నాని మంచి నటుడు. అందులో సందేహం లేదు. సినిమా ఎలా వున్నా నటుడిగా నానికి మంచి మార్కులు పడిపోతాయి. కానీ నిర్మాతలకు కావల్సింది కమర్షియల్ విజయాలు . అలా మొదలైంది, అష్టా చెమ్మా, ఈగ మినహా అలాంటి సినిమాలేం నాని దగ్గర నుంచి రాలేదు. మొన్నటికి మొన్న ఎవడే సుబ్రమణ్యం నే తీసుకోండి `ఆహా` అనే రివ్యూలొచ్చాయ్ తప్ప.. లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది.
అయితే నాని పారితోషికం విషయంలో ఏమాత్రం తగ్గడం లేదని టాక్. రెండు కోట్లకుపైగానే అడుగుతున్నట్లు వినికిడి. .. సినిమాపై సంతకం చేయడం లేదట. అంతేనా.. అంటే ఇంకా ఉంది. సినిమాకి కాస్త మంచిగా పెట్టుబడి పెడతారనే బ్యానర్ అయితేనే ఓకె అంటున్నాడట. ఇంతకు ముందు రెండు సినిమాలు దెబ్బతీసాయి.
దాంతో ఇదంతా ముందు జాగ్రత్త అయి వుంటుంది. కానీ అసలు విషయం ఏమిటంటే నానికి ఐదారు కోట్ల మార్కెట్ లేదు. సూపర్ హిట్ అనే టాక్ వస్తే తప్ప పెట్టుబడి వెనక్కు రావడం కష్టం. అలాంటిది మరీ ఇలా రూల్సు పెడితే కష్టం కదా?