భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తాజాగా పరిస్థితులకు తగ్గట్టుగా పాట మార్చారు. గతంలో తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండగా.. చంద్రబాబునాయుడు పరిపాలన మీద, తీరు మీద విరుచుకుపడిపోతూ వచ్చిన సోము వీర్రాజు, ఇప్పుడు నిందలు జగన్ మీద వేస్తున్నారు. అంత సులువుగా తన పాట మార్చగలరు గనుకనే.. చంద్రబాబు వైపునుంచి ఎలాంటి అభ్యంతరాలు తలెత్తకుండా ఆయన ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోగలిగారని విశ్లేషకులు భావిస్తున్నారు. అవకాశవాద రాజకీయాల ప్రతీకలాగా సోము మారారని అంటున్నారు.
సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. ఆయన పాలనలోని లోపాలను ఎండగట్టారు. 2024 ఎన్నికలకు పూర్వం ఎన్డీయే కూటమిలోకి తెలుగుదేశాన్ని తీసుకోవాలా వద్దా అనే మీమాంస నడిచినప్పుడు.. ఆ పార్టీలోని సీనియర్లలో ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన కొద్దిమంది ముఖ్యుల్లో సోమువీర్రాజు ఒకరు. మరో కోణంలోంచి చూస్తే.. ఆయన భాజపాలో జగన్ అనుకూల నాయకుడనే ముద్ర కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే ఆయన గత ఎన్నికల్లో కూటమి కూర్పును తీవ్రంగా వ్యతిరేకించారు.
కలయిక ఖరారైన తర్వాత కూడా.. కూటమి తరఫున తన స్థాయికి తగినట్టుగా ప్రచారానికి వెళ్లకుండా తన నిరసనను బయటపెట్టుకున్నారు. మొత్తమ్మీద కూటమి గెలిచింది. ఆ తర్వాత మాత్రం ఒకటిరెండు సందర్భాల్లో చంద్రబాబునాయుడు పాలనను కీర్తిస్తూ స్టేట్మెంట్లు ఇచ్చి తన మీద ఆయనలో ప్రతికూల భావన లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సోము వీర్రాజు.
తీరా మొన్న అయిదు ఎమ్మెల్సీల భర్తీకి అవకాశం వచ్చినప్పుడు.. భాజపాకు కూడా అవకాశం ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇటీవల మూడు ఎంపీ స్థానాలు వచ్చినప్పుడు ఒకటి బిజెపికి ఇచ్చి, జనసేనకు రిక్తహస్తం చూపించినట్టుగానే.. ఈసారి ఒక ఎమ్మెల్సీ జనసేనకు ఇచ్చి బిజెపికి రిక్తహస్తం చూపించవచ్చునని ఆయన తలపోశారు.
తెలుగుదేశం నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారనే అంతా అనుకున్నారు. చివరి నిమిషంలో బిజెపి తమకు కూడా ఒక సీటు కావాలని పట్టుబట్టడంతో.. వారిమీద అతిగా ఆధారపడి ఉన్న చంద్రబాబు కాదనలేకపోయారు. చివరి నిమిషంలో బిజెపికి అవకాశం దక్కగా.. ఆశావహులైన పార్టీలోని ఇతర నాయకులందరూ మేలుకునేలోగానే సోము వీర్రాజు ఆ అవకాశం దక్కించుకున్నారు.
దానికి కృతజ్ఞతగానే అన్నట్టుగానే.. ఇప్పుడు ఆయన జగన్ మీద విమర్శలు చేస్తూ చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారని, చాలా ఈజీగా తన స్టాండ్ మార్చేసుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ జగన్ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతున్నారట. అలాంటి మైండ్ గేమ్ కు రాష్ట్రంలో చోటులేదని సోము జోస్యం చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ చేస్తున్న లీగల్ ఫైట్ ను పొలిటికల్ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు సోము!
సోము వీర్రాజు గారు.. ఈ వింత చూసారా..
మీరు చంద్రబాబు పరిపాలన ని ప్రశ్నిస్తే.. విరుచుకు పడ్డాడు అంటారు.. లోపాలను ఎండగట్టాడు అంటారు..
అదే జగన్ రెడ్డి పరిపాలన ని ప్రశ్నిస్తే.. నిందలు మోపాడు అంటున్నారు..
..
మీరు జగన్ రెడ్డి మనిషిగా ముద్ర పడినా తప్పు లేదు ఈ సమాజానికి..
కానీ చంద్రబాబు ద్వారా ఎమ్మెల్సీ వస్తే మాత్రం .. అదొక పాతకం.. ఘోరం.. అవమానం..
..
జగన్ రెడ్డి కోసం పాట పాడితే.. గార్ధభం స్వరమైనా .. కోకిల మాధుర్యమే అంటారు..
అదే చంద్రబాబు కోసం పాట పాడితే.. హిందోళం లో “రి” ఎందుకొచ్చింది అని గద్దిస్తారు ..
..
ఒకసారి న్యూట్రల్ జర్నలిస్టు వెంకట్ రెడ్డి కి “హాయ్” చెప్పండి.. నవ్వుతూ చెప్పండి.. లేకపోతే ఫీల్ అవుతాడు..
Super గా చెప్పారు!!
Wow
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,