిన్ తను-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారవుతున్న అ..ఆ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్ లో అమ్మమని నిర్మాత, దర్శకులకు ఉచిత సలహా ఇస్తున్నాడంట. నాలుగు కోట్ల మేరకు అమ్మబోతే, నాని సినిమాకు అంత భారీ కలెక్షన్లు వచ్చాయి. అందువల్ల మార్కెట్ బాగుంది..అయిదు, అయిదున్నర తక్కువకు అమ్మవద్దు..మీ (త్రివిక్రమ్) నా (నితిన్) కాంబినేషన్ అంటే ఆ మాత్రం వుండాలి అంటున్నాడట.

అయినా కూడా నాలుగు నుంచి అయిదు మధ్యలోనే అమ్మారు. అది వేరేసంగతి. కానీ నితిన్ ఇటీవల తన సినిమా కొరియర్ బాయ్ కళ్యాణ్ ఓవర్ సీస్ కలెక్షన్లు ఓసారి చూసుకుంటే బాగుంటుందేమో?