రేయ్..వదిలేసేయ్..

రేయ్ సినిమా ఇక రాని సినిమాల ఖాతాలోకి చేరిపోయినట్లే కనిపిస్తోంది. పాపం చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి ప్రారంభ చిత్రం ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. వైవిఎస్ చౌదరి ఎన్ని జిమ్మిక్కులు చేసినా,…

రేయ్ సినిమా ఇక రాని సినిమాల ఖాతాలోకి చేరిపోయినట్లే కనిపిస్తోంది. పాపం చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి ప్రారంభ చిత్రం ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. వైవిఎస్ చౌదరి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, సినిమా మాత్రం బయటపడే సూచనలు కనిపించడం లేదు. దాంతో దానికి విడుదల ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయినట్లు కనిపిస్తోంది. 

సినిమా బయటపడాలంటే కేవలం డబ్బు సాయం తప్ప మరేదీ పనికి రాదు. మెగా కుటుంబం నుంచి అలాంటి ఆశించడం అత్యాశే అవుతుంది. అందువల్ల చౌదరి వున్న డబ్బులు ఊర్చి పెట్టాడు..అవి కూడా ల్యాబ్ లో సినిమా రూపంలో పడి మూలుగుతున్నాయి. దీంతో చౌదరి మునిగిపోయినట్లే అనిపిస్తోంది. 

చిత్రంగా ఇలాంటి సినిమాల జాబితా కాస్త పెద్దదే వుంది. ఇంటింటా అన్నమయ్య, తను మొన్నే వెళ్లిపోయింది..జెండాపై కపిరాజు..ఇలా రాసుకుంటూ వెళ్లాలంటే చాలానే వున్నాయి.