అరవింద్ ను నిలదీస్తున్న శిరీష్?

ఓ కొడుకును సినిమా నిర్మాత ఏ రేంజ్ లో హీరోగా లాంచ్ చేయాలో అల్టిమెట్ గా చేసి చూపించేసాడు బెల్లంకొండ సురేష్. టాప్ టెక్నీషియన్స్ ను ఎన్నుకోవడమే కాకుండా, వాళ్లని మార్కెట్ రేటు కు…

ఓ కొడుకును సినిమా నిర్మాత ఏ రేంజ్ లో హీరోగా లాంచ్ చేయాలో అల్టిమెట్ గా చేసి చూపించేసాడు బెల్లంకొండ సురేష్. టాప్ టెక్నీషియన్స్ ను ఎన్నుకోవడమే కాకుండా, వాళ్లని మార్కెట్ రేటు కు మించిన పారితోషికాలతో కట్టిపడేసాడు. తన కెరియర్ లో ఇంత పారితోషికం అందుకోవడం ఇదే ప్రధమం అన్నాడు సీనియర్ పాటల రచయిత చంద్రబోస్. అంటే అర్థం చేసుకోవచ్చు. అందరూ శ్రీను అదృష్టం అని మెచ్చుకుంటున్నారు. 

అయితే ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్లు..ఇది ఇప్పుడు అల్లు అరవింద్ ఇంట్లో చిచ్చు పెడుతోందని వినికిడి. నిజానికి అల్లు అరవింద్ స్టామినా లెక్కించుకుంటే బెల్లంకొండకు ఫదింతలు వుంటుదనడంలో వాస్తవం లేదు. బెల్లం కొండ ఖర్చు చేసిన 36 కోట్లు అల్లు అరవింద్ కు ఓ లెక్క కాదు. 

ఒక్క హిందీ గజనీ సినిమాతోనే ఆయన ఇంతకు మూడింతలు సంపాదించారు.  కానీ ఆయన గౌరవం..కొత్త జంట లాంటి చిన్న సినిమాలతోనే శిరీష్ ను సరిపెట్టాడు. ఇప్పుడు శిరీష్ ఈ విషయంలోనే తండ్రిని నిలదీస్తున్నాడట. బెల్లంకొండ కొడుకును లాంచ్ చేసిన వైనం చూపించి..అదీ లెవెల్ అంటే అంటున్నాడట. ఆ విషయానికి వస్తే అల్లు అర్జున్ కు కూడా అరవింద్ పెద్ద సినిమాలేవీ తీసి ఇవ్వలేదు కదా..ఒక్క రామ్ చరణ్ కు మాత్రమే అల్లు అరవింద్ పెద్ద సినిమా చేసింది. 

మరి అల్లు శిరీష్ అన్నాడంటే తప్పు లేదనుకోవాలి.