దర్శకుడు క్రిష్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కంచె. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా సెన్సారు ముందుకు వచ్చింది. యు ఎ సర్టిఫికెట్ లభించింది. వాస్తవానికి ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్నారు.కానీ ఆ డేట్ కు వచ్చిన పోటీ, పైగా కంచె సినిమా డిఫరెంట్ జోనర్ ఫ్లస్ క్లాస్ సినిమా కావడంతో, వెనక్కు తగ్గారు. పోటీ కాస్త తక్కువ వున్న సమయంలో విడుదల చేయాలన్నది ప్లాన్.
అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా వుందంటే, ఎప్పుడు ఏ సినిమా వస్తుందో, ఎప్పుడు ఏ సినిమా ఆగుతుందో తెలియడం లేదు. అందువల్ల ముందుగా సెన్సారు చేయించి రెడీగా వుంచుకుంటే, సరైన స్లాట్ దొరికితే చాలు, విడుదల చేయచ్చు అన్న ఆలోచన వుంది. అందుకే ఈ రోజు సెన్సారు ముందుకు తెచ్చారు. సెన్సారు సభ్యులు సినిమా కు యు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.