మరో దర్శకుడు బలి

హీరోలు సినిమా మేకింగ్ లో ఇన్ వాల్వ్ కావడం కొంత వరకు అవసరమే. అందులోనూ కొత్త దర్ళకులకు అవకాశం ఇచ్చినపుడు వారు చెప్పినదేమిటి? చేస్తున్నదేమిటి? అన్నది కాస్త చూసుకోవడం మరింత అవసరం. అయితే అలా…

హీరోలు సినిమా మేకింగ్ లో ఇన్ వాల్వ్ కావడం కొంత వరకు అవసరమే. అందులోనూ కొత్త దర్ళకులకు అవకాశం ఇచ్చినపుడు వారు చెప్పినదేమిటి? చేస్తున్నదేమిటి? అన్నది కాస్త చూసుకోవడం మరింత అవసరం. అయితే అలా అని చెప్పి, కొత్తవాళ్లు కదా, అని తమకు అనుభవం వుంది కాదా అని స్టీరింగ్ మొత్తం తమ చేతుల్లోకి తీసుకుంటే సినిమా రాంగ్ రూట్లోకి వెళ్లిపోతుంది. శివమ్ సినిమాకు సంబంధించి టాలీవుడ్ లో ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి.

ఏ మాత్రం అవకాశం వున్నా హీరో రామ్ సినిమా మేకింగ్ లో సాంతం దూరిపోతాడని, చిన్నాన్న స్రవంతి రవికిషోర్ కూడా కంట్రోలు చేయలేరన్నది ఆ గుసగుసల సారాంశం. నిజానికి స్రవంతి రవికిషోర్ కు సినిమా కథల జడ్జిమెంట్ విషయంలో అపార అనుభవం వుంది. ఆయన రీమేక్ లు తీసినా, డబ్బింగ్ లు చేసినా, స్వంత కథలైనా అన్నీ కాస్త క్రెడిబులిటీ వున్నవే. అలాంటిది శివమ్ లాంటి స్క్రిప్ట్ ఆయన సంస్థ నుంచి ఎలా బయటకు వచ్చింది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

అయితే దీనికి సమాధానం టాలీవుడ్ గుసగుసల రూపంలో వినిపిస్తోంది. హీరోరామ్ అభిరుచి మేరకు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, జోడించుకుంటూ పోయారని, చివరకు అలా తయారైందని అంటున్నారు. ఏమయితేనేం ఓ కొత్త దర్శకుడు డిక్కీలోకి వెళ్లిపోయాడు