ప్రభాస్ పిచ్చ హ్యాపీ

రన్ రాజా రన్ హిట్ కావడంతో హీరో ప్రభాస్ పిచ్చ హ్యాపీగా వున్నాడు. సినిమా విడుదలైన రెండు రోజులు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ బాహుబలి షూటింగ్ కూడా వదిలేసాడట. తన బంధువులు కమ్…

రన్ రాజా రన్ హిట్ కావడంతో హీరో ప్రభాస్ పిచ్చ హ్యాపీగా వున్నాడు. సినిమా విడుదలైన రెండు రోజులు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ బాహుబలి షూటింగ్ కూడా వదిలేసాడట. తన బంధువులు కమ్ పార్టనర్లు విక్రం,ప్రమోద్, స్నేహితుడు వంశీలకు, దర్శకుడితో కలిసి మాంచి పార్టీ ఇచ్చేసాడు. 

రెండో రోజుల్లో సినిమా ప్రమోషన్ కు తాను ఓ మాంచి ప్లాన్ తో వస్తానని వాళ్లకి హామీ ఇచ్చేసాడు. అదేంటో మాత్రం సస్పెన్స్ అన్నాడు.. యువి క్రియేషన్స్ లో ప్రభాస్ కూడ భాగస్వామ్యం వున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ ఇక వరుసగా చిన్న సినిమాలు తీయాలని ఫిక్సయిపోయింది. 

ఇప్పటికే గోపీచంద్ సినిమా సెట్ లపై వుంది. ప్రభాస్ తరువాతి సినిమా ఈ బ్యానర్ దే. ఇది కాక, మరో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.