ఈసారి మనం ఫిల్మ్’ఫేర్’ అవుతుందా?

ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డులను మనం సినిమా ఎగరేసుకుపోయేలా వుంది. దాదాపు తోమ్మిది విభాగాల్లో మనం సినిమా నామినేట్ అయింది. అలాగే రేసుగుర్రం కూడా అయిదు విభాగాల్లో నామినేట్ అయింది. ఇక కార్తికేయ నాలుగు…

ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డులను మనం సినిమా ఎగరేసుకుపోయేలా వుంది. దాదాపు తోమ్మిది విభాగాల్లో మనం సినిమా నామినేట్ అయింది. అలాగే రేసుగుర్రం కూడా అయిదు విభాగాల్లో నామినేట్ అయింది. ఇక కార్తికేయ నాలుగు విభాగాల్లో నామినేట్ అయింది. ఇటు కార్తికేయకు, అటు మనం కు కూడా గీత రచయిత వనమాలి నామినేట్ కావడం విశేషం. 

ఆయన గతంలో హ్యాపీ డేస్ సినిమాకు ఓ సారి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. మనం సినిమాలో 'కనులను తాకే ఓ అల'…కార్తికేయ సినిమాలో 'సరిపోవు కోటి కనులైనా' పాటలు వనమాలి రాసినవే..ఇప్పుడు ఫిల్మ్ పేర్ కు నామినేట్ అయ్యాయి. మొత్తానికి ఈ సారి మనంసినిమా బాగానే అవార్డులు గెల్చుకునే అవకాశం వుంది.