మెగా కుటుంబం నుంచి కొత్తగా వస్తున్న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ చిత్రానికి పేరు మారిందని తెలిసింది. ఈ చిత్రానికి గొల్లభామ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నా కానీ దానికి వస్తోన్న మిశ్రమ స్సందన దృష్ట్యా పేరు మార్చాలని నిర్ణయించారు. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి భారీ అంచనాలతో వస్తోన్న హీరో సినిమాకి ఉండాల్సిన టైటిల్ ఇది కాదనేది చాలా మంది అభిప్రాయం.
అదీ కాక ఈ టైటిల్ నేటి తరం ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోవచ్చు. ఈ ఫీడ్‌బ్యాక్ అంతటినీ తీసుకుని టైటిల్ మార్చడానికి నిర్ణయించారు. ‘ముకుంద’ అనే టైటిల్ పట్ల యూనిట్ సభ్యులు మొగ్గు చూపుతున్నారని, చిరంజీవి కూడా ఈ టైటిల్‌కి ఓటేసారని ఫిలింనగర్‌లో చెప్పుకుంటున్నారు.
పేరు మార్పు గురించి ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా కానీ గొల్లభామ టైటిల్ అయితే ఉండదని ఖచ్చితమైన సమాచారం. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ తొలి సినిమాకి హైప్ పెంచేందుకు ప్రమోషన్స్ అగ్రెసివ్‌గా ప్లాన్ చేయబోతున్నారట.