ఒకప్పుడు కుర్రకారును తన అందచందాలతో ఉర్రూతలూగించిన నటి మమతా కులకర్ణి. దాదాపు పాతికేళ్ల తర్వాత భారతదేశానికి వచ్చిన ఈ నటి, కుంభమేళాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. త్రివేణి సంగమంలో మునిగి ఆమె సాధువుగా మారిపోయింది.
కిన్నార్ అఖాడా సంస్థ ఆమెను సన్యాసిగా మార్చి, మహామండలేశ్వర్ అనే బిరుదు కూడా ఇచ్చేసింది. అయితే ఆ వెంటనే అఖాడాలో గొడవలు మొదలయ్యాయి. ఆమెను ఎలా యోగినిగా మారుస్తారని, పైగా బిరుదు ఎలా ఇస్తారంటూ గొడవలు జరిగాయి.
దీంతో అఖాడాలో కొందరి పదవులు ఊడిపోయాయి. ఆ తర్వాత మమతా కులకర్ణికి ఇచ్చిన బిరుదును కూడా వెనక్కు తీసుకున్నారు. అంతేకాదు, ఆమెను అఖాడాలో చేర్చుకునేందుకు కూడా నిరాకరించారు.
ఇదంతా కుంభమేళా టైమ్ లోనే జరిగిపోయింది. మరి ఇంత జరిగిన తర్వాత మమతా కులకర్ణి ఇప్పుడెక్కడుంది. ఏం చేస్తోంది. కొన్ని రోజుల పాటు ముంబయిలోనే కనిపించిన ఈ 52 ఏళ్ల నటి, ఇప్పుడు మరోసారి విదేశాలకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈసారి ఆమె తిరిగి భారత్ లో అడుగుపెట్టే అవకాశం లేదంటున్నారు ఆమె సన్నిహితులు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Manchidi