తుస్సుమన్న రభస!

ఎన్టీఆర్‌ నుంచి సింహాద్రిలాంటి భారీ విజయాన్ని మళ్లీ చూడాలని తహతహలాడిపోతున్న అభిమానులు ‘రభస’పై అంతులేని అంచనాలు పెంచుకున్నారు. ఆగస్ట్‌ 15న విడుదలకి సిద్ధమవుతోన్న ఈ చిత్రం ఆడియో మొన్నే విడుదలైంది. తమన్‌ స్వరపరిచిన ఈ…

ఎన్టీఆర్‌ నుంచి సింహాద్రిలాంటి భారీ విజయాన్ని మళ్లీ చూడాలని తహతహలాడిపోతున్న అభిమానులు ‘రభస’పై అంతులేని అంచనాలు పెంచుకున్నారు. ఆగస్ట్‌ 15న విడుదలకి సిద్ధమవుతోన్న ఈ చిత్రం ఆడియో మొన్నే విడుదలైంది. తమన్‌ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు అంతంత మాత్రంగా ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది. 

ఎన్టీఆర్‌ పాడిన ‘రాకాసి రాకాసి’ తప్ప మిగతా పాటలు ఆకట్టుకునేలా లేవని, తమన్‌ రెగ్యులర్‌గా వినిపించే డప్పు సౌండ్‌లే డామినేట్‌ చేసాయని అంటున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్‌ ట్రెయిలర్‌ కూడా ఆకట్టుకునేలా లేదు. చూస్తుంటే ఒక రొటీన్‌ ఎన్టీఆర్‌ మార్కు మాస్‌ సినిమా అనిపించేలాగుంది. 

దీంతో రభస చిత్రం కూడా రొటీన్‌గానే ఉంటుందేమో అనే గుబులు ఫాన్స్‌లో మొదలైంది. సినిమాకి హైప్‌ తగ్గించడానికో, లేదా అంచనాలని మితంగా ఉంచాలనే ఆలోచనతోనో ఈ ట్రెయిలర్‌ కట్‌ చేసి ఉన్నట్టయితే ఓకే. కానీ సినిమాలో ఉన్న బెస్ట్‌ సీన్లు, డైలాగులు ఇవేనైతే మాత్రం ‘రభస’ని బాక్సాఫీస్‌ వద్ద మోయాల్సిన భారం ఎన్టీఆర్‌పై మరింత ఎక్కువవుతుంది.