ఈనెల 16న ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది బ్రూస్ లీ. రామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ లోని ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి చిరు స్పెషల్ అట్రాక్షన్. అయితే ఈ నెల 15న రాత్రి బ్రూస్ లీ సినిమాల స్పెషల్ షోలు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మూసాపేట శ్రీరాములు ధియేటర్ లో ఫ్యాన్స్ హడావుడి ఓ రేంజ్ లో వుండాలని ప్లాన్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నటుల్లో వీలయినంత మందిని ఈ షోకి రప్పించాలని ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా వుంటే 15 రాత్రి వీలయినన్ని స్పెషల్ షో లు వేయాలని ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇటీవల బాహుబలి, శ్రీమంతుడు సినిమాలకు వీలయినన్ని ఎక్కువ స్పెషల్ షోలు వేసారు. అలా వచ్చిన మొత్తం అంతా తొలి రోజు కలెక్షన్లలో చేర్చి కొత్త రికార్డులు క్రియేట్ చేసారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని బ్రూస్ లీ కి కూడా ఫాలో కావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ లెక్కన హైదరాబాద్ చందా నగర్ నుంచి ఇటు మూసా పేట వరకు వున్న థియేటర్లలు అన్నీ 15 రాత్రి కళకళలాడేలాగే వుంది పరిస్థితి. అయితే స్పెషల్ షోల రేటు ఎంత, టికెట్ ధర ఎంత అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. సెన్సారు అనంతరమే అవన్నీ డిసైడ్ అవుతాయి.