Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

పండగ చేస్కోకు పివిపి సాయం?

పండగ చేస్కోకు పివిపి సాయం?

పరుచూరి ప్రసాద్ పాపం నిర్మాతగా కిందా మీదా పడుతున్నారు. షాడో దెబ్బ మరి ఇంతా అంతా కాదు కదా..రామ్ తో పండగ చేస్కో సినిమా ప్రారంభించారు.నెమ్మదిగా బండి లాగిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మీద కాస్త హోప్ వుంది. అదొక్కటే ఆశ. రామ్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. 

కానీ పరుచూరి కాస్త పైసల కోసం కిందా మీదా అవుతూనే సినిమాలు లాగిస్తున్నారు. పరుచూరి ప్రసాద్ కు ఈ విషయంలో పివిపి సాయం చేస్తున్నట్లు వినికిడి. వీరిద్దరికి మంచి స్నేహం వుంది. పరుచూరి ప్రసాద్ అంటే పివిపి మాంచి అభిమానం కూడా వుంది. 

అందుకే పండగ చేస్తో పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా విడుదలయ్యే అవకాశం వుంది. అప్పుడైనా షాడో లాస్ నుంచి రికవరీ అవుతారేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?