హైదరాబాదులో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కారు సభలో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు గవర్నరు సంతకం చేసిన వెంటనే యూనివర్సిటీ పేరు మారుతుంది.
అయితే తెలుగువాడు అయినంత మాత్రాన జాతీయోద్యమ నాయకుడు అయిన పొట్టి శ్రీరాములుకు ఆంధ్రోడనే ముద్ర వేయడం, అందువల్ల ఆయన పేరును తెలుగు యూనివర్సిటీకి తొలగించాలని అనుకోవడం ఇప్పుడు సర్వత్రా విమర్శల పాలవుతోంది. తెలంగాణలోని భారతీయ జనతాపార్టీ నాయకులే.. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పుట్టినంత మాత్రాన ఆయన కేవలం ఆంధ్రప్రాంతానికి పరిమితమైన నాయకుడు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే.. ఆయన 58 రోజుల నిరాహారదీక్ష, బలిదానం ఫలితంగా మాత్రమే ఈ దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆయన తెలుగు ప్రాంతానికి మద్రాసు రాష్ట్రం నుంచి విముక్తి కావాలని పోరాడారు. ఆయనను జాతీయ నేతగా గుర్తించాలే తప్ప సంకుచితంగా చూడడం తగదనే విమర్శలు వస్తున్నాయి.
ఎన్టీ రామారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి తదితర ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుల పేర్లతో హైదరాబాదులో అనేక సంస్థలు ఉన్నాయి. సూటిగా చెప్పాలంటే వీరందరూ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. కేవలం రాజకీయ నాయకులుగా ఎదిగిన సేవలందించిన వారు మాత్రమే. కానీ పొట్టి శ్రీరాములు అలా కాదు. ఆయన జాతీయోద్యమ నేత. వీరి పేర్లు ఉన్న సంస్థలన్నింటికీ రేవంత్ పేరు మార్చే ధైర్యముందా అని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఫరెగ్జాంపుల్.. బ్రహ్మానందరెడ్డి పార్కు, కృష్ణకాంత్ పార్కు హైదరాబాదులో ఉన్నాయి. బ్రహ్మానందరెడ్డి పేరు మార్చి, కృష్ణకాంత్ పేరును కొనసాగిస్తారా? కేవలం ఆంధ్ర ప్రాంతంలో పుట్టినందుకు తెలంగాణకు కూడా సేవచేసిన నాయకుల పేర్లను విస్మరిస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
గతంలో రాజేంద్రనగర్ లోని ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేసీఆర్ సర్కారు పేరు మార్చి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టింది. తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇతర కాంగ్రెస్ నేతల పేర్లతో ఉన్న సంస్థలకు పేర్లు మార్చే ధైర్యం లేని రేవంత్ రెడ్డి.. పొట్టి శ్రీరాములు పేరు మార్చడానికి మాత్రం సాహసిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి వీటికి ఏ రకంగా సమాధానం చెబుతారో చూడాలి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
భాష ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడు మాత్రమే కాదు… స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, గాంధీ శిస్యుడు… హరి జనొద్దరణ కోసం కృషి చేశాడు..1943-1944 లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. అప్పుడు మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశంకు ఇలా వ్రాశాడు – “హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)”. – 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది.
Jai