2028లో పుష్ప 3 వస్తుందని మైత్రీ నిర్మాణ సంస్థ భాగస్వామి రవిశంకర్ వెల్లడించారు.రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కానీ ఇది సాధ్యమేనా అన్నది అనుమానం. ఎందుకంటే పుష్ప వన్, పుష్ప 2 సినిమాలకు ఎంత సమయం పట్టిందో అందరికీ తెలుసు.
అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ సినిమా స్టార్ట్ చేయలేదు. అట్లీ డైరక్షన్ లో సినిమా అని వినిపిస్తోంది. అన్నీ క్లియర్ చేసుకుని, అది పూర్తి చేసి విడుదల చేయడానికి కనీసం ఏడాది పడుతుంది. అంటే 2026 వస్తుంది. త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేసే భారీ మైథలాజికల్ సినిమా మేకింగ్ కు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అంటే 2028 లో ఆ సినిమా రావడానికి అవకాశం వుంటుంది.
ఒకవేళ ఎంత ఫాస్ట్ గా చేసినా త్రివిక్రమ్- బన్నీ సినిమా 2027 చివరకు వస్తుంది. అప్పుడు మొదలుపెట్టాలి. పుష్ప 3 సినిమా. సుకుమార్ మేకింగ్ స్టయిల్ తెలిసిందే. ఎలా లేదన్నా రెండేళ్ల పై మాటే. అంటే 2029 నుంచి 2030 రావాలి పుష్ప 3 ని తెర మీద చూడాలంటే.
కానీ బన్నీ ఈసారి అంత నెమ్మదిగా సినిమాలు చేసే ఆలోచనలో లేరు. త్రివిక్రమ్ సినిమానే టైమ్ ఎక్కువ పడుతుందని, ఒక సినిమా వెనక్కు నెట్టారు. ముందుగా ఓ సినిమాను త్వరగా అందించాలని డిసైడ్ అయ్యారు. అందువల్ల త్రివిక్రమ్ సినిమా ముందు కానీ వెనుక కానీ సరైన డైరక్టర్, సరైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ వస్తే అటు వెళ్లకుండా వుండలేరు. అలా అని పుష్ప సిరీస్ ను వదిలేయరు. కానీ అది ఎప్పుడు వచ్చినా, దాని క్రేజ్ దానికి వుంటుంది కనుక, మెల్లగా చేస్తారు.
అలా ఎలా చూసినా, పుష్ప 3 సినిమా తెరమీదకు వచ్చేసరికి 2030 పక్కా అని అనుకోకతప్పదు. అప్పటికి బన్నీ దగ్గర దగ్గరగా యాభై ఏళ్లు వస్తాయి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Malli na