బుక్ మై షో కి టాలీవుడ్ ఝలక్!

ఇబ్బంది అని గమనించిన గిల్డ్, వాటిని తొలగించకపోతే బుక్ మై షో ను వదిలేసి, డిస్ట్రిక్ట్ యాప్ తో వెళ్లిపోతామని చెప్పాలని డిసైడ్ అయింది.

టాలీవుడ్ సినిమాల వల్ల నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, బయ్యర్లు వీళ్లందరికన్నా ఎక్కువ వ్యాపారం చేసుకునేది, లాభాలు సంపాదించేది బుక్ మై షో. థియేటర్లకు పెట్టుబడి పెట్టి, అడ్వాన్స్ లు ఇచ్చి, వాటిని తన గుప్పిట్లోకి తీసుకుని, టికెట్ కు ఇంత అని ఫీజ్ తీసుకుంటూ భారీగా సంపాదించుకుంటోంది. కానీ అలా సంపాదించుకుంటూ కూడా టాలీవుడ్ సినిమాల మీద ‘బాట్ రివ్యూలు’ పెట్టడం, అడ్వర్ట్ టైజ్ మెంట్లు అంతా ఇంకా లాగేయడం మీద టాలీవుడ్ ఇప్పుడు గుర్రుగా వుంది.

నిన్న జరిగిన టాలీవుడ్ నిర్మాతల గిల్డ్ మీటింగ్ లో ఈ మేరకు డిస్కస్ చేసారు. టికెట్ తీసుకున్నవాళ్ల రివ్యూలు పెడితే ఫరవాలేదని, అలా కాకుండా ‘బాట్ రివ్యూలు’ పెట్టడం అన్నది సరికాదని గిల్డ్ అభిప్రాయపడింది. అంతే కాకుండా ప్రకటనలు ఇచ్చిన సినిమాలకు ఈ బాట్ రివ్యూలు అనుకూలంగా వుండడం, లేని వాటికి అలా లేకపోవడం వంటివి ఆందోళన కలిగించే పరిణామాలు అని గిల్డ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

తమ సినిమాల మీద ఆధారపడి వ్యాపారం చేస్తూ ఇలా చేయడం సరికాదని, కొత్తగా వచ్చిన డిస్ట్రిక్ట్ సినిమా టికెట్ ల యాప్ తాము ఈ బాట్ రివ్యూలు కాదు, మరే రివ్యూలు పెట్టము అని హామీ ఇచ్చిందని, అందువల్ల బుక్ మై షో పద్దతి మారకపోతే, అన్ని థియేటర్లు డిస్ట్రిక్ట్ యాప్ వైపు మళ్లి పోవాలని చాలా మంది గిల్డ్ సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది.

బుక్ మై షో కి ప్రకటనలు ఇవ్వడం ద్వారా, బాట్ రివ్యూలు, రేటింగ్ లు రప్పించి, వాటి ట్రెండ్ ను పబ్లిసిటీ చేసుకోవడం అన్నది తెలుగు సినిమాలకు అలవాటు. ఈ వీక్ నెస్ ను మాట్ రేటింగ్ లు, రివ్యూలు కింద మారుస్తున్నారు. ఇప్పుడు ఇది ఇబ్బంది అని గమనించిన గిల్డ్, వాటిని తొలగించకపోతే బుక్ మై షో ను వదిలేసి, డిస్ట్రిక్ట్ యాప్ తో వెళ్లిపోతామని చెప్పాలని డిసైడ్ అయింది.

3 Replies to “బుక్ మై షో కి టాలీవుడ్ ఝలక్!”

Comments are closed.