మా హీరో సినిమాకు ఇంత వచ్చేసింది అంటే మా హీరో సినిమాకు అంత వచ్చేసింది అని ఆయా హీరోల అభిమానులు, వాళ్ల డిజిటల్ టీమ్ లు. అనిరుధ్ సంగీతం అనగానే నలభై కోట్లు, యాభై కోట్లు అడియో రైట్స్ అంటూ ఊగిపోతారు. అగ్రిమెంట్ అయింది 18 కోట్లే అంటే నమ్మరు. వాదిస్తారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో హయ్యస్ట్ అడియో రేటు వచ్చిన సినిమా పుష్ప 2. అన్ని భాషలు కలిపి 40 కోట్లకు కొనుగోలు చేసారు. సితార నిర్మించే కింగ్ డమ్ సినిమాకు అనిరుధ్ తీసుకున్న పారితోషికం 10 కోట్లు. దానికి అడియో రైట్స్ రూపంలో వచ్చింది 15 కోట్లు.
దేవర టైమ్ లో అనిరుధ్ కు ఇచ్చింది ఆరు కోట్లు. కానీ ఆ సినిమాకు అడియో రైట్స్ రూపంలో వచ్చింది 24 కోట్లు.
అదే అనిరుధ్ ఇప్పుడు చేయబోయే నాని పారడైజ్ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ 15 కోట్లు. ఆ సినిమా అడియో రైట్స్ అగ్రిమెంట్ అయింది 18 కోట్లకు.
ఇదీ విషయం. ఇది తెలియక అనిరుధ్ మ్యూజిక్ కదా నలభై కోట్లు యాభై కోట్లు వస్తాయి..వచ్చేసాయి అంటారు. అంత వస్తే అనిరుధ్ 15 కోట్లు రెమ్యూనిరేషన్ ఎందుకు తీసుకుంటారు. ముఫై కోట్లు అడుగుతారు. ఈ చిన్న లాజిక్ ను హీరోల టీమ్ లు మరిచిపోతున్నాయి.
Super
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Rey pooka pushpa kaadhu Leo 58 cr in all languages with audio rights raa pooka