వైసిపి 15వ ఆవిర్భావ సభలో జగన్ చెప్పినదిది. ప్రతిపక్షంలో ఉండడం, పోరాడడం మనకు కొత్త కాదు. ఒక్క నాలుగేళ్లు కళ్లు మూసుకుంటే చాలు, మళ్లీ మనదే అధికారం అని కార్యకర్తలను హుషారు పరచడం వరకు బాగానే ఉంది కానీ లాజిక్ కూడా కాస్త చూడాలి. ఏ పార్టీ ఐనా ఆవిర్భవించినపుడు ప్రతిపక్షంలోనే ఉంటుంది, అధికార పార్టీలోంచి మెజారిటీ సభ్యులతో చీలి, బయటకు వస్తే తప్ప! నిజానికి జగన్ ఎన్టీయార్‌లా కొత్త మొహాలతో కొత్త ఐడియాలజీతో పార్టీ నిర్మించకుండా, ఫిరాయింపుదార్లతోనే వ్యవహారాలు నడిపాడు. వాళ్ల వలననే ఎప్పటికప్పుడు దెబ్బ తింటున్నాడు. చావైనా, రేవైనా నీతోనే, నీ సిద్ధాంతాలతోనే ముందుకు సాగుతాం అని అనేవాడు ఎవడూ లేడు. 2014లో మూడోవంతు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గోడ దూకారు. ఐదేళ్ల అధికారం తర్వాత యిప్పుడు చాలామంది సైడుకి తప్పుకుంటున్నారు. మొన్నటిదాకా కోటరీ సభ్యులని మనమంతా అనుకున్నవాళ్లు యీ రోజు ‘కోటరీ’ని నిందిస్తూ నావ వదిలిపెడుతున్నారు. ఇది జగన్‌కు కొత్త కాదా?
అధికారం కోసం పోరాడే సమయంలో ఒకటికి రెండు సార్లు ఓడిపోయిన వాడు యిలాటి ప్రకటనలు చేస్తే సొంపుగానే ఉంటుంది. 9 ఏళ్ల పోరాటం, ఐదేళ్ల అధికారం తర్వాత మళ్లీ ప్రతిపక్షానికి రావడమే గమనార్హం. వైకుంఠపాళిలో పదకొండో గడిలో ఉన్నానండి అని ఎవరైనా అంటే, ఆట మొదలు పెట్టి ఎంతసేపైందని కనుక్కోవాలి. ఐదు నిమిషాలే అంటే ఓహో, త్వరలోనే నిచ్చెన లెక్కి పైకి వెళ్లవచ్చని అంచనా వేయవచ్చు. ఆరగంట తర్వాత అక్కడ ఉన్నాడు అంటే పెద్ద పాము నోట్లో పడి కిందకు వచ్చాడని అర్థం. శుక్లపక్షం ప్రారంభమైన నాలుగో రోజు చంద్రుడు, కృష్ణ పక్షం ముగియబోతున్న నాలుగు రోజుల ముందు చంద్రుడు ఒకే సైజులో ఉండవచ్చు. కానీ స్వభావాల్లో తేడా ఉంది. ఒకరు ఎసెండిగ్, మరొకరు డిసెండింగ్! దాన్ని విస్మరించి జగన్ మాట్లాడితే అది ఆత్మవంచన అవుతుంది.
నిజం చెప్పాలంటే రాజకీయాల్లో జగన్ మొదటి నుంచీ ఎసెండింగ్ స్టార్. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎంపీ అయ్యాడు. తండ్రి హఠాన్మరణం తర్వాత వైయస్ అనుచరగణం యితని చుట్టూ మూగారు. వారి బలం చూసుకుని జగన్ అధిష్టానాన్ని ధిక్కరించాడు. అయితే సోనియాకు మరో వైయస్‌ను తెచ్చుకోవడం యిష్టం లేదు. జీహుజూర్ ముఖ్యమంత్రే కావాలనుకుంది. రోశయ్యను మించిన పొలిటికల్ లైట్‌వెయిట్ కనబడలేదు. ఆ సమయంలో జగన్ రోశయ్యను ఒక ఆట ఆడించాడు. కొందరు మంత్రులు కాబినెట్ మీటింగుకి, సెక్రటేరియట్‌కు వెళ్లకుండా జగన్ యింటి దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్లు. ఓదార్పు యాత్ర అంటూ మొదలుపెట్టి, ప్రజల్లో వైయస్ వారసుడిగా తనకు ఎంత బలం ఉందో చూపించుకోసాగాడు.
జగన్‌ని అదుపు చేయడం రోశయ్య వలన కాదని గ్రహించిన హైకమాండ్ కిరణ్‌ను తెచ్చింది. ఆ నియమాకం జరిగిన వెంటనే జగన్‌కు అర్థమై పోయింది, కాంగ్రెసు తన పాప్యులారిటీని గుర్తించడానికి నిరాకరిస్తోందని. బయటకు వెళ్లి పార్టీ పెట్టి కిరణ్ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టి కూల్చబోయాడు. అప్పుడే చేర్చుకున్న పిఆర్‌పి, మజ్లిస్‌ల మద్దతుతో ప్రభుత్వం గట్టెక్కింది. కాంగ్రెసులో ఉన్న జగన్ అనుయాయులు 16 మంది విప్‌ను ధిక్కరించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. పిఆర్‌పి రెబెల్ ఎమ్మెల్యే కూడా! ఇదంతా చూసి ఆర్నెల్లు తిరక్కుండా సోనియా జగన్‌పై కేసులు పెట్టి జైల్లోకి తోసింది. బెయిలు రాకుండా 16 నెలలు చూసింది. కానీ పార్టీ చెక్కు చెదరలేదు. కాంగ్రెసు, టిడిపి జగన్‌పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఎన్ని చేసినా, జగన్ పట్ల ప్రజల్లో సింపతీ పెరిగింది తప్ప తరగలేదు.
ఇది గ్రహించిన కాంగ్రెసు హై కమాండ్ దీన్ని ఎలా డీల్ చేయాలా అని ఆలోచించింది. రాష్ట్ర విభజనకు కృష్ణ కమిటీ సిఫార్సు చేయకపోవడంతో, దానివలన వచ్చే కష్టనష్టాల గురించి హెచ్చరించడంతో అప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోవడానికి దడిసింది. కానీ యథాతథ పరిస్థితిలో ఎన్నికలకు వెళితే కాంగ్రెసు, టిడిపి, వైసిపి, తెరాసలకు తలా కాస్త సీట్లు వచ్చేవి. తెలంగాణలో వైయస్ అభిమానులు చాలామంది ఉండేవారు కాబట్టి, ఆ ప్రాంతంలో వైసిపి, తెరాస పొత్తు పెట్టుకుని గణనీయంగా సీట్లు గెలిచేవారేమో! ఎందుకంటే అప్పటికే సిటీలో తప్ప తెలంగాణలో చాలా ప్రాంతాల్లో టిడిపిని కెసియార్ చితక్కొట్టేశాడు. మాట యిచ్చి తెలంగాణ యివ్వలేదన్న ఆరోపణ కాంగ్రెసుపై ఎలాగూ ఉంది. ఈ కూటమికి యిక్కడ కొన్ని సీట్లు వచ్చి, జగన్ ఆంధ్ర, ముఖ్యంగా రాయలసీమ నుంచి (ఉప యెన్నికలు గెలుస్తూ వచ్చాడు) కొన్ని కొట్టుకుని వస్తే బొటాబొటీ మెజారిటీతోనైనా ఎన్నికల అనంతరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేవేమో కూడా.
ఈ భయాలతోనే కాంగ్రెసు అడావుడిగా, ఆదరాబాదరగా, అవకతవకగా, అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టింది. ఆంధ్ర ఎలాగూ మనకి రాదు కదాని దానికి నున్నగా గుండు గీశారు. కెసియార్ వచ్చి చేరతాడు కాబట్టి తెలంగాణలో గెలుపు కచ్చితం అనుకుని హైదరాబాదుతో సహా అన్నీ కట్టబెట్టారు. విభజన జరిగాక కెసియార్ జెల్ల కొట్టాడంతో కాంగ్రెసు తెలంగాణలో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ఇక ఆంధ్రకు వచ్చేసరికి, విభజన ప్రకటన తర్వాత బాబు స్టార్ ఒక్కసారిగా లేచింది. హైదరాబాదు పోగొట్టుకున్న ఆంధ్రులు అలాటిది తమకు కట్టిపెట్టగలిగిన సామర్థ్యం ఉన్న చంద్రబాబే మనకు శరణ్యం అనుకున్నారు. అప్పటిదాకా ఆయనకు వరుస వైఫల్యాలే! తెలంగాణలో కెసియార్, ఆంధ్రలో జగన్ యిద్దరూ చెరో పక్క దిగలాగారు. విభజన పబ్లిక్ మూడ్‌ను తనకు అనుకూలంగా మారుస్తుందని ఓ పక్క గ్రహిస్తూనే, మరో పక్క తన బలం చాలదని గ్రహించారాయన.
2014 నాటికి మోదీ ఒక ప్రభంజనం. గుజరాత్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించి, అలాటి అచ్ఛే దిన్ దేశానికి కూడా తెస్తానని చెప్పి, ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాడు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు యిక ఆంధ్ర పరుగులే పరుగులు అనే అరచేతి వైకుంఠం చూపాలంటే బిజెపితో పొత్తు పెట్టుకోవాలని బాబు అనుకున్నారు. మీ యిద్దరూ కలిస్తే ఏ సీట్లూ అడగకుండా మీకు సాయం చేసి, జగన్‌కు ఛాన్సు లేకుండా చేస్తా అంటూ పవన్ వచ్చి చేరాడు. తనపై లక్ష కోట్ల అవినీతి ముద్ర, జైలు పక్షి, అనుభవరాహిత్యం, ఫ్యాక్షనిస్టు, కేసులు.. అని మీడియో హోరెత్తిస్తున్నా, జగన్ ముందుకు వచ్చి ఓట్లడిగాడు. ఒంటరిగా పోటీ చేసినా కూటమి కంటె 2.5% ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి. 67 సీట్లు తెచ్చుకున్నాడు. 2014-19లో ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ బలం పుంజుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 86% సీట్లు గెలిచాడు.
ఇప్పుడు అక్కణ్నుంచి కింద పడ్డాడు. 151లో మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలింది. తారాజువ్వలా ఎదిగినవాడు, ఉల్కలా కిందకు పడ్డాడు. ఎందుకిలా జరిగింది? ఎన్ని అవినీతి ఆరోపణలున్నా, ఎంత ఫాక్షనిస్టు ముద్ర ఉన్నా ప్రతిపక్షంలో ఉండగా వెంట నిలిచిన జనం యీనాడు యింత ఘోరంగా ఎందుకు ఓడించారు, నా ఏటిట్యూడ్‌లో, దృక్పథంలో, సమాజాన్ని వర్గీకరించే తీరులో, స్ట్రాటజీలో ఏమైనా పొరపాటు జరిగిందా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ‘అబ్బే ప్రతిపక్షం మాకు కొత్త కాదు, టర్న్ బై టర్న్ అన్నట్లు, టిడిపి పాలన ముగియగానే మాకే అధికారం వస్తుంది’ అని తనను తాను జోకొట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. 2019లో అధికారం వచ్చిందంటే ఊరికే రాలేదు. 2014 నుంచి గట్టిగా పోరాడితే, టిడిపి పాలనను అడుగడుగునా విమర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తేనే వచ్చింది.
ఇప్పుడేం చేస్తున్నారు? కూటమి పాలనపై పోరాటం సాగుతోందా? ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, పనులేవీ సాగటం లేదు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని టిడిపి పత్రికలే రాస్తున్నాయి. ప్రజలలో అసంతృప్తి ఉంది. 39% ప్రజల ప్రతినిథిగా వైసిపి పార్టీ దీనిపై ఆందోళనలు చేస్తోందా? కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తోందా? శాసనమండలిలో బొత్స చేత అడిగిస్తున్నారు కదా, శాసనసభకు మీరు వెళ్లి అడగడానికి ఏమొచ్చింది? ప్రతిపక్ష నాయకుడి హోదా యివ్వకపోతే వెళ్లరా? పోనీ ఆ కారణం చెప్పి జగన్ వెళ్లకపోవచ్చు. తక్కిన 10 మందికి ఏమైంది? వాళ్లకు ఏ హోదా ఉండదుగా! వాళ్లు వెళ్లి మాట్లాడవచ్చు. గతంలో అనేక అసెంబ్లీలలో ప్రతిపక్ష పార్టీ ముఖ్య నాయకుడు అసెంబ్లీకి గైరు హాజరు కావడం, తక్కిన పార్టీ సభ్యులు ప్రభుత్వాన్ని చీల్చి చెండాడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది.
2029 ఎన్నికలలో వైసిపి అభ్యర్థులు తమ ఓటర్లకు ముందుగానే చెప్పాలి – ‘చూడండి, నా ఒక్కణ్నీ గెలిపిస్తే లాభం లేదు. కనీసం 18 స్థానాల్లో మేం గెలిచేట్లు చేయాలి మీరు. జిల్లాలోని నియోజక వర్గాల్లో కాన్వాస్ చేస్తారో, పక్క జిల్లాకు వెళతారో మాకు తెలియదు. 18కి తక్కువ తెప్పిస్తే మాత్రం మేం అసెంబ్లీకి వెళ్లం, మీ గోడు అక్కడ వినిపించం. మా సాక్షి పేపర్లో ఏదో రాసుకుంటాం, సాక్షి టీవీలో వినిపిస్తాం. చదివినవాడు చదువుతాడు, విన్నవాడు వింటాడు. దట్సాల్.’ అని. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం అంత పట్టుదల ఎందుకు? అని అడిగితే ‘నాకు ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే అవకాశం వస్తుంది. లేకపోతే యివ్వరు.’ అని జగన్ వాదన. సరే అంతసేపూ మాట్లాడడానికి అవకాశం యిచ్చారనుకో. ఇచ్చాక తమరు మాట్లాడుతున్నంత సేపూ లక్ష కోట్లు, 11 సీట్లు, బాబాయి – గొడ్డలి, తల్లీచెల్లీ అని గొడవ చేస్తూనే ఉన్నారనుకో. అప్పుడేం చేస్తావ్?
2014-19 అసెంబ్లీ చూడలేదా? నోరెత్త నీయకుండా చేశారు కదా. అది చూసి ప్రజలు చికాకు పడే కదా బాబుని 23కి పరిమితం చేసి, మీకు 151 యిచ్చారు. ఇప్పుడూ వెళ్లు, మైకు యివ్వకుండా, మాట్లాడనీయకుండా చేస్తే ప్రజలే ఫీలవుతారు. ‘మనకు యిస్తానని ఎగ్గొట్టినవాటి గురించి, జగన్ అడుగుతూంటే ప్రభుత్వం చూడు ఎలా నోరు నొక్కేస్తోందో’ అనుకుంటూ దానికి తగిన శాస్తి చేస్తారు. వాళ్లు అలా రియాక్టు అవడానికి ఆస్కారం లేకుండా చేసి తమరేం బావుకుంటారు స్వామీ? అయినా ప్రజా సమస్యలు లేవనెత్తడానికి, ప్రభుత్వాన్ని యిరుకున పెట్టే ప్రశ్నలడగడానికి ఎంత టైము కావాలి? ఒకసారి అధికారంలో ఉండి, తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన నాయకులందరూ ‘మీ హయాంలో యిలా జరుగుతోంది’ అని చెప్పకుండా ‘మా హయాంలో యిది చేశాం, అది చేశాం’ అంటూ ప్రారంభించి, దానికే టైము తినేస్తారు.
చంద్రబాబైతే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ స్టయిల్లో ‘వినరో భాగ్యనగర బాబు కథ’ అంటూ గంటలు గంటలు గడిపేస్తారు. మీరు అలాటివి పెట్టుకోకుండా, మీ వీరగాథలు వినిపించకుండా, మీపై చేసే ఆరోపణలను పట్టించుకోకుండా ‘ఫలానా హామీ ఏమైంది? అప్పు తెచ్చినది దేనికి ఖర్చు పెట్టారు? అమరావతికి యిచ్చేది అప్పా? గ్రాంటా?’ వంటివి అడిగితే పెద్దగా సమయం పట్టదు. ప్రజలకూ ఓ తృప్తి – మన గురించే అడిగేడ్రా అని. ఇక తాము లేవనెత్తే పాయింటు ఒకటుంది – కనీసం 10% సీట్లు ఉండాలని రాజ్యాంగంలో లేదని! ఉండాలనీ లేదు, అక్కర లేదనీ లేదు. అన్నీ రాజ్యాంగంలో ఉండవు. కొన్ని సంప్రదాయం ప్రకారం నడుస్తాయి. గవర్నరు గారు వస్తే లేచి నిలబడాలని రాజ్యాంగంలో రాశారా? గవర్నరు ఎట్ హోమ్ యివ్వాలని, ఇఫ్తార్ విందు యివ్వాలనీ రాజ్యాంగంలో ఉందా?
అసలు తమరు కానీ, బాబు కానీ సంప్రదాయాలు పాటించారా? ఆయన అధికారంలో ఉన్నపుడు తమర్ని ప్రతిపక్ష నాయకుడిగా చూడలేదు, అఖిలపక్ష సమావేశం అంటూ పిలిచి మాట్లాడలేదు. తమరు అధికారంలోకి రాగానే డిటోడిటో. బదులు తీర్చేశారు. తమిళనాడులో చూడండి, హిందీ విషయం రాగానే అఖిలపక్షం పిలిచాడు స్టాలిన్. రాష్ట్ర ప్రత్యేక హోదా యివ్వటం లేదని అడగడానికైనా మీ రెండు పార్టీలు ఎప్పుడైనా కలిసి వెళ్లాయా? ఇలాటి సంప్రదాయాలు ఏమీ పాటించకుండానే ఆయనో ఐదేళ్లూ, తమరో ఐదేళ్లూ గడిపేశారు. ఆయన 2014లో మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి, ఏ సంప్రదింపులూ జరపలేదు. ఇప్పుడు గుర్తించక పోవడమనేది టెక్నికల్ సంగతంతే! దాని వలన నష్టమేముంది? 39% మంది ప్రజలు, 11 నియోజకవర్గాల ఓటర్లు గుర్తించారు కదా! కనీసం వాళ్ల పట్ల బాధ్యత లేదా?
కృష్ణ పక్షం తర్వాత శుక్ల పక్షం వచ్చి తీరుతుందన్నట్లు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఐదేళ్ల తర్వాత అధికారపక్షంగా ఆటోమెటిక్‌గా అయిపోతామ్న రూలు లేదు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పదేళ్లు, అనగా రెండు టెర్మ్‌లు ప్రతిపక్షంలో ఉన్నారు. పైన చెప్పినట్లు విభజన జరిగి ఉండకపోతే మళ్లీ అధికారాన్ని చవి చూసేవారన్న గ్యారంటీ లేదు. అయినా పోరాటం చేస్తూనే ఉన్నారు. మీలా కాడి పారేసి, కాళ్లు బారజాపి, శుక్లపక్షం రాగానే ప్రజలే పిల్చుకుని వెళ్లి కుర్చీలో కూర్చోబెడతారు అనుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాని ఎంత ఊపేసేది? ఎంత గడగడ లాడించేది? సూపర్ సిక్స్ ఏమైంది? అంటూ మీడియా ద్వారా రోజూ రచ్చ చేసేది కాదూ?
మీరేం చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లరు. ప్రజల్లోకి వెళ్లి పాలనలో లోపాలను వివరించరు. ఎన్నికల సమయంలో జీతం రెట్టింపు చేస్తామన్న హామీ యిచ్చి గెలవగానే ఉద్యోగం ఊడపీకిన వాలంటీర్లను పోగేసినా 2.5 లక్షలుంటారే! వారికి బాసటగా నిలబడ్డాం అన్నట్లు నిరాహార దీక్షో ఏదో చేపట్టారా? గ్రామ సచివాలయాలు ఎత్తేస్తారంటున్నారు. కనీసం రెండేళ్లు కొనసాగిస్తామని హామీ యివ్వండి. అంటూ ఆందోళనకు దిగవద్దూ? ఉద్యోగాలకు జీతాలు లేటుగా యిస్తున్నారట, ఐఆర్ యివ్వలేదట, డిఏ బకాయిలున్నాయట అంటూ వారి తరఫున ప్రభుత్వాన్ని నిలదీయరేం? ఆ వర్గాలు మీవి కావా? ‘నాది నాది అనుకున్నది నీది కాదురా’ అనే పాటలా, మీ బటన్ నొక్కుడు ఓటు బ్యాంకు కూడా సాంతం మీ సొంతం కాదని, పెన్షన్ ఎక్కువిస్తామనగానే గోడ దూకే బ్యాచ్ అనీ ఎన్నికలు చెప్పాయి కదా. ఇప్పటికైనా కొత్త వర్గాలను చేరువ చేసుకోవద్దా?
మీరు ప్రభుత్వంపై చేసే దాడికి వేదిక కల్పించే ఛానెల్ ఏది? సాక్షి పేపరు, సాక్షి టీవీ తప్ప తక్కినవేవీ మీవి కావు. మీ ప్రతికూల మీడియాతో పోలిస్తే సాక్షి రీచ్ ఎంత? అందుచేత క్షేత్రస్థాయిలో చిన్న చిన్న మీటింగులు ఏర్పాటు చేసైనా, మీ తరఫున మేం మీ హక్కుల కోసం పోరాడతాం అని ప్రజలకు చెప్పాలి. మీ ఒక్కరే కాదు, మీ క్యాడర్ అందరూ కదలాలి. ఇవేమీ చేయకుండా ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేస్తే చాలనుకుంటే అవివేకం. ఆ ఆబ్ లౌట్ చలే (జిస్ దేశ్‌మే..) పాటలో ఓ సూక్తి ఉంటుంది. ‘బహుత్ హై ముశ్కిల్, గిర్‌కే సంభల్‌నా’ (ఒకసారి పడ్డాక లేచి నిలదొక్కుకోవడం చాలా కష్టం) అని. మీరు మామూలుగా పడలేదు. చట్ట విరిగేట్లా పడ్డారు. మీరు మళ్లీ లేవగలరని మీ క్యాడర్‌కు, నాయకులకు నమ్మకం కుదిరేటంత బలంగా లేవాలి. నాయకులకు కుదరకే, ఒక్కోరూ విడిచి వెళ్లిపోతున్నారు.
ఇదే సమయంలో జగన్ పని పూరాగా అయిపోయిందని అనుకునే వాళ్లూ జాగ్రత్త పడాలి. 11 సీట్లు మాత్రమే వచ్చాయని ఆ అంకె మీద పన్ చేయడం, పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని ఎద్దేవా చేయడం.. యివన్నీ అవతలి వాళ్లని నవ్వించడానికి, కవ్వించడానికి బాగానే ఉంటాయి కానీ తాము స్వయంగా నమ్మితే మాత్రం దెబ్బ తినవచ్చు. చంద్రబాబు గురించి మాట్లాడినప్పుడు మాజీ ముఖ్యమంత్రి, 40 ఏళ్ల యిండస్ట్రీ అనే చెప్పేవారు కానీ కుప్పం ఎమ్మెల్యే అనలేదు కదా! జగన్‌కి యీ రోజు 11 రావచ్చు కానీ ఐదేళ్ల క్రితం 151 వచ్చాయి. ఇప్పటికీ 39.37% ఓటు బ్యాంకు ఉంది. ఐదేళ్ల క్రితం దాని కంటె 0.2% తక్కువగా 39.17% ఓట్లు తెచ్చుకున్న చంద్రబాబు యీనాడు స్వయంగా 135 సీట్లు తెచ్చుకుని 164 సీట్ల కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. బళ్లు ఓడలవుతాయి, ఓడలు బళ్లవుతాయనే సామెత మర్చిపోకూడదు. ఎవరికి ఎప్పుడు దశ పడుతుందో తెలియదు. 1967 వరకు అనేక ప్రధాన పదవులు అనుభవించి, ఇందిరా గాంధీ దెబ్బకు రాజకీయ ప్రాధాన్యం పోగొట్టుకుని రాజ్యసభ ఎంపీగా మిగిలిన నీలం సంజీవ రెడ్డి, ఎమర్జన్సీ ఎత్తేసిన తర్వాత జనతా పార్టీలో చేరి, దరిమిలా రాష్ట్రపతి అయిపోయారు. 1977లో ఆరు రాష్ట్రాల్లో ఒక్క పార్లమెంటూ సీటు గెలవలేక పోయిన ఇందిరా గాంధీ 1980లో మళ్లీ ప్రధాని అయిపోయింది.
కూలిన గోడలు కూలినట్లుండవు అనే దానికి ఉదాహరణలు చెప్పాలంటే తమిళనాడు పాలిటిక్స్ చూడాలి. 234 సీట్ల తమిళనాడు ఎసెంబ్లీలో 1991లో డిఎంకె కూటమికి 7 వస్తే, ఎడిఎంకె కూటమికి 225 వచ్చాయి. 1996 వచ్చేసరికి అవి 219, 4 అయ్యాయి. జగన్ 11ని హేళన చేసేవారు యీ 4ని గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు జయలలిత కూడా ఓడిపోయింది. 2001 వచ్చేసరికి యీ 4, 196 అయింది. డిఎంకెకు 37 దక్కాయి. 2006లో అది 163కి ఎగబాకింది. ఎడిఎంకె 69కి దిగజారింది. ఐదేళ్ల తర్వాత 203కి ఎగసింది. డిఎంకె 31 దగ్గర ఆగింది. బలాలు తారుమారు కావడం కొనసాగినా, యింతింత స్వింగ్స్ 2016 తర్వాతి నుంచి తగ్గాయి. 2016లో ఎడిఎంకెకు 136, డిఎంకెకు 98 రాగా 2021లో డిఎంకెకు 133, ఎడిఎంకెకు 66 వచ్చాయి.
ఇది గుర్తు పెట్టుకుంటే జగన్ పని అయిపోయింది అని గంతులేయడం సమంజసం కాదు. ‘పిక్చర్ అభీ భీ బాకీ హై’ అనుకోవాలి. 2019లో టిడిపికి 23 రావడంతో దాని పని ఖతం అనుకున్నవాళ్లు ఎలా నాలిక కరుచుకోవలసి వచ్చిందో, యిప్పుడు వైసిపి గురించి అనుకునేవాళ్లూ కరుచుకోవలసి రావచ్చు. అయితే తమిళనాడులో జరిగినట్టు ఐదేళ్లకోసారి అట్టు తిరగేసి తీరతారా అంటే చెప్పలేం. ఎందుకంటే అవి కూటమి విజయాలు. డిఎంకె, ఎడిఎంకెలకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది, కానీ గెలుపుకి అది చాలదు. కాంగ్రెసు అనే పెద్ద పార్టీ, బోల్డు చిన్నా చితకా పార్టీలు తమ తమ ప్రాంతాల్లో, తమ తమ కులాల్లో, తమ తమ వర్గాల్లో ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. కూటమి పక్షాల మధ్య బేరసారాలు కుదరడంలోనే ఉంది విజయరహస్యం.
ఆంధ్రలో టిడిపి ఒంటరిగా గెలవలేదన్న అవగాహన బాబుకి ఉంది. అందువలన కూటమి కడుతూనే ఉంటారు. వైసిపి మాత్రం యిప్పటిదాకా మూడు సార్లు ఒంటరిగా పోటీ చేసి, ఒకసారి గెలిచి, రెండు సార్లు ఓడింది. సింగిల్ వచ్చే సింహం కబుర్లు మానేసి కూటమి కట్టాలన్న యింగితం జగన్‌కి కలిగితే గిలిగితే చేతులు కలపడానికి పార్టీ లేవి? కాంగ్రెస్సంటారా, శర్మిల ధర్మమాని అది లుప్తమై పోతోంది. ఫలితాలు రాగానే జగన్ కాంగ్రెసులో చేరి పోతాడని అడావుడి చేసిన తెలుగు మీడియా నోరు మూత పడేట్లు, కాంగ్రెసు నాయకులే వచ్చి వైసిపిలో చేరుతున్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు, అవి ఆంధ్రలో వర్గపరంగా కాక కులపరంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి టిడిపికే క్లోజ్. జగన్ పేదల కోసం ఎన్ని పథకాలు తెచ్చినా, వాళ్లు జగన్‌తో చేతులు కలపనే కలపరు.
మరి? రాబోయే రోజుల్లో టిడిపి, జనసేనల్లో చీలిక వస్తే అప్పుడు కొత్త పార్టీలు పుట్టుకు రావచ్చు. లోకేశ్ వర్గం టిడిపిని కైవసం చేసుకోవడం నచ్చని టిడిపి నాయకులు ‘ప్రజాస్వామ్య టిడిపి’ అనో ‘ఎన్టీయార్ టిడిపి’ అనో వేరు కుంపటి పెట్టుకోవచ్చు. జనసేన విషయానికి వస్తే కొత్తగా వచ్చి పడుతున్న నాయకుల హవా పెరిగిపోయిందంటూ చీలిక రావచ్చు, ఊరికే కబుర్లతో పవన్‌ను టిడిపి బులిపిస్తోంది తప్ప పదవుల విషయంలో మొండి చేయి చూపిస్తోందంటూ కొందరు నాయకత్వంతో విభేదించి బయటకు రావచ్చు. పదవులన్నీ పవన్ కాపులకే యిప్పిస్తున్నారని ఆరోపిస్తూ కాపేతరులు బయటకు రావచ్చు. ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈ చీలిక పార్టీలంటూ ఏర్పడితే ఎన్నికలకు ముందో, తర్వాతో వైసిపితో పొత్తు పెట్టుకోవచ్చు. ఏం జరుగుతుందో తెలియదు. వేచి చూదాం.
– ఎమ్బీయస్ ప్రసాద్
Fafam alasi poyaav…inka gu dd a mu su ko..ch etta labnja ko da ka ..vad u mar adu….
Jyothi lo vac hia mady am da bbula meeda, 350 kilola go ld meeda art icle edi ..la nja kod aka..epp udu TDP, pav an pen ten aaa…
ప్రసాదు, ప్రజాస్వామ్య టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ అనో అంటూ టీడీపీ నీ హెచ్చరించటమేనా? లేకపోతే “విజయమ్మ వైసీపీ” లేక “భారతమ్మ వైసీపీ” అనో వైసీపీని కూడా హెచ్చరించి ఉండాల్సింది అని నెటిజన్లు భావిస్తున్నారు.
You have asked correct question sir.
ఆ ఫోటో ఒక్కటి చాలు.. పార్టీ లో మిగిలిన నాయకులు ఎవరో చెపుతోంది..
అష్ట దరిద్రాలన్నీ తిష్ట వేసుకుని కూర్చున్నట్టు.. వైసీపీ ప్రస్తుత దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోంది ..
గుడ్డిలో మెల్ల లా బొత్సా ఉన్నా.. పాపం అలా చీకట్లో కలిసిపోయాడు.. ఎప్పుడో గూడ దూకి పారిపోతాడు..
..
క్షమించాలి.. ఈ ఎంబీఎస్ ఆర్టికల్స్ నేను చదవను..
అన్నీ తనకే తెలిసినట్టు రాస్తుంటాడు.. కానీ నిజానికి.. నిష్టూరానికి కూడా తేడా తెలీని సన్నాసి..
జగన్ రెడ్డి ని ప్రశ్నిస్తున్నానని అనుకుని మొదలు పెడతాడు.. చివరికి జగన్ రెడ్డి భజన లో మునిగి పారవశ్యం చెందుతాడు..
కళ్ళు మూసుకున్నవాడికి వెలుగు..చీకటి తేడా తెలియదు..చెవిటివాడి ముందు శంఖం ఊది ఏం సాధించగలం?
మీరు అదృష్టవంతులు, ప్రసాదం గారు మీ కామెంట్స్ ను తన వ్యతిరేకులకు అన్వయించు కునారు. ప్రసాదు కత్తెర నుండి బయట పడినందుకు మీరు చాలా అభినందనీయులు!!
పరవస్తు చిన్నయ సూరి గారు నీతి చంద్రిక లో ఓ మాట చెప్పారు..”పోగాలం దాపురించినవాడు..వినడు,కనడు,మిత్రుల మాట మూర్కొనడు “…
సోది నా మొగ్గ:)
ఎంబీఎస్ గారు,
కొంపదీసి మీరు ఐ-ప్యాక్ బదులు వైసీపీ కి (under cover) political advisor గా మారారా ఏమిటి కర్మ? Ground reality తెలియకుండా ఇంట్లో కూర్చుని ఓ 5-6 పేపర్స్, మ్యాగజైన్స్ ముందర వేసుకుని మీరు రాసే వ్యాఖ్యానాలు ఎంత వాస్తవ విరుద్ధంగా (మీ పరిభాషలో చెప్పాలంటే ‘హాశ్చర్యకరంగా’) తేలిపోతాయో చూసుకోరా? వైసీపీ కి 151 సీట్లు వచ్చినప్పుడు మీరే వైసీపీ పాలన అత్యంత అధ్వాన్నంగా ఉంటే తప్పించి టీడీపీ 2024 అవకాశం లేదన్నారు. ఇప్పుడు అబ్బే టీడీపీ వైసీపీ కంటే ఎక్కువ ఇవ్వజూపటం వలన గెలిచింది అని సరాసరిగా కాకున్నా తెలివిగా ముక్తాయిస్తున్నారు. దేనిని అన్వయించుకోమంటారు? గత రెండు ఎలక్షన్స్ తీరును బట్టే చూస్తే ఏపీ లో 10% swing ఓటర్స్ ఉన్నట్టు భావించవచ్చు. 2019 లో 10% గా ఉన్న వైసీపీ ఆధిక్యం, ఇప్పుడు అటు తిరిగింది. Baselines మారలేదు – టీడీపీ 39.17%, వైసీపీ 39.38%. ఈ 10% డబ్బు పుచ్చుకునే/పుచ్చుకోగల ‘అర్హత’ లేని మధ్య తరగతి వారయింటారు. గత 5 ఏళ్లుగా వాళ్ళకి జరిగింది మరిచిపోవటానికి ఇంకొక 5 ఏళ్లు సరిపోకపోవచ్చు. మిగతా పార్టీలు మరిచిపోనివ్వవు. ఇప్పుడు జగన్ పాలన (???) మీద ప్రజలకి ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఇకనుంచి 2019 అంత తేలిక కాదు. ఆ 10% వారిని నమ్మగర్భంగా తిప్పుకోవటం ఒకటే దారి. అయినా చుట్టుప్రక్కల వందిమాగధుల్ని, అర్భకులని, ఎగిరి పోయే పక్షులని పెట్టుకుని, నేనొక్కడినే చాలు తొక్కి నార తియ్యటానికి అనుకుంటూ ఎవరు రాజకీయంలో మనగలిగారు? ఎన్టీఆర్ గారి చరిత్ర ఏమీ చెపుతోంది? ఇక్కడే CBN కి జగన్ కీ తేడా.
అయినా మీరు ఈ చంద్రబాబు జపం ఏంటండీ బాబు? మీరు వ్రాసిన articles ఒకసారి analyze చేసి చూసుకోండి. చంద్రబాబు గురించి మీరు cover చేసినట్టుగా టీడీపీ అనుకూల పత్రికలు కూడా చేసివుండవు. మీరు వ్రాయటం, మేము చదవటం. ఏమైనా అంటే నా ఇష్టం నా రాతలు, నచ్చక పోతే చదవద్దు అనే అహంకారం ఒకటి. మీరు పబ్లిక్ విషయాలపై comment చేస్తే మీకు అలా అనే హక్కు లేదు. కాబట్టి ఎందుకొచ్చిన లంపటం మీకు/మాకు. మీ బలాన్ని అనుసరించి ఆ డెటెక్టివ్ నవలలు ఏవో తిరగతిప్పి వ్రాస్తూండండి, ఉభయపక్షంగా ఉపయుక్తంగా ఉంటుంది.
Perfect analysis..
Nee la nti lan ja la aara tame tappa vaadiki lev adu….sare kani ma dyam dab bula mee da o article rai….kuk ka..
M B P R A S A D REDDY
VSR congress Radha ??? Lokesh politics lo leader ani settled ani tealusukovadanili mee aham meeku Addams vastondhi ? ( I am not have craze on him like on babu )
VSR Valla kodgiga kuduoulaki lonu avutumdhi… Epudu ilanti situAtions vacha menu vunna , menu rastha aunty vachestharu
Ikkade articles vasthunnayi Anna entha dhadhamo ani… Alanti vadini mostharu merry
Meeku antha istham vunte mee manavadiki ann Peru pettukondi. Anthe KaNi ila gnanahamkaram tho janalaki haani cheyakandi
Kuhana medavi ante ?? Oka article rayandi
1 1 palana kevalam freebies valla kadu neelanti oope kuha lu valla loss ayyindhi
Nava randralu techi villages ni entha worst ga chesadoo nee lanti neeli .. ki teliyedu
వైసిపి లో చీలిక రాదా ప్రసాద్ గారు..
వైసీపీ లో చీలిక వచ్చినా.. అది జగన్ రెడ్డి కే లాభం.. చంద్రబాబు కే నష్టం అంటూ ఒక ముదనష్టపు ఆర్టికల్ వదులుతాడు..
ఆ దరిద్రాన్ని కూడా చదవాల్సి వస్తుంది.. మన ఖర్మ…
already vachhibdhi kadha
already vachhibdhi kadha
తాను అన్నియ పల్లకిని మోస్తునంతవరకు, అలాంటివి సాధ్యం కాకపోవచ్చని మన ప్రసాదం ప్రగాఢ విశ్వాసం.
బూచేపల్లి,జూపూడి,సజ్జల, బొత్స,లచ్చిమీ పార్వతి,పిరుదు కల్యాణి..వావ్..అన్నీ య కి మిగిలేది వీళ్ళే.
గుర్తుందా సార్.. 2019 లో టీడీపీ కి 23 సీట్లు వచ్చాక మీరు తమిళనాడు example ఏమి చెప్పలేదు.. సరికదా బీజేపీ టీడీపీ ని కబలిస్తుంది అని కమ్మ సమాజం కొత్త లీడర్ ని వెతుక్కుంటుంది అని ఏదేదో రాసారు ఇప్పుడు టీడీపీ పవర్ లో ఉన్న కూడా టీడీపీ లోనో జనసేన లోనో చీలిక వచ్చి వైకాపా తో పొత్తు పెట్టుకుంటారు అని రాస్తున్నారు… మీ పెన్ను మీ ఇష్టం కానీ ఇలాంటి వి రాసి న్యూట్రల్ జర్నలిజం అనుకోమంటే కష్టం…
2019.లో ఎం రాసారు గుర్తుందా బీజేపీ టీడీపీ ని మింగేస్తుంది… కమ్మ సమాజం నాయుడు ని కాదు అని కొత్త నాయకత్వం ని ఎన్నుకోవచ్చు అని రాసారు
ప్రసాదం గారిది సెలెక్టివ్ మెమొరి, ఇలాంటి ఆణిముత్యాలు గుర్తుకు రావు. మీరు తెపించ కూడదు.
అధికారం లో ఉన్న విపక్షం లో ఉన్న టీడీపీ లోనే చీలిక రావచ్చు అని రాస్తారు… మన అన్న పార్టీ లో అలాంటి వి ఏమి జరగవు…
తాను అన్నియ పల్లకిని మోస్తునంతవరకు, అలాంటివి సాధ్యం కాకపోవచ్చని మన ప్రసాదం భావన.
మీ పెన్ను మీ ఆర్టికల్ మీ ఇష్టం కానీ దీనిని చూపిస్తా న్యూట్రల్ జెర్నలిజం అనుకోమంటే కష్టం
టీడీపీ విపక్షం లో ఉన్న అధికారం లో ఉన్న లోకేష్ తో టీడీపీ సీనియర్స్ కి పడి చావదు అంటారు… కానీ కోటరీ కంట్రోల్ లో అన్న పార్టీ లో మాత్రం చీలిక రాదు అంటారు
అలాంటి ఊహతేత ప్రశ్నలకు మన ప్రసాదం ఆమడ దూరంలో వుంటారు, ఓన్లీ వాస్తవంలో మాత్రమే పాఠకులను వుంచుతారు. మహానుభావుడు మన ప్రసాదం.
అంతా బాగానే ఉంది కానీ….ఇక్కడ ఒక చిన్న problem వుంది…..మీ పార్టీ సిద్ధాంతం మీద పెట్టింది కాదు….కేవలం SYMPATHY ని, శవాలను నమ్ముకుని పెట్టిన పార్టీ….అలాంటి SYMPATHY తో అధికారంలోకి వచ్చి ఈ 5yrs opposition parties ని, జనాన్ని, సొంత పార్టీ cadre ని యేలా హింసించారు అనేది చూశాక మళ్లీ అవకాశం ఇవ్వడం అనేది జరగడం అసంభవం…యెన్ని కొత్త శవాలను తీసుకుని వచ్చినా నమ్మరు….అంతే…
జగన్ ని హేళన చేసే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన వి సెలవిచ్చిన మీరు.. అవి టీడీపీ విపక్షం లో ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోకుండా బీజేపీ మింగేస్తుంది.. కొత్త నాయకుడు ని వెతుక్కుంటారు.. లాంటి ఆణిముత్యాలు ఎందుకు రాసినట్టు..
అలాంటి అణిముత్యాలని అవలీలగా మన ప్రసాదం విసురుతూనే వుంటారు, వాటిని మీరు ఎప్పటికైనా అనువయించు కోవచ్చు అంతే కానీ మీరు ప్రశ్నించకూడదు. అల కొడితే మీ కామెంట్స్ ఖండింప బడును, దీనిలో మన ప్రసాదం బాగా స్ట్రిక్ట్.
mari mastaru ki jeetam jeevitam yevaru isthunnaru ? greatredde kada? swami bhakiti chatukuntunnaru mastarau
Jagan gaadhu fagal gaadhu
Jagan gaadhu waste gaadhu
నిజమె! జగన్ కి జాకీలు వెయటం కొత్తం కాదు కదా మనకి!!!
Avunu
బానే వుంది కానీ అదేదో సినిమాలో చెప్పినట్టు ఇంత అనుభవం ఇంత జ్ఞానం అన్నని పైకి లేపటానికి వాడితే జనాల ఉసురు తగలగలదు. ఐనా ఆయనకే ….. వుంటే అక్క మొగుడితో పనేమున్నది అన్నట్టు, మనం ఎన్ని చెప్పినా అన్న మారడు, మళ్లీ రాడు. 20-25 సంllల వయస్సు దాటిన తర్వాత ఒక మనిషి క్యారెక్టర్ మారటం చాలా కష్టం. వద్దు బాబు వద్దు సమ్మజాన్ని విడగొట్టి విషం నింపే పాలన మళ్ళా వద్దు..అది వైఎస్ కొడుకైనా. హాయిగా ఇదే భ్రమలో ఉండి బ్రష్టుపట్టిపోని.
బానే వుంది కానీ అదేదో సినిమాలో చెప్పినట్టు ఇంత అనుభవం ఇంత జ్ఞానం అన్నని పైకి లేపటానికి వాడితే జనాల ఉసురు తగలగలదు. ఐనా ఆయనకే ….. వుంటే అక్క మొగుడితో పనేమున్నది అన్నట్టు, మనం ఎన్ని చెప్పినా అన్న మారడు, మళ్లీ రాడు. 20 – 25 సం ll ల వయస్సు దాటిన తర్వాత ఒక మనిషి క్యారెక్టర్ మారటం చాలా కష్టం. వద్దు బాబు వద్దు సమ్మజాన్ని విడగొట్టి విషం నింపే పాలన మళ్ళా వద్దు..అది వైఎస్ కొడుకైనా. హాయిగా ఇదే భ్రమలో ఉండి బ్రష్టుపట్టిపోని.
బానే వుంది కానీ అదేదో సినిమాలో చెప్పినట్టు ఇంత అనుభవం ఇంత జ్ఞానం అన్నని పైకి
హాయిగా ఇదే భ్రమలో ఉండి బ్రష్టుపట్టిపోని.లేపటానికి వాడితే జనాల ఉసురు తగలగలదు. ఐనా ఆయనకే ….. వుంటే అక్క మొగుడితో పనేమున్నది అన్నట్టు, మనం ఎన్ని చెప్పినా అన్న మారడు, మళ్లీ రాడు. వద్దు బాబు వద్దు సమ్మజాన్ని విడగొట్టి విషం నింపే పాలన మళ్ళా వద్దు..అది వైఎస్ కొడుకైనా. హాయిగా ఇదే భ్రమలో ఉండి బ్రష్టుపట్టిపోని.
బానే వుంది కానీ అదేదో సినిమాలో చెప్పినట్టు ఇంత అనుభవం ఇంత జ్ఞానం అన్నని పైకి లేపటానికి వాడితే జనాల ఉసురు తగలగలదు. ఐనా ఆయనకే ….. వుంటే అక్క మొగుడితో పనేమున్నది అన్నట్టు, మనం ఎన్ని చెప్పినా అన్న మారడు, మళ్లీ రాడు. 20-25 సంllల వయస్సు దాటిన తర్వాత ఒక మనిషి క్యా..రె…క్ట…ర్ మారటం చాలా కష్టం. వద్దు బాబు వద్దు సమ్మజాన్ని విడగొట్టి విషం నింపే పాలన మళ్ళా వద్దు..అది వైఎస్ కొడుకైనా. హాయిగా ఇదే భ్రమలో ఉండి బ్రష్టుపట్టిపోని.
ఏంటయ్యా పెద్దాయనా ఈ పిచ్చి రాతలు? వైఎస్ అంటే సోనియాకు మింగుడు పడలేదా? ప్రతి రోజూ సోనియా రాగం గాంధీ కుటుంబ తాళం వేశాడు కదయ్యా!!! జగన్ నీ వదిలించుకోవడానికి రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఇచ్చిందా? ఏంటో మీ ఊహలు విచిత్రంగా ఉన్నాయి
ముఖ్యమంత్రి గా చేశాడు.. వేల కోట్లు మింగేసాడు..అక్కడక్కడా మిగిలి వుంటే తల్లి చెల్లి నుండి కూడా లాగేసుకుంటున్నాడు.. కేస్ ల గురుంచి బాధ అసలే లేదు..ఇంకా ఎందుకు పోరాటాలు.. ఆరాటాలు.. ఏదన్నా ఓపిక వుంటే ఆ చివర ఆర్నెల్లు హడావుడి చేసి అదృష్టం పరీక్షించుకుంటే సరిపోతుంది.
ఏంటయ్యా పెద్దాయనా ఈ పిచ్చి రాతలు? వై*ఎస్ అంటే సో*ని*యాకు మింగుడు పడలేదా? ప్రతి రోజూ సో*ని*యా రాగం గాం*ధీ కుటుంబ తాళం వేశాడు కదయ్యా!!! జ*గ*న్ నీ వదిలించుకోవడానికి రాష్ట్రాన్ని విభజించి తె*లం*గా*ణ ఇచ్చిందా? ఏంటో మీ ఊహలు విచిత్రంగా ఉన్నాయి
వైసిపిలో చీలిక రాదా? అని అడుగుతున్నారు కొందరు పాఠకులు. రావచ్చు. కానీ దాన్ని చీలిక అనడం కంటె కొందరు వీడిపోవడంగా నిర్వచించాలి. ఎందుకంటే అది ఏక వ్యక్తి పార్టీ. టిడిపిలా దశాబ్దాలుగా నిలబడి, పటిష్టమైన యంత్రాంగం ఉన్న పార్టీ కాదు. దానిలోకి వచ్చిన వారందరూ ఫిరాయింపుదారులే. ఆ పార్టీలో జగన్ తప్ప వేరే నాయకుడంటూ లేడు. తక్కినవాళ్లని ఎదగనీయలేదు. అంతర్గత చర్చలూ లేవు. జగన్ గాలి వేస్తే పార్టీ గెలుస్తుంది, వీయకపోతే ఓడుతుంది.
టిడిపి అలా కాదు. చంద్రబాబు భుజాల వరకు వచ్చే నాయకులు కొందరున్నారు. టెక్నికల్‌గా ఆయన కంటె సీనియర్లూ ఉన్నారు. దశాబ్దాలుగా తమ నియోజకవర్గాల్లో పని చేస్తూ బలంగా ఉన్నవాళ్లున్నారు. బాబు మీద అభిమానం కలిగి, లోకేశ్ మీద లేనివారు టిడిపి నాయకుల్లోనూ, అభిమానుల్లోనూ ఉన్నారు. లోకేశ్ ను ముందుకు తేగానే కొంత గందరగోళం రావచ్చు. కరుణానిధి స్టాలిన్‌ను తెచ్చినపుడు డిఎంకెలో ప్రముఖ నాయకులు పార్టీ వీడి వెళ్లారు.
టిడిపిని బిజెపి చీల్చవచ్చు అనే ఊహ నాకు యిప్పటికీ ఉంది. అనేక రాష్ట్రాలలో దానితో పొత్తు ఉన్న పార్టీలను అది అలాగే చీల్చింది. పవన్ తన ప్రభుత్వంపై తానే విమర్శలు చేయడం వెనుక, బిజెపి ప్రోద్బలం ఉందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు.
వైకాపా ని చీలుస్తుంది అనిపించడం లేదా.. వీసా రెడ్డి ఉదంతం గురించి కూడా చాలా మంది విశ్లేషకులు చెప్పిన సంగతి మీ వరకు రాలేదా???
బీజేపీ అధికారం లో ఉన్న లేకున్నా టీడీపీ నే చీలుస్తుందా…. వైకాపా ని మాత్రం ఊపిరి loodutu ఉంటుంది
సీనియర్స్ స్టాలిన్ ని తెస్తే పార్టీ ని వదలి వెళ్ళారా లేకపోతే పార్టీ ని చీల్చి పెట్టారా???
Trs me emi cheelchatledhu kendram… 2 states local parties ni emi cheyaru eppatiki… Endhukante kappalu kattaru kabatti
.
టైటిల్ జస్టిఫికేషన్ మాత్రం సరిపోయింది… మీ రాతలు చూసాక మాలాంటి న్యూట్రల్ పాఠకులు “మాకు కూడా ఇదేం కొత్త కాదు” అనుకుంటున్నారు…
At present showing 15 comments only… Many of comments are deleted.
మాష్టారు తన భావ వ్యక్తీకరణను అపరిమిత స్వేచ్ఛతో వాడుకుంటారు, ఇతరుల విషయంలో మన సారు బాగా స్ట్రిక్ట్, అంట కత్తెర వేసేస్తారు.
బాగా చెప్పారు. నా కామెంట్ కూడా నచ్చలేదనుకుంటా తీసిపడేశాడు. ఆ మాత్రం దానికి పాఠకులు దేనికో? ఆస్థాన వంధి మాగాధులుని పెట్టుకోవచ్చుగా. ఇలా చెసే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. చింత చచ్చినా పులుపు పోనట్టు వీళ్లు ఈ జన్మకి ఇంతే.
బాగా చెప్పారు. నా కామెంట్ కూడా నచ్చలేదనుకుంటా తీసిపడేశాడు. ఆ మాత్రం దానికి పాఠకులు దేనికో? ఆస్థాన వంధి మాగాధులుని పెట్టుకోవచ్చుగా. ఇలా చెసే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. చింత చ..చ్చి..నా పులుపు పోనట్టు వీళ్లు ఈ జన్మకి ఇంతే. ఇప్పుడు చూడండి పొద్దున్నే పళ్లు కూడా తోమోకోకుండా కత్తెర పట్టుకుని బయలదేరుతారు మళ్లీ.
బాగా చెప్పారు. నా కా..మెం..ట్ కూడా నచ్చలేదనుకుంటా తీసిపడేశాడు. ఆ మాత్రం దానికి పాఠకులు దేనికో? ఆస్థాన వంధి మాగాధులుని పెట్టుకోవచ్చుగా. ఇలా చెసే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. చింత చ..చ్చి..నా పులుపు పోనట్టు వీళ్లు ఈ జన్మకి ఇంతే. ఇప్పుడు చూడండి పొద్దున్నే పళ్లు కూడా తోమోకోకుండా కత్తెర పట్టుకుని బయలదేరుతారు మళ్లీ.
బాగా చెప్పారు. నా కామెంట్ కూడా నచ్చలేదనుకుంటా తీసిపడేశాడు. ఆ మాత్రం దానికి పాఠకులు దేనికో? ఆస్థాన వంధి మాగాధులుని పెట్టుకోవచ్చుగా. ఇలా చెసే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. చింత చ..చ్చి..నా పులుపు పోనట్టు వీళ్లు ఈ జన్మకి ఇంతే. ఇప్పుడు చూడండి పొద్దున్నే పళ్లు కూడా తోమోకోకుండా కత్తెర పట్టుకుని బయలదేరుతారు మళ్లీ.
బాగా చెప్పారు. నా కా..మెం..ట్ కూడా నచ్చలేదనుకుంటా తీసిపడేశాడు. ఆ మాత్రం దానికి పాఠకులు దేనికో? ఆస్థాన వంధి మాగాధులుని పెట్టుకోవచ్చుగా. ఇలా చెసే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. చింత చ..చ్చి..నా పులుపు పోనట్టు వీళ్లు ఈ జన్మకి ఇంతే. ఇప్పుడు చూడండి పొద్దున్నే పళ్లు కూడా తోమోకోకుండా కత్తెర పట్టుకుని బయలదేరుతారు మళ్లీ.
//తండ్రి హఠాన్మరణం తర్వాత వైయస్ అనుచరగణం యితని చుట్టూ మూగారు. వారి బలం చూసుకుని జగన్ అధిష్టానాన్ని ధిక్కరించాడు//
సొంత చిన్నాన్న, ఆత్మలా ఉన్న కేవీపీ, సూరీడు, ధర్మాన
బ్రదర్స్, బొత్స, కన్నా, జేసీ బ్రదర్స్ తదితరులు ఎందుకు రాలేదో? మొదటగా తోడు వచ్చిన శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆళ్ళ నాని, మేకపాటి ఫ్యామిలీ, సుచరిత, బాలినేని తదితరులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో?
//ఎందుకంటే అప్పటికే సిటీలో తప్ప తెలంగాణలో చాలా ప్రాంతాల్లో టీడీపీని కేసీఆర్ చితకొట్టేశాడు//
రాజశేఖర్ రెడ్డిది ఒక డైలాగ్ ఉంటది పట్టుమని పది సీట్లు గెలవలేదు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా రాజేంద్రా అని. అదీ కేసీఆర్, తెరాస పరిస్థితి. 2014 లో కూడా 60 మ్యాజిక్ ఫిగర్, తెరాస కి వచ్చింది 64 బొటాబొటి మెజారిటీ .చావు నోట్లో తలకాయ పెట్టిన, నేనే తెలంగాణ తెచ్చిన అని డప్పు కొట్టుకున్నాక కూడా
//అప్పటిదాకా ఆయనకు వరుస వైఫల్యాలే. తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రాలో జగన్ చెరో పక్క దిగలాగారు//
2013 ఉమ్మడి ఆంధ్ర పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, మిగిలిన టీడీపీ, వైసిపీ, తెరాస ఎన్ని గెలిచాయో ఒకసారి చూసి అప్పుడు చెప్పండి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
//తెలంగాణలో వైయస్ అభిమానులు చాలా మంది ఉండేవారు కాబట్టి//
వాళ్ళే అనుకుంటా మానుకోటలో రాళ్ళు వేసింది
ఆర్టికల్ చూస్తుంటే జగన్ మీద అతని పార్టీ మనుగడ మీద మీ తండ్రి మనసూ ఎంత తల్ల డిల్లుతుంది అతని మేలు కోసం ఎన్ని ఉపమానాలు తేవాల్సింది ఎన్ని ఓహాలు చెయ్యాల్సింది. మాకు అర్థం అయింది . పాపం …..
2014 లో తెలంగాణ లో ఖమ్మం, మహబూబ బాద్ ప్రాంతాల్లో వైస్సార్ సీపీ కమ్మునిస్ట్ లతో పొత్తు పెట్టుకున్నారు. ఒంటరిగా పోటీ చేసాడు 3 ఎన్నికల్లో అని ఎలా అంటావ్.. 119 స్థానాల్లో అభ్యర్థులు లేక కొన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలపలేదు..
ఆఁయ్… అలాగేనండి.
నువ్వు చెప్పినంత ఈజీ కాదు వైసీపీ నే ఎందుకు ప్రత్యామ్నాయ పార్టీ గా చూడాలి.. ఆంధ్రప్రదేశ్ జనాలు కు ల , మత, వర్గ ప్రాధిపడదికన చాలా క్లియర్ గా విడిపోయారు దాని ప్రభావమే టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక తో 90% విజయం పొందింది. వైసీపీ కి దేనికి ఓటు వేయాలి… జగన్ వైస్సార్ కొడుకు అనే ట్యాగ్ లేకుండా, వైస్సార్ చనిపోయిన సానుభూతి కాకుండా, వైస్సార్ పెరు పార్టీ పేరు లో లేకుంటే (పార్టీ ని కూడా ఇంకొక్కరి నుండి తీసుకున్నాడు), ఇవి కాకుండా జగన్ అంటే ఏంటి. ఏమైనా స్వతంత్ర ఉద్యమం చేశాడా.. లేకుంటే తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు లాగా తెలంగాణ కోసం కేసీఆర్ లాగా ఉద్యమాలు చేశాడా… పోనీ ప్రత్యేక హోదా సాదించడా ఏమైనా కొత్త రాజధాని కట్టినాడా.. ప్రకాశం నుండి శ్రీకాకుళం వరకు రెడ్డి ప్రాబల్యం తక్కువ. వేరే కులాల వాళ్ళు రెడ్డి కుల ప్రాంతీయ వారసత్వ పార్టీ వైసీపీ కి ఎందుకు ఓటు వేయాలి… నువ్వు టీడీపీ గురుంచి ఆడగవచ్చు, అది తెలుగు వాళ్లకు వాళ్ళ ఆత్మగౌరవం కోసం సెపరేట్ పార్టీ ఉండాలి అని, అప్పటి సినీ పాపురిటీ ఆసరా తో, పటేల్ పట్వారీ, కరణం వ్యవస్థ లకు వ్యతిరేకంగా, పితృస్వామ్య దేశంలో , రాష్ట్రాల్లో అడబిడ్డలకు ఆస్తి హక్కు, వేరే పార్టీ ల నుండి వచ్చిన వారితో కాకుండా కొత్త వారి తో రాజకీయం, బీసీ లకు రాజకీయ ప్రాధన్యం లాంటి ఎన్నో కారణాలతో టీడీపీ కి సంస్థాగత కార్యకర్తలు ఉన్నారు అయునప్పటికి టీడీపీ కి మునుపటి పట్టు లేదు. నేను కు ల ప్రాతిపదిక వారసత్వ ప్రాంతీయ పార్టీ లకు వ్యతిరేకం.. మేము ఇంత చేసాము అని చెప్పుకుంటున్న వైసీపీ ని, వైసీపీకి కృత్రిమంగా వచ్చిన పాలపొంగు ఎలా కరిగిపోయుందో మొన్నటి ఎన్నికల్లో చూశావ్… రాష్ట్రంలో 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లు కనీసం పోటీ లేక వైసీపీ అధికారహయం లో రాయలసీమ తో సహా 3 ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయారు. నిన్న జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేక పారిపోయారు.. అర్థం అవ్వలేదా చదువుకున్న వాళ్ళు ఎవరు జగన్ కి సపోర్ట్ చేయట్లేదు అని… ఇవి మీరు ఎపుడు నిందించే evm ఎన్నికలు కాదు బ్యాలెట్ తో జరిగాయి..
పోను పోను 39.4% వైసిపి కి ఓటు వేసిన వాళ్ళు కూడా జగన్ గురుంచి తెలుసుకుంటారు .
గత 5 ఏళ్లలో జరిగిన ఆరాచకం చూసి కూడా మీరు జగన్ phoenix పక్షి లాగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు అంటే ఏమానాలో అర్ధం కాకుండా ఉంది. ఎంత మీరు తెలంగాణ నివాసులయినా ఆంధ్ర ప్రజల మీద ఇంత కక్షా?1?
నేను కోరుకుంటున్నాను అని వ్యాసంలో ఎక్కడైనా ఉందా?
అన్నీ డైరెక్ట్ గా చెప్ప రు అర్థం అవుతాయి ఇంటెంట్ . తెల్సుతుంది తప్పేంటి కోరుకుంటే .ఇంతకుముందు మీరే అన్నారు 2023 లో అనుకుంటా .అసలు పల్లె టూరి వోట్ అంత వైసిపి దే కథ .అసలు టీడీపీ గెలవలేదు అని ఒక అర్తికలన్లో
hammayya .. korukoknadi please… meelo inka maanavatvam undani niroopinchandi.. ikkadevariki YSR party meeda kaksha ledu.. prajaswamyam lo gelupu votamulu vimarsalu abadhapu pracharalu sahajam … kaani Je’Gun vachhaka baaga avi chaala asahajam gaa tayarayyayi.. prati paksham vundatam prajaswamyaniki chaala avasaram.. kaani mee Je’Gun raatranni prabhutvanni nadipe chaakachakyam ledu.. chebite vinadu… ..
hammayya .. korukoknadi please… meelo inka maa’navatvam undani niroopinchandi.. ikkadevariki Y’SR party meeda kaksha ledu.. prajaswamyam lo gelupu votamulu vimarsalu abadhapu pracharalu sahajam … kaani Je’Gun vachhaka baaga avi chaala asahajam gaa tayarayyayi.. prati paksham vundatam prajaswamyaniki chaala avasaram.. kaani mee Je’Gun raatranni prabhutvanni nadipe chaakachakyam ledu.. chebite vinadu… ..
Well said
మరి ఈ వ్యాసం ఉద్దేశం ఏమిటి మరి?
మీరు ఆలా కోరుకోనప్పుడు .. హెచ్చరికలు ఎందుకు ..వ్యాసం ఎందుకు ..
మీ ఊహలకు నేను బాధ్యుణ్ని కాను. వ్యాసంలో ఏం రాశానో దాన్ని గురించి మాట్లాడండి చాలు.
ఉద్యోగులకు జీతాలు లేటుగా ఇస్తున్నారని జగన్ ప్రశ్నించాలా? ఎలా?! తను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఒకటో తారీకు కల్లా ఇచ్చాడా?
రెండున్నర లక్షల వలంటీర్లని బాబు పీకేశాడా?! అసలు ఆగస్టు 2023 కే వాళ్ళ పదవీకాలం ముగిసింది కదా?! మరి extend చేస్తూ జగన్ GO ఇవ్వకుండా ఇప్పుడు బాబుని ఎలా నిందిస్తారు? మరి వాళ్ళకి పదివేలు జీతం ఎలా ఇస్తామన్నారు అని వాదించకండి. తను అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటే అలాగే పెంచేవాడేమో?! ఆ అవకాశం లేకుండా చేసింది జగనే!
సూపర్ సిక్స్ ఏమైంది అంటే నీ మద్య నిషేధం హమీ ఏమైందో, జాబ్ క్యాలెండర్ హమీ ఏమైందో ఇది కూడా అంతే అయింది అంటే జగన్ దగ్గర సమాధానం ఉందా?! ఇవన్నీ ఆలోచించే జగన్ calm గా కూర్చున్నాడు. మీరేమో తెగ ఆవేశపడ్డారు.
బాబు గెలవగానే వాలంటీర్ల ఉద్యోగాలు పీకేశాడా? ఆగస్టు 2023 నాటికే వాళ్ళ నియామకాల కాలపరిమితి ముగిస్తే extend చేయకుండా జగన్ కదా వాళ్ళని పీకింది? మరి బాబు వాళ్ళ జీతం పెంచుతానని ఎలా అన్నాడని ఆశ్చర్యపోకండి! వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయో, ఊడాయో తెలిసే అవకాశం బాబుకి ఏదీ?! మన చీకటి ప్రభుత్వంలో అన్నీ చీకటి జీవోలే కదా?! వాళ్ళ ఉద్యోగాలు ఉంటే బాబు పెంచేవాడేమో? ఆ అవకాశం లేకుండా చేసిన ఘనత జగన్ దే కదా?!
ee MBS dabbulu isthe Dappulu kotte vyakthi.
జగన్ రెడ్డి ని ప్రశ్నిస్తు మొదలు పెట్టి.. జగన్ రెడ్డి కి జాకీ వెస్తూ ముగించారు!
.
నిజమె! జగన్ కి జాకీలు వెయటం మనకి కొత్తం కాదు కదా !!!
అసలు వివేకా కేసు. ను సునీత అనవసరంగా బయటికి తెచ్చారు అని రాశారు నాకు బాగా గుర్తుకు ఉంది
సిద్ధాంతాల మీద పెట్టిన పార్టీ లకు….SYMPATHY, శవ రాజకీయం మీద పెట్టిన పార్టీ కి చాలా వ్యత్యాసం వుంటుంది….SYMPATHY తో అధికారంలోకి వచ్చి, విచ్చలవిడి తనం తో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు బాధపడడం మూర్ఖత్వం…అంతే…అలాంటి వాళ్ళకి ఇంకా నీతులు చెప్పడం కేవలం తెలివి తక్కువతనం….అంతే…
వైసీపీ గెలిచినప్పుడు మీరు రాసిన పాద యాత్ర వ్యాసాల సంకలనాన్ని మీ ఎడిటర్ గారు మీరు లేకుండా డల్లాస్ లో ఆవిష్కరించినట్టు గుర్తు. వైసీపీ అధయక్షుడికి తెలుగు చదవడం రాదని వినికిడి . ఈ వ్యాసాన్ని ఇంగ్లీష్ లో తిరగరాసి మీ ఎడిటర్ గారిని pampi వినిపిస్తే బాగుంటుందేమో
తమరి జ్ఞానం అలా అఘోరించింది. పాదయాత్రపై పుస్తకం రాసినది కె. రామచంద్రమూర్తి గారు ‘జయహో’ పేర. నేను రాసినది పదేళ్ల ప్రస్థానంపై! దానిలో పాదయాత్ర గురించి ఒక్క ముక్కా లేదు. డాలస్‌లో ఆవిష్కరించినప్పుడు నేనే కాదు, మా ఎడిటరూ లేడు. 2019 వరకు జరిగిన ప్రస్థానం గురించిన పుస్తకం. ఐదేళ్ల తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది? చరిత్ర రికార్డు చేయడానికి తప్ప! ఏదో వెక్కిరించేస్తున్నామని ఆనందంలో సరిగ్గా చెక్ చేసుకోకపోతే యిలాగే ఉంటుంది. అయినా ఒక విషయం గ్రహించండి. నాయకులకు ఒక స్థాయికి చేరాక పుస్తకాలు స్వయంగా చదివే తీరిక ఉండదు. ఆ భాష వచ్చిన చేతనైనా చదివించి, సారాంశం చెప్పించుకుంటారు. జగనైనా, బాబైనా, లోకేశైనా, మోదీ ఐనా అంతే.
Find a way to reach right person who supposed to read and react. This looks like internal party memo.
vacchadaa aasthana dappulu kotte artiste?
బానే వుంది కానీ అదేదో సినిమాలో చెప్పినట్టు ఇంత అనుభవం ఇంత జ్ఞానం అన్నని పైకి లేపటానికి వాడితే జనాల ఉసురు తగలగలదు. ఐనా ఆయనకే ….. వుంటే అక్క మొగుడితో పనేమున్నది అన్నట్టు, మనం ఎన్ని చెప్పినా అన్న మారడు, మళ్లీ రాడు. 20 – 25 సం ll ల వయస్సు దాటిన తర్వాత ఒక మనిషి క్యా..రె..క్ట..ర్ మారటం చాలా కష్టం. వద్దు బాబు వద్దు సమాజాన్ని విడగొట్టి విషం నింపే పాలన మళ్ళా వద్దు..అది వైఎస్ కొడుకైనా. హాయిగా ఇదే భ్రమలో ఉండి బ్రష్టుపట్టిపోని.
ఈ వ్యాసం నిందాస్తుతి లాగా ఉంది. జగన్ కి మార్గాన్ని నిర్దేశిస్తున్న ఒక అభిమాని ఆవేదన వలె ఉంది కానీ విశ్లేషణలా లేదు. జగన్ ని అసెంబ్లీకి వెళ్ళమని మీరు సలహా ఇస్తున్నారు సరే, ఎందుకు వెళ్ళడం లేదో తెలియడంలేదా? అందరు ఎం. ఎల్.ఏ. లతో కలిసి వెనుక వరుసల్లో కూచ్చోడానికి ఆయన అహం అడ్డు వస్తుందని అర్థం కాలేదా?
ఆయనకు ఎంత అహం ఉంది అనేది నాకు అర్థం కాదు. తనను పడతిట్టిన బొత్సను తన పార్టీలో ఎందుకు చేర్చుకున్నాడో తెలియదు. అలాగే కొందరు టిడిపి నాయకుల్ని కూడా చేర్చుకున్నాడు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఏమైనా చేయగలరు. దీనిలో స్తుతి ఏం కనబడిందో మీకు! వ్యాసమంతా హెచ్చరికలే. వైసిపికి, దాని ప్రత్యర్థులకూ!
మా నెల్లూరు పెద్ద రెడ్లలో ఒకడైన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ పెట్టిన కొత్తల్లో బాబూ అని ఏదో చెప్పబోతే, don’t call me babu gibu call me only jagan sir అన్నాడంట. ఇలా ఉచిత సలహాలు ఇచ్చే పనైతే కలవడానికి రావద్దు అన్నాడంట. ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డికి కూడా అదే ట్రీట్మెంట్. ఇంకొందరు పెద్ద రెడ్లు అయిన వేమిరెడ్డి దంపతులు, ఆనంకి కూడా అదే ట్రీట్మెంట్. వేమిరెడ్డి కోరుకుంది పదవులు, డబ్బులు కాదు గౌరవం. వేమిరెడ్డి అంటే అన్నీ పార్టీల్లో సౌమ్యుడు అన్న అభిప్రాయం ఉంది. జగన్ కోసం జడ్జీలకి వాచీలు కూడా బహుమతులు యిచ్చాడు. అలాంటి వేమిరెడ్డి ఎందుకు వెళ్లిపోయాడో, లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, రఘురామ కృష్ణంరాజు తదితరులు ఎందుకు వెళ్లిపోయారో ఆలోచించండి.
“జగన్ ఎసెండింగ్ స్టార్, రాష్ట్రం విడిపోకుండా ఉండి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో జగన్ ప్రబుత్వం ఏర్పాటు చేసి ఉండేవాడు, జగన్ ని జైల్లో పెట్టినా అతని పార్టీ చెక్కు చెదరలేదు” వీటిలో మీకు స్తుతి కనిపించదు. నిజం మాట్లాడుతున్నాను అనుకుంటారు కానీ చూసేవారికి అర్థం అవుతుంది. జగన్ అహం గురించి ఆ పార్టీ వదిలిన చాలా మంది చెప్పారు. వైసీపీకి 151 సీట్లు వస్తే “వచ్చే ఐదేళ్లల్లో అతను చాలా చెత్తగా పాలిస్తే తప్ప ఇక వేరేవారికి గెలిచే ఛాన్స్ లేదు” అన్నారు. ఎన్నికల ముందు కూడా 25% సీట్లు కోల్పోయినా కూడా తిరిగి అధికారంలోకి వచ్చేస్తాడు అని నమ్మారు. ఇప్పుడు మాత్రం అయిదేళ్లలో కథ మారవచ్చు, టీడీపీ ముక్కలవ్వవచ్చు, ఏమో గుర్రం ఎగరా వచ్చు అని ఆశాభావం కనబరుస్తారు. మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తే కాయండి అది మీ ఇష్టం కానీ నేను న్యూట్రల్ అని మాత్రం చెప్పుకోకండి. ఎబ్బెట్టుగా ఉంటుంది.
“జగన్ ఎసెండింగ్ స్టార్, రాష్ట్రం విడిపోకుండా ఉండి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో జగన్ ప్రబుత్వం ఏర్పాటు చేసి ఉండేవాడు, జగన్ ని జై…ల్లో పెట్టినా అతని పార్టీ చెక్కు చెదరలేదు” వీటిలో మీకు స్తుతి కనిపించదు. నిజం మాట్లాడుతున్నాను అనుకుంటారు కానీ చూసేవారికి అర్థం అవుతుంది. జగన్ అహం గురించి ఆ పార్టీ వదిలిన చాలా మంది చెప్పారు. వైసీపీకి 151 సీట్లు వస్తే “వచ్చే ఐదేళ్లల్లో అతను చాలా చెత్తగా పాలిస్తే తప్ప ఇక వేరేవారికి గెలిచే ఛాన్స్ లేదు” అన్నారు. ఎన్నికల ముందు కూడా 25% సీట్లు కోల్పోయినా కూడా తిరిగి అధికారంలోకి వచ్చేస్తాడు అని నమ్మారు. ఇప్పుడు మాత్రం అయిదేళ్లలో కథ మారవచ్చు, టీడీపీ ముక్కలవ్వవచ్చు, ఏమో గుర్రం ఎగరా వచ్చు అని ఆశాభావం కనబరుస్తారు. మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తే కాయండి అది మీ ఇష్టం కానీ నేను న్యూట్రల్ అని మాత్రం చెప్పుకోకండి. ఎబ్బెట్టుగా ఉంటుంది.
అయ్యా ఎం.బి.ఎస్. గారు మీకు నచ్చినవే వినాలంటే మా దాకా ఎందుకు?
” నా కా..మెం..ట్ కూడా నచ్చలేదనుకుంటా తీసిపడేశాడు. ఆ మాత్రం దానికి పాఠకులు దేనికో? ఆస్థాన వంధి మాగాధులుని పెట్టుకోవచ్చుగా. ఇలా చెసే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. చింత చ..చ్చి..నా పులుపు పోనట్టు వీళ్లు ఈ జన్మకి ఇంతే. ఇప్పుడు చూడండి పొద్దున్నే పళ్లు కూడా తోమోకోకుండా కత్తెర పట్టుకుని బయలదేరుతారు మళ్లీ”
జనసేన పార్టీ కూడా వైకాపా మాదిరి ఏక వ్యక్తి పార్టీయే. సంస్థాగత నిర్మాణం లేదు.
పేపర్ బాలెట్ మీద సాగే ఎంఎల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండటం మీద మీ అభిప్రాయం రాసి ఉంటే బాగుండేది.
పోటీ నుంచి తప్పుకున్నారంటే దాని అర్థం బలం లేదని తమకే తెలియడం. ఇప్పుడు వైసిపి చేసినా, గతంలో స్థానిక ఎన్నికల్లో, తెలంగాణలో టిడిపి చేసినా అదే అర్థం.
అంటే ఈవీయం సాయంతో కూటమి గెలిచింది అని వైసీపీ వారు చెబుతున్న మాటలు వట్టి మాటలు అని మీరు కూడా అనుకుంటున్నారా?
సీబీఎన్ మీద మీ ద్వేషం – జగన్ మీద మీకున్న అభిమానం తప్ప ఇందులో ఎం లేదు .. జగన్ ని 11 ani హేళన చేస్తున్నారు అని చెప్పిన మీరు సీబీఎన్ ని సీట్లు అని హేళన చేసింది అవమానించింది మరచిపోవడం మీ వైఖరిని తెలియజేస్తుంది..
Nijame
హిందూ పురాణాల్లోనే ప్రపంచమంతా ఏ రాజనీతి అయినా చెప్పేది శత్రువు బలాబలాల్ని సరిగ్గా అంచనా వేయటమూ, అవతలివాడి లోపాలు గ్రహించటమూ ఎవరికైనా విజయరహస్యం.
జగన్ తనకు వచ్చిన 151 సీట్లూ తన మీద ప్రేమ పొంగిపొర్లి ఇచ్చినవి అనేది తొలిభ్రమ.
చంద్రబాబు సెల్ఫ్ డబ్బా తప్ప పని శూన్య నిష్క్రియత్వమూ, కేవలం ఒక కులానికే అన్ని లాభాలూ అన్న విధానమూ జగన్ వైపు ప్రజలను మళ్ళించింది అన్న అవగాహనా రాహిత్యం మరో పెద్దకారణం
బటన్ నొక్కితే చాలు 151 కాస్తా 651 అవుతుందన్న భ్రమ. నొక్కితే పుచ్చుకునేవాడికే కాదు, నొక్కుతానికి ఇచ్చేవాడికి కూడా ఓట్లు ఉంటాయని తెలుసుకోలేకపోవటం.
ప్రజలు పెద్దగా ఆశించరు. తమకు ఇబ్బంది కలిపించకపోతే చాలు అనుకునే ఉదారులను దరిద్రంగా తయారయిన రోడ్లూ, మొదటి తారీకు రాగానే ఇంటి ముందు చెత్తపన్ను కోసం నిలబడే వాలంటీర్లూ చాలు అసంతృప్తి శిఖరప్రాయం కావటానికి
దేవాలయాల మీద దాడులూ, కనీసం ఒక్కడినైనా అరెస్టు చేయకపోవటమూ ప్రజలకు కష్టం కలిగించదా !
ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఒంటి స్థంబం మేడ మీద కూర్చుంటే క్రిందివాళ్ళు ఎటో ఒక వైపు అవసరం తీరగానే వెళ్ళిపోరా !
జగన్ అయినా రాహుల్ అయినా తెలుసుకోవాల్సింది ప్రజలతో నిరంతరమూ మిళితము కావటమనే విద్య.
ఆ విద్యలో నిష్ణాతులు ఇందిరా గాంధీ, ఎంజీఆర్, వైఎస్సార్, మోడీ, వాజపేయీ, స్టాలిన్ లాంటి ఎందరో
చిటారు కొమ్మన కూర్చున్న ఎన్‍టీఆర్, రాహుల్, కేసీఆర్ ల పతనం చూస్తూనే ఉన్నాము.
ప్రజలను దాటి ఎవరూ ప్రజాస్వామ్యంలోనే కాదు నియంతృత్వంలో కూడా ముందుకు పోలేరు.
హిందూ పురాణాల్లోనే ప్రపంచమంతా ఏ రాజనీతి అయినా చెప్పేది శత్రువు బలాబలాల్ని సరిగ్గా అంచనా వేయటమూ, అవతలివాడి లోపాలు గ్రహించటమూ ఎవరికైనా విజయరహస్యం.
జగన్ తనకు వచ్చిన 151 సీట్లూ తన మీద ప్రేమ పొంగిపొర్లి ఇచ్చినవి అనేది తొలిభ్రమ.
చంద్రబాబు సెల్ఫ్ డబ్బా తప్ప పని శూన్య నిష్క్రియత్వమూ, కేవలం ఒక కులానికే అన్ని లాభాలూ అన్న విధానమూ జగన్ వైపు ప్రజలను మళ్ళించింది అన్న అవగాహనా రాహిత్యం మరో పెద్దకారణం
బటన్ నొక్కితే చాలు 151 కాస్తా 651 అవుతుందన్న భ్రమ. నొక్కితే పుచ్చుకునేవాడికే కాదు, నొక్కుతానికి ఇచ్చేవాడికి కూడా ఓట్లు ఉంటాయని తెలుసుకోలేకపోవటం.
ప్రజలు పెద్దగా ఆశించరు. తమకు ఇబ్బంది కలిపించకపోతే చాలు అనుకునే ఉదారులను దరిద్రంగా తయారయిన రోడ్లూ, మొదటి తారీకు రాగానే ఇంటి ముందు చెత్తపన్ను కోసం నిలబడే వాలంటీర్లూ చాలు అసంతృప్తి శిఖరప్రాయం కావటానికి
దేవాలయాల మీద దాడులూ, కనీసం ఒక్కడినైనా అరెస్టు చేయకపోవటమూ ప్రజలకు కష్టం కలిగించదా !
ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఒంటి స్థంబం మేడ మీద కూర్చుంటే క్రిందివాళ్ళు ఎటో ఒక వైపు అవసరం తీరగానే వెళ్ళిపోరా !
జగన్ అయినా రాహుల్ అయినా తెలుసుకోవాల్సింది ప్రజలతో నిరంతరమూ మిళితము కావటమనే విద్య.
ఆ విద్యలో నిష్ణాతులు ఇందిరా గాంధీ, ఎంజీఆర్, వైఎస్సార్, మోడీ, వాజపేయీ, స్టాలిన్ చంద్రబాబు లాంటి ఎందరో
చిటారు కొమ్మన కూర్చున్న ఎన్‍టీఆర్, రాహుల్, కేసీఆర్ ల పతనం చూస్తూనే ఉన్నాము.
ప్రజలను దాటి ఎవరూ ప్రజాస్వామ్యంలోనే కాదు నియంతృత్వంలో కూడా ముందుకు పోలేరు.
తన స్వంత బలహీనతల్ని గుర్తించటం కూడా విజయ రహస్యమే .
వృద్ధ కపోతం, చెవిటి వాడి ముందు శంఖం oodiనట్టువుంది
JAGAN ki yedho chebudhaamu anukuni mallee nee buddhi ponichhukokundaa TDP, JANASENA la pai paddavu…neelanti valla BAJANA valane YCP moggakudisipoyindhi.
జగన్ రెడ్డి ఇప్పుడు రోజు ఖాళీ నే కాబట్టి,
మీకున్న పరిచయాలు ( ఉదాహరణ: గ్రే*ట్ ఆం*ద్ర వెం*కట్ రెడ్డి గారు, సా*క్షి కొమ్మి*నేని) , పరపతి తో జగన్ తో ఒక మీ*టింగ్ కోసం అపా*యింట్మెంట్ పొంది ,
వయ*స్సులో మీ*కంటే చి*న్నవాడే కాబట్టి,
అతనికే నే*రుగా మీ ఆలో*చనలు, అభిప్రా*యాలు చెప్ప*వచ్చు కదా.
అ*తని మం*చి కో*సమే కా*బట్టి , మీ*రు చె*బితే విం*టాడు ఏమో.
ఇది జగగక పోవచ్చు కానీ , అవకాశం వింది.
– వినాశం , భారతింగారు, సజ్జలు కలిసి పార్టీ నీ తమ అదుపులోకి పూర్తిగా తెచ్చుకోవడం ( అధ్యక్ష పదవి కూడా వాళ్ళే పొందటం). ఇప్పటికే అలానే చేస్తున్నారు. కానీ అఫిషియల్ గా కాదు.
జగన్ కి అసలు పార్టీ లో పాత్ర లేకుండా చేయడం.
దీనికి సానుభూతి కావాలి కాబట్టి, జగన్ కి ఏదో ఒక అనారోగ్యం వింది అని ప్రచారం చేయడం. జగన్ నీ ప్యాలస్ లో మాట్లాడని బొమ్మ లాగ
అసెంబ్లీకి వెళ్లక పోవటానికి ప్రతిపక్ష హోదా కాదు. అసలు వేరే కారణం వుంది. ప్రతిపక్ష హోదా అనేది వంక మాత్రమే. అసెంబ్లీ వెళ్ళితే వైసీపీ పక్ష నాయకుడిగా మాట్లాడాలి. జగన్ పేపర్ చూసి కూడా సరిగ్గా మాట్లాడలేడు. అటువైపు లోకేష్ అనర్గలంగా మాట్లాడుతున్నాడు. ఇద్దరిని చూసి ప్రజలు కంపేరిజన్ చేసుకుంటే జగన్ తేలిపోతాడు. అదీ జగన్ రెడ్డి భయం
అసెంబ్లీకి వెళ్లక పోవటానికి ప్రతిపక్ష హోదా కాదు. అసలు వేరే కారణం వుంది. ప్రతిపక్ష హోదా అనేది వంక మాత్రమే. అసెంబ్లీ వెళ్ళితే వైసీపీ పక్ష నాయకుడిగా మాట్లాడాలి. జగన్ పేపర్ చూసి కూడా సరిగ్గా మాట్లాడలేడు. అటువైపు లోకేష్ అనర్గలంగా మాట్లాడుతున్నాడు. ఇద్దరిని చూసి ప్రజలు కంపేరిజన్ చేసుకుంటే జగన్ తేలిపోతాడు. అదీ జగన్ రెడ్డి భయం
జగన్ ఎలా అధికారం లోకి రాగలిగాడు, ప్రజలు ఏ ఏ కారణాల వల్ల అతన్ని గెలిపించారు అనేది పక్కన పెడితే, వచ్చాక ఎం చేసాడు అనేది ముఖ్యం. ప్రజల నిత్యావసరాలు అయిన ఇసుక, సిమెంట్, ఇంకా మందు లాంటి మీద కని విని ఎరుగని రీతిలో అవినీతి చెయ్యటం కళ్ళకు కనపడుతూవుంటే, ఇంకా రోడ్స్, ఉద్యోగ కల్పన మీద అవి మనకు సంబంధం లేదు అనే విధంగా పరిపాలించాక మళ్ళీ ఏరి కోరి జగన్ ను తెచ్చునంటారనేది భ్రమే. వైసీపీ కి అప్పట్లో వచ్చిన నలభై శాతం ఓట్లు కూడా, ఇప్పుడు ఏ ముప్పై కో పడిపోయి ఉంటది. జగన్ మల్లి ప్రజల్లోకి వచ్చి ఏమి మంచి చేశాను అని చెప్పుకుంటాడు, అందుకే రావటానికి కూడా భయపడుతున్నాడు.
MBS ki jeetam, jeevitam icchindi ee gasandhrane, ka batti swami bhathi!!!
MBS mastaru, mee rathalau makemi kottha kadu,
mee swami bhakthi ni alge chatandi.
meeku jeetam, jeevitam icchindi ee sitekada?
MBS ki jeetam, jeevitham icchindi matram, arikatla venkat reddy.
so swami bhakthi chatutunnaru !!!
mastaruki swami bhakthi baga yekkuva!!!
guruvu gariki jeetham yevaru isthunnaru?
swami bhakti!!!
guru garu trumph bocchu meeda okati vadalandi
highlite, photo lo lapaki