శిరీష్ కు ప్లస్ అవుతుందా?

పరుశురామ్ దర్శకుడిగా కన్నా రచయితగా ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. ఆయనంటే ఇష్టపడే నారా రోహిత్ కూడా అదే మాట అంటాడు. నారా రోహిత్ తో పరుశురామ్ సినిమా ఈ ఏడాది చివరి నుంచి వుంటుంది.…

పరుశురామ్ దర్శకుడిగా కన్నా రచయితగా ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. ఆయనంటే ఇష్టపడే నారా రోహిత్ కూడా అదే మాట అంటాడు. నారా రోహిత్ తో పరుశురామ్ సినిమా ఈ ఏడాది చివరి నుంచి వుంటుంది. ఈ లోగా అల్లు శిరీష్ తో సినిమా పూర్తి చేయాల్సి వుంది. సినిమాకు స్క్రిప్ట్ ఓకె అయింది. 

సెట్ మీదకు వెళ్లాలి. భలే భలే మగాడివోయ్ సినిమా రెండు పాటలు మినహా మిగిలినదంతా పూర్తయింది. అవి కూడా అయిపోతే ఇది ప్రారంభం అవుతుందేమో? సోలో మూవీ మాదిరిగా కుటుంబం బంధాలు అనుబంధాలను మేళవించి తయారుచేసాడట పరుశురామ్ స్క్రిప్ట్ ను. 

ఇదిలా వుంటే ఈ సినిమా షూటింగ్ ను లాంఛనంగా ఈ నెల 11న ప్రారంభించే అవకాశం వుంది.