అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూవీ ఈనెల 12న క్లాప్ కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. హన్సిక ఫిక్సయిపోయినట్టు వార్తలొచ్చాయి. దేశముదురు తరవాత మళ్లీ ఈ జోడీ కనిపించబోతోందని మెగా ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. అయితే ఈ సినిమాలో హన్సిక ఇంకా ఓకే కాలేదట.
హన్సిక పేరు పరిశీలిస్తున్నామంతే… ఆ ప్లేసులో ఎవరైనా ఉండొచ్చు.. అని చిత్రబృందం చెబుతోంది. అంటే.. ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ల వేట ఇంకా ఓ కొలిక్కి రాలేదని అర్థమవుతోంది.
మరి హీరోయిన్ వైనం కొలిక్కి రాకుండా షూటింగ్ మొదలడతారా? మరోరెండు నెలల వరకు మంచి రోజులు లేవని హడావుడిగా ముందు ప్రారంభించేస్తున్నారట. రెగ్యులర్ షూటింగ్ తరువాత వుంటుందట.