రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమాపై మినిమం గ్యాప్స్ లో పుకార్లు వస్తూనే ఉన్నాయి. యూనిట్ ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో గాసిప్ బయటకొచ్చింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఇందులో ఓ పెద్ద క్రికెటర్ పాత్ర కోసం ధోనీని తీసుకున్నట్టు నిన్నట్నుంచి ప్రచారం జరుగుతోంది.
దీన్ని చాలామంది నమ్మారు కూడా. ఎందుకంటే, చరణ్-ధోని స్నేహితులు. రామ్ చరణ్ కోరితే ధోనీ కచ్చితంగా నటిస్తాడు. కాబట్టి నిజమేననుకున్నారు. పైగా క్రికెటర్లు నటించడం కూడా ఇప్పుడు ట్రెండ్ అయింది. రాబిన్ హుడ్ లో వార్నర్ ఉన్నాడు.
అయితే ఇప్పుడా ప్రచారాన్ని యూనిట్ ఖండించింది. తమ సినిమాలో ధోనీ లేడని, అసలు అలాంటి పాత్ర కూడా తమ చిత్రంలో లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఈ సినిమా సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అస్వస్థతకు గురయ్యారు.
58 ఏళ్ల రెహ్మాన్ ఛాతినొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. వైద్యులు పరీక్షించి ఆయన డీ-హైడ్రేషన్ తో బాధపడుతున్నట్టు వెల్లడించారు. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండడం వల్ల తన తండ్రి బలహీనమయ్యారని, రెహ్మాన్ కుమారుడు అమీన్ ప్రకటించాడు.
Good
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,