రేవంత్: కాన్ఫిడెన్సేనా? కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా?

రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా.. మళ్లీ నేనే ముఖ్యమంత్రిని అని ఢంకా బజాయించి చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తనే సొంతంగా పార్టీ స్థాపించుకుని.. తన రెక్కల కష్టంతో అధికారంలోకి తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మొదటి చాన్స్ దక్కిన తర్వాత.. మరో ముప్పయ్యేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఒకసారి ఒంటరిగా బరిలోకి దిగి తల బొప్పి కట్టిన తర్వాత.. చంద్రబాబునాయుడు నీడలో ఉంటే తప్ప తనకు మనుగడ లేదని అర్థమైన పవన్ కల్యాణ్.. ప్రజలు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడు మరో పదిహేనేళ్లు అదే పదవిలో ఉంటారని చెప్పడాన్ని కూడా ఏదో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఏరోజు పత్రికల్లో పతాకశీర్షికల్లో సీఎం మార్పు వార్త వస్తుందో అర్థం కాని కాంగ్రెసు పార్టీలో.. అనేకమంది సీనియర్ల అభ్యంతరాలను కూడా తోసిరాజనుకుంటూ.. తొలిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. మరోసారి కూడా తానే సీఎం అవుతానని ఘంటాపథంగా చెప్పినప్పుడు ఏమిటంత కాన్ఫిడెన్స్ అని ఎవ్వరికైనా అనుమానం కలుగుతుంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత.. మూడోసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు.. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేయగా.. అనేకమంది సీనియర్లు అడ్డుపడ్డారు. ఎంతోమంది ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని పనిచేస్తుండగా.. కొన్నేళ్ల కిందట వచ్చిన రేవంత్ కు సీఎం పోస్టు ఇవ్వడం పట్ల గుర్రుమన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ కంటె ఎక్కువగా తాము కష్టపడ్డామని ఎవరికి దొరికిన సాక్ష్యాలు వారు చూపించుకున్నారు. అయితే అందరి అభ్యంతరాలను కాదని.. రేవంత్ ను పదవిలో కూర్చోబెట్టింది పార్టీ.

అయితే ఈ 15 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రస్థానం నల్లేరుపై బండినడకలాగా సాగడం లేదు. ఆయనకు అనేక హర్డిల్స్ ఎదురవుతూనే ఉన్నాయి. కేబినెట్లో ఉన్న సీనియర్ సహచరులనుంచి ఉన్న ఇబ్బందులు కొన్ని కాగా, రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అసలు అగ్రవర్ణాల పెత్తనం పోవాలని, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావాలని.. వారాలు నెలల వ్యవధిలోనే బీసీ ముఖ్యమంత్రి వస్తారని పెద్దపెద్ద నినాదాలు చేస్తూ చికాకులు సృష్టించిన తీన్మార్ మల్లన్న వరకూ రకరకాలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా.. ముఖ్యమంత్రి అయిన తరవాత నిర్ణయాల్లు రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు గురించి అధిష్ఠానం కు నెగటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్లినట్టుగా కూడా సమాచారం.

మామూలుగా నిప్పు లేకుండానే పొగపుట్టించగల తెలివితేటలు రాజకీయాల్లో పుష్కలంగా ఉంటాయి. అదే మాదిరిగా.. అధిష్ఠానం వద్ద రేవంత్ ప్రాభవం తగ్గిందని.. నేడో రేపో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి కూడా వస్తారని పుకార్లు రాసాగాయి. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా.. మళ్లీ నేనే ముఖ్యమంత్రిని అని ఢంకా బజాయించి చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇలాంటి పుకార్లన్నీ కొట్టి పారేస్తూ.. పూర్తి కాన్ఫిడెన్స్ తోనే రేవంత్ ఆ మాటలు చెప్పారా? లేదా, పుకార్లు ఇలాగే కొనసాగితే.. ఖండించకుండా తాను మిన్నకుంటే.. మరింతగా తాటాకులు కట్టేస్తారనే భయంతో.. కాన్ఫిడెంట్ గా కనిపించడానికి ఈ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చారా? అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే కాన్ఫిడెన్స్ తో ఆ మాట చెప్పి ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక వ్యక్తి.. అలా చెప్పుకోగల అవకాశం ఉండదని.. ముఖ్యమంత్రి పదవికి రెండు టర్మ్స్ గ్యారంటీ ఉంటుందనుకోవడం భ్రమ అని పలువురు అంచనా వేస్తున్నారు.

3 Replies to “రేవంత్: కాన్ఫిడెన్సేనా? కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా?”

  1. Your first paragraph shows and tells about you and your Baadha. Your boss has become CM by chance and not because of any leadership qualities . You as well know that but stop showing mekapotu gambheeryam.

    coming back to current Telangana CM, yes prior to elections he showed leadership qualities bringing in all the congress factions under one umbrella and came into power. And here is where it ended . What he is doing now a days is just keep bad mouthing against KCR. Why to do this every day even after coming to power??

    people fed up with the family rule of KCR and voted alternative. Everyone saw wjat happened in AP when the former CM did the same for 5 years. These every day attacking with bad language might work during elections time but not after coming into power.

    If CM is serious about development then stop these everyday bashing and focus on the priorities .

Comments are closed.