ఒకప్పుడు నీలిచిత్రాలు చూడాలంటే పెద్ద తతంగం. విసిఆర్ల కాలం నుంచి డివిడిల యుగాన్ని దాటి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల శకం వచ్చేసరికి బూతు చిత్రం ఏకంగా అరచేతిలోకే వచ్చేసింది. దీంతో ఆ బాల గోపాలం సదరు మిడ్నైట్ మషాలాలను ఎప్పుడంటే అప్పుడు ఎలాగంటే అలా చూసేస్తూన్నారు. ఇదే విషయాన్ని తాజాగా ఒక సర్వే కూడా ధృవీకరించింది.
స్మార్ట్ ఫోన్లు పోర్న్ సైట్ల వీక్షణను ఇబ్బడిముబ్బడిగా పెంచాయట. ఈ విషయం నీలిచిత్రాల సైట్లలో ప్రముఖమైనదిగా పేరున్న పోర్న్‌హబ్ చేసిన ఒక సర్వేలో తేలింది. వివరాల్లోకి వెళితే… సదరు సైట్ ను 2010లో ఐఒఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ పై వీక్షించేవారి సంఖ్య 12శాతంగా ఉంటే, అది ఆరేళ్లు కూడా తిరగకుండానే ఏకంగా 63శాతానికి ఎగబాకింది. దీనికి కారణం ఆ సమయంలో స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరగడమే.
గత నెలలో ఆండ్రాయిడ్ వినియోగదారులు ఐఓఎస్ వినియోగదారులకంటే ఎక్కువ సమయం ఈ బూతు సైట్ చూడడానికి కేటాయించారట. రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల ద్వారా ఈ సైట్లపై అత్యధికశాతం మంది చూడడానికి ఇష్టపడిన పోర్న్స్టార్స్లో లిసా యన్, మియా ఖలీఫా, కిమ్ కార్డషియాన్లు ఉన్నారు. అలాగే ఈ రెండింటి వినియోగదారులూ బాగా చూడడానికి ఇష్టపడిన శైలి ఆడవాళ్ల మధ్య స్వలింగసంపర్క (లెస్బియన్) చిత్రాలు. .
మొత్తానికి చేతిలోకి దునియాను తీసుకొస్తానని మాటిచ్చి మన జీవితాల్లోకి వచ్చిన మొబైల్ … ఇప్పుడు మనల్ని ప్రపంచమే మరిచిపోయేలా చేస్తోంది. అరచేతిలో సుఖాల స్వర్గం చూపిస్తోంది. వీటి మాయలో పడి మన యువత భవిష్యత్తు లక్ష్యాలు మరచిపోకూడదని కోరుకుందాం.