భ‌యంతో సంసారం.. ఎన్నాళ్లో!

టీడీపీ, జ‌న‌సేన ప‌ర‌స్ప‌రం ఇష్టంలేక‌పోయినా, క‌లిసి కాపురం చేస్తున్నాయి.

పిఠాపురంలో జ‌న‌సేన ఆవిర్భావ వేడుక స‌భ‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆయ‌న అన్న నాగ‌బాబు కామెంట్స్ టీడీపీని ద‌హిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ వాళ్లిద్ద‌రినీ ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి. కానీ టీడీపీ సోష‌ల్ మీడియా మాత్రం… ఓ రేంజ్‌లో ఏకిపారేస్తోంది. దీనికి కౌంట‌ర్‌గా జ‌న‌సేన యాక్టివిస్టులు కూడా పోస్టులు పెడుతున్నారు. టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వార్ జ‌రుగుతోంది.

అయితే టీడీపీ, జ‌న‌సేన ప‌ర‌స్ప‌రం ఇష్టంలేక‌పోయినా, క‌లిసి కాపురం చేస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం… జ‌గ‌న్ అంటే భ‌యం. అదొక్క‌టే వాళ్లిద్ద‌రినీ క‌లిపి వుంచ‌డానికి కార‌ణ‌మైంది. ఇంత‌కు మించి వాళ్లు క‌లిసి ఉండ‌డానికి కార‌ణం క‌నిపించడం లేద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. తాము వేర్వేరుగా పోటీ చేస్తే, వైసీపీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోతామ‌న్న భ‌యం టీడీపీ, జ‌న‌సేన నేత‌ల్లో వుంది. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన అప్పుడ‌ప్పుడు కించ‌ప‌రిచేలా మాట్లాడుతున్నా, అన్నింటినీ పంటి బిగువున అణ‌చివ‌పెట్టుకుని వెళ్తున్న‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

కానీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు క‌త్తులు దూసుకుంటున్నారు. త‌మ మ‌ద్ద‌తు లేక‌పోతే క‌నీసం అసెంబ్లీలో అడుగు పెట్టే సీన్ లేద‌ని ప‌వ‌న్‌ను దెప్పి పొడుస్తున్నారు. 40 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీడీపీని తాము నిల‌బెట్టామ‌ని ప‌వ‌న్ అన‌డాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. అలాగే పిఠాపురంలో ప‌వ‌న్ విజ‌యంలో టీడీపీ పాత్ర‌మే లేద‌న్న‌ట్టు నాగ‌బాబు మాట్లాడాన్ని కూడా స‌హించ‌లేక‌పోతున్నారు.

అయినా, టీడీపీ-జ‌న‌సేన క‌లిసి ముందుకెళ్తున్నాయంటే, వైసీపీ అంటే వెన్నులో వ‌ణుకు పుట్ట‌డ‌మే. ఒంట‌రిగా వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోలేమ‌న్న భ‌యం వాళ్లిద్ద‌రినీ వెంటాడుతోంది. అందుకే అవ‌మానాల్ని దిగ‌మింగుకుని ప‌వ‌న్‌తో టీడీపీ క‌లిసి ప్ర‌యాణిస్తోంది. త‌న‌తో టీడీపీకి ఎక్కువ అవ‌స‌ర‌మ‌నే భావ‌న ప‌వ‌న్‌తో లెక్క లేకుండా మాట్లాడిస్తోంది. ఇలా మ‌న‌సులు క‌ల‌వ‌ని కాపురం ఎన్నాళ్లో మ‌రి!

8 Replies to “భ‌యంతో సంసారం.. ఎన్నాళ్లో!”

  1. వాళ్ళని ఎలాయిన విడగొట్టాలి..అప్పుడే అన్న కి మళ్ళీ కుర్చీ దక్కేది .. కానీ వాళ్ళు అంత తెలివి తక్కువ కాదు..

  2. పాపం మూడో రోజు కూడా నీకు తప్పేలా లేదు….ఓకే టాపిక్ మీద అటు తిప్పి ఇటు తిప్పి…ఆక్ పాక్ కర్వేపాకు

Comments are closed.