బన్నీ కోసం మరో పెద్ద కంపెనీ?

మరోవైపు బన్నీ-అట్లీ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. ఈ సినిమా ఉందనే విషయాన్ని నిర్మాత రవిశంకర్ ఈరోజు పరోక్షంగా వెల్లడించారు

కొన్ని రోజుల కిందటి సంగతి. అల్లు అర్జున్, అట్లీ కలయికలో రాబోతున్న సినిమా నుంచి సన్ పిక్చర్స్ సంస్థ తప్పుకున్నట్టు గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడా ఊహాగానాలకు ఊతమిచ్చే మేటర్ బయటకొచ్చింది.

బన్నీ-అట్లీ ప్రాజెక్టులోకి ఇప్పుడు ఓ బడా సంస్థ ఎంటర్ కాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జీ స్టుడియోస్ కంపెనీ, బన్నీ నెక్ట్స్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. రీసెంట్ గా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాను దిల్ రాజుతో కలిసి నిర్మించింది ఈ సంస్థ.

అయితే జీ స్టుడియోస్ ఎప్పుడూ సోలోగా సినిమాలు చేయదు. కాబట్టి కచ్చితంగా మెయిన్ ప్రొడ్యూసర్ ఒకరు ఉండాల్సిందే. సన్ పిక్చర్స్, జీ గ్రూప్ కలిసే సమస్య లేదు కాబట్టి దాదాపు సన్ పిక్చర్స్ తప్పుకున్నట్టే. ఆ స్థానంలో దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఒకరు సీన్ లోకి రావాల్సి ఉంది. అదెవ్వరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

మరోవైపు బన్నీ-అట్లీ సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. ఈ సినిమా ఉందనే విషయాన్ని నిర్మాత రవిశంకర్ ఈరోజు పరోక్షంగా వెల్లడించారు. త్వరలోనే అట్లీతో బన్నీ సినిమా చేస్తారని, ఆ తర్వాత త్రివిక్రమ్ మూవీ ఉంటుందని.. ఆ 2 సినిమాలు పూర్తయిన తర్వాత పుష్ప-3 వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

2 Replies to “బన్నీ కోసం మరో పెద్ద కంపెనీ?”

Comments are closed.