హ‌ర్ష‌సాయి సైబ‌ర్ టెర్ర‌రిస్ట్‌.. జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నాడు!

స‌మాజ శ్రేయ‌స్సు, యువ‌త‌ను స‌క్ర‌మ మార్గంలో పెట్టేందుకు ఆయ‌న చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీ హర్ష‌సాయిని సైబ‌ర్ టెర్ర‌రిస్ట్‌తో పోల్చ‌డం గ‌మ‌నార్హం. అత‌నిపై సైబ‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం విశేషం. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా తెలంగాణ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు. యూట్యూబ్ త‌దిత‌ర సోష‌ల్ మీడియా ఖాతాల్లో ల‌క్ష‌లాదిగా ఫాలోయ‌ర్ల‌ను క‌లిగి ఉన్న వ్య‌క్తులు… బెట్టింగ్ యాప్‌ల‌పై విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డాన్ని స‌జ్జ‌నార్ త‌ప్పు ప‌డుతున్నారు. ఇలాంటి వాళ్లంతా యువ‌త జీవితాల్ని నాశ‌నం చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం, ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆ మ‌ధ్య లోక‌ల్‌బాయ్ నానీని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు. దీంతో బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌న‌ని అత‌ను ప్ర‌క‌టిస్తూ వీడియోను విడుద‌ల చేశారు. తాజాగా హ‌ర్ష‌సాయిపై స‌జ్జ‌నార్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా వేలాది మంది యువ‌త జీవితాల‌ను నాశ‌నం చేసి కోట్ల‌లో సంపాదించి, వేలల్లో పంచుతూ సంఘ‌సేవ‌కుల్లా ఫోజులు పెడుతున్నాడంటూ హ‌ర్ష‌సాయిపై ఘాటు కామెంట్స్ చేశారాయ‌న‌.

ఇలాంటి వాళ్ల‌నా మీరు ఫాలో అవుతున్న‌దని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు ఏం ఉద్ధ‌రించారు వీళ్లు? దేశ సేవ ఏమైనా చేస్తున్నారా? స‌మాజ హితం కోసం మంచి ప‌నులేవైనా చేస్తున్నారా? అని ఆయ‌న నిల‌దీశారు. ఇలాంటి సైబ‌ర్ టెర్ర‌రిస్ట్‌ల‌ను అన్‌ఫాలో కొట్టాల‌ని ఆయ‌న సంచ‌ల‌న పిలుపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వాళ్ల అకౌంట‌ర్ల‌ను రిపోర్ట్ కొట్టాల‌ని ఆయ‌న కోరారు. బెట్టింగ్ యాప్‌ల‌పై ప్ర‌చారం చేస్తుంటే స‌మీపంలోని పోలీస్‌స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేయాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.

సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయ‌ర్స్ పేరుతో యువ‌త‌ను పెడ‌ధోర‌ణి ప‌ట్టించే యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డాన్ని స‌జ్జ‌నార్ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. స‌మాజ శ్రేయ‌స్సు, యువ‌త‌ను స‌క్ర‌మ మార్గంలో పెట్టేందుకు ఆయ‌న చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

5 Replies to “హ‌ర్ష‌సాయి సైబ‌ర్ టెర్ర‌రిస్ట్‌.. జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నాడు!”

  1. వీడు శ్రీ సూక్తులు బానే చెప్తాడు కానీ ఆర్టీసీ ఎండీ గా ఉండి ప్రజలకు సేవ చేయడానికి మాత్రం మర్చిపోతున్నారు వీడు సజ్జనార్ కాదు దుర్జనార్

Comments are closed.