చదువురాని వాళ్లే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్సా?!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్ లో మరో దుమారం రేపాడు.. తెలుగు టాప్ హీరోల ట్విటర్ అకౌంట్ల మధ్య పోలికలు పెడుతూ వర్మ వివాదాస్పద రీతిలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లలో వర్మ…

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్ లో మరో దుమారం రేపాడు.. తెలుగు టాప్ హీరోల ట్విటర్ అకౌంట్ల మధ్య పోలికలు పెడుతూ వర్మ వివాదాస్పద రీతిలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లలో వర్మ పవన్ అభిమానులను టార్గెట్ చేయడం విశేషం. పవన్ అభిమానులను నిరక్ష్యరాసులుగానూ.. టెక్నాలజీ విషయంలో ఏమీ తెలియని వాళ్లు గానూ అభివర్ణించాడు ఆర్జీవీ ట్విటర్ లో మహేశ్ బాబుకు పదిహేను లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారని, పవన్్ కు కేవలం ఆరు లక్షల మంది అభిమానులు మాత్రమే ఉన్నారని.. ఈ తేడా ఎందుకని ఆర్జీవీ ప్రశ్నించాడు! పవన్ లేటుగానే ట్విటర్ లోకి వచ్చిన విషయం వాస్తవమే అయినప్పటికీ… ఈ తేడా మాత్రం తీవ్ర స్థాయిలో ఉందని ఆర్జీవీ అభిప్రాయపడ్డాడు.

ఆఖరికి సమంతకు కూడా పవన్ కన్నాఎక్కువమంది ఫాలోయర్లు ఉన్నారని.. ఏకంగా పదిలక్షల మంది ఫాలోయర్లు ఎక్కువమంది ఉన్నారని.. ఇదంతా తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వర్మ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తను బాధపడుతున్నానని కూడా వర్మ ట్వట్ చేసుకొచ్చాడు. ఓవరాల్ గా మహేశ్ బాబుకు ట్విటర్ లక్షల సంఖ్యలో అభిమానులు ఎక్కువగా ఉండటం అనేది పవన్ అభిమానులకు అవమానం.. వారి చేతగాని తనం అన్నట్టుగా ట్వీట్ చేశాడు వర్మ. పవన్ కల్యాణ్ ఇప్పుడప్పుడే ట్విటర్ ఫాలోయర్ల సంఖ్య విషయంలో మహేశ్ స్థాయిని అందుకోవడం కష్టం.. అప్పటికి మహేశ్ పవన్ కు అందనంత స్థాయికి వెళతాడని కూడా వర్మ చెప్పాడు.

మరి పవర్ స్టార్ ట్విటర్ లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారానే సంచలనం నమోదు చేశాడని.. తొలి రోజుల్లోనే లక్షల సంఖ్యలో ఫాలోయర్లతో రికార్డులు సృష్టించారని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు పవన్ ఎక్కడ వెనుకబడ్డాడో ఆర్జీవీ లెక్కలతో సహా చెప్పాడు. దీనికి పవనిజం ఫ్యాన్స్ ఏమంటారో!