ఒకవైపు చంద్రబాబునాయుడు మాత్రం.. తన పార్టీ ఎమ్మెల్యేలకు అనేకానేక సుద్దులు చెబుతూ ఉంటారు. నీతి వాక్యాలు ఉపదేశిస్తూ ఉంటారు. అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవ చేయాలని, తెలుగుదేశం పార్టీ అందుకే పుట్టిందని, చంద్రబాబునాయుడు పార్టీ సమావేశాలలోను, మీడియా ముందు ప్రవచనాలు చెబుతూ ఉంటారు. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎడాపెడా దోచేసుకుంటున్నట్టుగా పచ్చమీడియాలో కూడా కథనాలు వస్తూనే ఉన్నాయి.
చంద్రబాబునాయుడు ఆయా ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మరోసారి వార్తలు వస్తాయి. తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదని చంద్రబాబు హూంకరించినట్టుగా కథనాలు వస్తాయి. అయితే ఎక్కడకూడా అవినీతి ఎమ్మెల్యేల తీరు మాత్రం మారదు. ఇదంతా ఒక పెద్ద ప్రహసనంలాగా నడుస్తూ ఉంటుంది.
అయితే తాజా పరిణామాలను గమనిస్తోంటే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.. సాగిస్తున్న అవినీతి దందాలు చంద్రబాబు పరువు తీస్తున్నాయని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. శ్రీకాళహస్తిలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసుడిగా ఆయన కొడుకు సుధీర్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తొలినాళ్లనుంచి ఆయన మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ.. చంద్రబాబునాయుడు అదుపు చేయలేకపోతున్నారనే మాట నియోజకవర్గంలోనే వినిపిస్తోంది.
తాజాగా రేణిగుంటలో ఇనుప తుక్కు కొనుగోలు చేసి చెన్నైకు తరలించే వ్యాపారి నుంచి ఎమ్మెల్యే సుధీర్ నెలకు రూ.50 లక్షలు కావాల్సిందిగా డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు ఆ వ్యాపారి తిరస్కరించడంతో.. రేణిగుంట రూరల్ సీఐ మురళీకృష్ణ, గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ లను పురమాయించి తనిఖీల పేరుతో.. లారీని కొన్ని గంటల పాటు ఆపించేశారు.
వ్యవహారం అక్కడితో అయిపోలేదు. డ్రైవరు ఢిల్లీలోని పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులకు సమాచారం చెప్పడంతో.. వారు కేంద్ర హోంమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడినుంచి అమరావతి పోలీసు ఉన్నతాధికార్లకు, అక్కడినుంచి అనంతపురం రేంజి డీఐజీకి ఉత్తర్వులు వచ్చాయి. డీఐజీ పేముషి బాజ్‌పేయి విచారణ కోసం సీఐ, ఎస్ఐలను అనంతపురానికి పిలిపించి.. నాలుగురోజులుగా వారితో వివరాలు తెలుసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఎమ్మెల్యే దందాలకు సహకరించడానికి ప్రయత్నించిన పోలీసులు ఇప్పుడు ఇరుక్కున్నారు. అసలే ఇసుక విక్రయాల్లో ట్రాక్టరుకు వెయ్యి వంతున, శ్రీకాళహస్తీశ్వరాలయ వ్యవహారాల్లో లక్షల రూపాయల వంతున కాజేయడం అలవాటుగా మార్చుకున్న ‘చిన్న బొజ్జల’ ఇప్పుడు తన నియోజకవర్గంలోని పరిశ్రమల వారిని, అనుబంధ వ్యాపారాల వారిని వదిలిపెట్టడం లేదని, ఏకంగా నెలకు యాభై లక్షలు లంచాలు డిమాండ్ చేయడం పరాకాష్ట అని విమర్శలు వస్తున్నాయి.
చంద్రబాబునాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలకు నీతులు చెబితే సరిపోదని, వారు తన మాట చెవిన వేసుకుంటున్నారో లేదో గమనించాలని ప్రజలు అనుకుంటున్నారు.
సర్లే …ఒకాయన అతి నిజాయితీ, అతి మంచితనం అని సొల్లు చెబుతున్నడు. అవి ఏవి ప్రజలు నమ్మలేదు…ఫస్ట్ అవి తనను పాటించి ప్రజలకు చెప్పమని
నీ ఐటీడీపీ Kv తహ్! లే ర… బుర్రతక్కువ వెధవ!
నీకే.. తెలియని ఒకాయన గురించి ఎందుకులే.. ఇప్పుడు చెప్తున్న.. ఆ పైన బొమ్మలో ఉన్న గున్న P@nD! గురించి చెప్పు.. ఎప్పుడూ అవినీతి పరులగురించి రాయగానే.. ఇలాంటి.. సన్నాసి కథలు వెనకేసుకురావటాలు.. చెప్తుంటారు.. మీ ఐటీడీపీ వెధవలు!
Bad things of good government!!
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Very bad
అవును ఇలాంటి పనులు బాబు పరువు తీస్తాయి. ఇవే జగన్ రెడ్డి కి అయితే కీర్తి పెంచుతాయి. అదీ తేడా.