నరేష్ వారసుడి కోసం భారీ ఏర్పాట్లు

సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ ను తెరంగ్రేటం చేయించే వేడుకకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రేంజ్ లో ఈ కార్యక్రమం జరగాలని ప్లాన్ చేస్తున్నారు. కృష్ణ ఫ్యామిలీ అభిమానులందరినీ రప్పిస్తున్నారు. కృష్ణ,…

సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ ను తెరంగ్రేటం చేయించే వేడుకకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రేంజ్ లో ఈ కార్యక్రమం జరగాలని ప్లాన్ చేస్తున్నారు. కృష్ణ ఫ్యామిలీ అభిమానులందరినీ రప్పిస్తున్నారు. కృష్ణ, విజయనిర్మలతో పాటు మహేష్  కూడా ఈ వేడుకకు వస్తారని ప్రచారం అయితే జరుగుతోంది. 

మహేష్ వస్తాడు కాబట్టి వేదిక సరైనది వుండాలని ఆలోచించి రెండువేదికలు ఫైనల్ చేసారు. ఒకటి అన్నపూర్ణ ఏడెకరాలు లేదా హైటెక్స్. వర్షాకాలం కావడంతో హైటెక్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. వారసుడిని లాంచ్ చేయాలంటే ఇలా చేయాలని బెల్లంకొండ సురేష్ ఓ ల్యాండ్ మార్క్ సెట్ చేసి వదిలారు. 

అందుకే ఇప్పుడు వీళ్లూ ఇంత హడావుడి చేస్తున్నారు. ముఖ్యంగా విజయనిర్మలకు మనవడు నవీన్ అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆమె ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిసింది.