ప‌న్ను ఎగ్గొట్టడంలోనూ పులే…

త‌మిళ సూప‌ర్‌స్టార్ ఐటి  ఎగ‌వేత‌లోనూ సూప‌ర్ అనిపించుకున్నాడా? అవున‌నే అంటున్నాయి  ఐటి వ‌ర్గాలు. తాజాగా త‌మిళ హీరో విజ‌య్ ఇంటి మీద ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ చేసిన ఐటి దాడుల గురించి తెలిసిందే. దీనికి…

త‌మిళ సూప‌ర్‌స్టార్ ఐటి  ఎగ‌వేత‌లోనూ సూప‌ర్ అనిపించుకున్నాడా? అవున‌నే అంటున్నాయి  ఐటి వ‌ర్గాలు. తాజాగా త‌మిళ హీరో విజ‌య్ ఇంటి మీద ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ చేసిన ఐటి దాడుల గురించి తెలిసిందే. దీనికి కార‌ణం గ‌త ఐదేళ్ల నుంచి విజ‌య్ త‌న‌కు వ‌స్తున్న ఆదాయాన్ని బాగా త‌గ్గించి చూపుతూ ప‌న్ను ఎగ్గొట్టడ‌మేన‌ని ఐటి అధికారులు అంటున్నారు. హీరోయిన్లు స‌మంత‌, న‌య‌న‌తార‌లు సైతం గ‌త మూడేళ్ల నుంచి ఆదాయాన్ని త‌క్కువ చేసి చూపుతున్నార‌ట‌. 

చెన్నై, కొచ్చిన్‌, హైద‌రాబాద్‌ల‌లో బుధ, గురువారాల్లో జ‌రిపిన  దాడుల్లో ఐటి అధికారులు రూ.2కోట్ల న‌గ‌దు, అంతే విలువైన బంగారం  స్వాధీనం చేసుకున్నారు. నిర్మాత, ఫైనాన్షియ‌ర్‌ల ఇళ్ల మీద కూడా దాడులు చేసిన‌ప్పట‌కి ఈ ప‌న్ను ఎగ‌వేత‌లో సింహ‌భాగం విజ‌య్‌దేన‌ని అధికారులు స్పష్టం చేశారు.