బాబుపై ప‌వ‌న్‌దే పైచేయి!

40 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీడీపీని తామే నిల‌బెట్టామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. దీన్ని టీడీపీ తీవ్ర అవ‌మానంగా భావిస్తోంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై మొద‌టి నుంచి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌దే పైచేయి. ఏ ద‌శ‌లోనూ ప‌వ‌న్‌ను, జ‌న‌సేన నేత‌లను టీడీపీ అడ్డుకోలేక‌పోతోంది. దీంతో టీడీపీని నిల‌బెట్టింది తానే అని ప‌వ‌న్ లెక్క‌లేకుండా మాట్లాడే ప‌రిస్థితి. ప‌వ‌న్ చేస్తున్న అవ‌మానాన్ని లోలోప‌లే భ‌రిస్తూ, కుమిలిపోతున్నారు. టీడీపీని ప‌వ‌న్ అవ‌మానిస్తున్న తీరు గురించి తెలుసుకుందాం.

టీడీపీని కించ‌ప‌ర‌చ‌డానికి ఇదే పిఠాపురం మొట్ట‌మొద‌ట వేదికైంది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క‌రువ‌య్యాయ‌ని, హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నార‌ని ప‌వ‌న్ వేలాది మంది స‌మ‌క్షంలో నిలదీశారు. ఇలాగైతే హోంశాఖ‌ను తాను తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని, అప్పుడు ప‌రిస్థితి మ‌రోలా వుంటుంద‌ని ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అంత‌టితో ఆగ‌లేదాయ‌న‌. చిన్నారులు, మహిళ‌ల‌పై లైంగిక‌దాడులు, అత్యాచారాలు జ‌రుగుతున్నాయ‌ని, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నార‌ని నిల‌దీశారు.

అస‌లు నువ్వెవ‌ర‌య్యా సాటి మంత్రి గురించి మాట్లాడ్డానికి అని సీఎం చంద్ర‌బాబు ప్ర‌శ్నించ‌లేక‌పోయారు. త‌మ కులానికి చెందిన మంత్రిని అవ‌మానించ‌డాన్ని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ త‌ప్పు ప‌ట్టారు. ఇదే మీ శాఖ గురించి ఇత‌రులు మాట్లాడితే ఎలా వుంటుంద‌ని ఆయ‌న నిల‌దీశారు. కానీ చంద్ర‌బాబు మాత్రం నోరెత్తిన పాపాన పోలేదు.

తిరుప‌తిలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టికెట్ల జారీ సంద‌ర్భంలో తొక్కిసలాట జ‌రిగింది. ఈ తొక్కిస‌లాట‌లో ప‌లువురు ప్రాణాలు కోల్పోగా, మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. చంద్ర‌బాబుతో సంబంధం లేకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుప‌తికి వెళ్లి హంగామా సృష్టించారు. త‌న‌కు సంబంధం లేక‌పోయినా ప్ర‌భుత్వం త‌ర‌పున క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతేకాదు, టీడీపీ పాల‌క మండ‌లి, ఉన్న‌తాధికారులు క్ష‌మాప‌ణ చెప్ప‌డం త‌ప్ప‌, మ‌రో గ‌త్యంత‌రం లేద‌ని ఆదేశాలు ఇచ్చారు. ఈ సంద‌ర్భంలో కూడా సీఎం చంద్ర‌బాబు మౌనాన్నే ఆశ్ర‌యించారు.

ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌కు తానుగా నాగ‌బాబు పేరు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. నాగ‌బాబుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌ద్ద‌ని ప‌వ‌న్ సీఎంతో చెప్పిన‌ట్టు, ఏదో ఒక కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తే చాల‌న్న‌ట్టు టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెంట‌నే నాగ‌బాబు పేరును అధికారికంగా ప్ర‌క‌టించి, చంద్ర‌బాబుతో త‌న‌కు సంబంధం లేద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

టీడీపీ, బీజేపీ అభ్య‌ర్థుల‌తో సంబంధం లేకుండానే , నాగ‌బాబు ఒక్క‌డే మొద‌టగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కార్యక్ర‌మానికి లోకేశ్ వెళ్లారు. ఈ సంద‌ర్భంలో కూడా చంద్ర‌బాబు నోరెత్త‌లేక‌పోయారు.

తాజాగా జ‌న‌సేన 12వ ఆవిర్భావ స‌భ‌ను పిఠాపురంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో ప‌వ‌న్ గెలుపులో టీడీపీ, వ‌ర్మ పాత్ర లేద‌ని స‌భాముఖంగా ప్ర‌క‌టించారు. ఇది ఒక షాక్‌. ఇదే సభ‌లో ప‌వ‌న్ మ‌రో షాక్ ఇచ్చారు. 40 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీడీపీని తామే నిల‌బెట్టామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. దీన్ని టీడీపీ తీవ్ర అవ‌మానంగా భావిస్తోంది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు, ఆ పార్టీ నాయ‌కులు ఇదేమ‌ని ప్ర‌శ్నించ‌డం లేదు. ఇలా ప్ర‌తి సంద‌ర్భంలోనూ చంద్ర‌బాబుపై ప‌వ‌న్ పైచేయి సాధిస్తూనే వున్నారు. టీడీపీ అవ‌మాన‌ప‌డుతూనే వుంది.

37 Replies to “బాబుపై ప‌వ‌న్‌దే పైచేయి!”

  1. చంద్ర బాబు ను పక్కన పెట్టి,, నువ్వు ప్రతి సారీ ప్రశ్నిస్తూనే ఉన్నావు గా G A….

    1. Pawan playing ultimate politics..by now he made his presence felt very strongly overall the state.. its like all bad credit to tdp but good credit to janasena

  2. నిన్ననే కదా సామీ జనసేన ని టీడీపీ కి వదిలేయండి అని చెప్పి.. మళ్ళా ఏడుపు మొదలెట్టారు ఏమి తెల్లారేసరికి…

  3. కానీ అదే పవన్ హంబుల్ గా. 10 ఏళ్ల జగన్ కావాలి అన్నారు గా మార్చి పోయారా . ఆవిర్భావ వేడుకల్లో కాస్త అతి ఉత్సాహం ఉంటుంది .ఈ మాత్రానికే. మల్ల జగన్ సిఎం ayipodu. ఈ రోజు సుమారు 11 వేల కోట్ల తొ అమరావతి మొదలు పెడుతున్నారు అది కూడా రాస్తే అందరికీ మంచిది

  4. అదే పవన్ హంబుల్ గా బాబు గారు 10 ఏళ్ల సిఎం కావాలి అన్నారు . మార్చి పోతే ఎలా . ఈ రోజు 11 వేల కోట్ల hudco రుణం తొ అమరావతి మోఆధాలు పెడ్తున్నాడు అది కూడా రాయి

  5. అసలు ఇన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు మనల్ని ఎందుకు అసహ్య ఇంచుకున్నారు అనే కోణం లో ఒక్క రోజు కూడా ఆలోచించడం లేదు..

    అవే రోత రాతలు… అబద్దపు ప్రచారాలు..

    మీరు మారరు… అన్నియ ని సాంతం నాకించెదాకా నిద్ర పోరు

  6. నువ్వే బాగా ఫీల్ అవుతున్నావు ఎంకటి రెడ్డి. టీడీపీ కి రాజకీయం బాగా తెలుసు, ఎప్పుడూ ఎక్కడ ఫీల్ అవ్వాలో బాబు గారితో పాటు అందరూ టీడీపీ కార్యకర్తలు ఒక్కే “సింక్” లో వుంటారు. నువ్వు ముసుకు కూర్చో పూల చొక్కా!!

      1. I specifically mentioned about TDP cadre not general public.

        Why you think TDP tried to stop formation? It was asking for proper basis and equal justice.

        The public might be temporarily misled (2019) and rectified (2024).

  7. అ..న్న..ప్రాస..నం టైం లో పుస్తకాలు, పె..న్నులు,నై..ఫ్ లు కాకుండా టీడీపీ జెండా ప..ట్టుకు..న్నోల్లమ్.ఎవ..డో వ..స్తాడు,ఎదో చేస్తాడు..అని భ**..*య..పడే వాళ్ళం కాదు.అ..ధికారం కోసం అ..ర్రులు చా..చే వాళ్ళం కాదు.తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ. మా ఊ..పి..రి వున్నంత కాలం పార్టీ కోసం..రాష్ట్రం కోసం ని..జాయితీగా పని చేస్తూనేవుంటాం…మా తరువాత త.రానికి అన్నగారు, సీ..బీన్ స్ఫూర్తి నిం..పుతాం..ఎం చే..స్తున్నామో, ఎం చేశామో తెలుగు ప్రజా..నీకం కి తెలుసు..మా పని మేము చేసు..కుంటూ వెళతాం..గెలు.పు ఓట..మి లు వస్తుంటాయి ..పోతుంటాయి.. కానీ ఎప్పటికీ తెలుగు ప్రజల చి..రునామా తెలుగుదేశం మాత్రమే.. పవన్ లో దేశ..భక్తి ,నిజాయితీ చూసాం..రాష్టానికి ఏదో చే..యాలనే త..పన,ఆవే..శం చూశాం.. టీడీపీ క్యాడర్ కూడా అన్నిటికీ అతీ..తంగా పవన్ ని ఇష్టపపడుతున్నాru….కల్సి వస్తే తి..రు..గు లేని రాష్ట్రం గా చేసుకుంటాం..లేదంటే ఎవరి దారిలో వాళ్ళు రా..జకీయాలు చేసుకుంటాం…అం..తేకాని కా..లం చెల్లిన ఇలాంటి ఆర్టికల్స్ చదివి ఏదో జరు..గుద్ది..అన్నియకి మల్ల అధికారం వచ్చుద్ది అని కల..లు క..థ..ల మిం..గడం ఆపండి.

  8. ఎక్కడ నెగ్గలో కాదు, ఎక్కడ తగ్గలో కూడా తెలిసివుండాలి, pk dilogue. But in real it’s applicable to babu garu.

  9. ఆవి”భావ” A1పెళ్ళాన్ని ఆక్రమించుకున్నట్టు, జెగ్గుల పార్టీ ని కూడా ఆక్రమించుకుంటాడేమో.. దాని గురించి జర్రంత డీటెయిల్స్ ఇస్తూ మావోడిని అప్రమత్తం చెయ్యరా గ్యాసు ఎంకిటి

  10. ఆవి”భావ” A1పెళ్ళాన్ని ఆక్రమించుకున్నట్టు, జెగ్గుల్ పార్టీ ని కూడా ఆక్రమించుకుంటాడేమో.. దాని గురించి జర్రంత డీటెయిల్స్ ఇస్తూ మావోడిని అప్రమత్తం చెయ్యరా గ్యాసు ఎంకిటి

  11. ఈ గేమ్ అంతా జెగ్గుల్ గాన్ని “A1ఎర్రిపూకు” ని చెయ్యడమే కదా??

    “Why not 175” అని రాగం తీసిన జెగ్గుల్ గాన్ని ట్రాప్ చేసి పంగనామాలు పెట్టి ‘ఎర్రోణ్ణి చేయడం లో experts వాళ్ళు.. ఫైనల్ గా నువ్వు డిస్సపాయింట్ అయ్యి గ్యాసుతో చచ్చేవ్ రా “గ్యాస్ ఆంధ్రా” ఎంకిటి

  12. ప్రజా రాజ్యం నీ వదిలేసి 40 ఏళ్ల టీడీపీ నీ నిలబెట్టడం ఏంటో. ప్రజా రాజ్యం పేరెత్తితే ఒక్క ఓటు కూడా పడదనా?

  13. ఒకసారి టీడీపీ వొంటరిగా పోటీ చేసి గెలిచి చూపిస్తే ఇంకెవరు మాట్లాడరు కదా, 2029 లో టీడీపీ వొంటరిగా పోటీ చేసి గెలిచి చూపించాలి

    1. మీ దద్దమ్మ గాడి పార్టీ చచ్చిన రోజున ఒంటరిగానే పోటీ చేస్తారు, నువ్వు కోరుకున్నట్టు 2029 ఎలెక్షన్స్ నాటికి ఆ రోజు రావాలని గట్టిగా కోరుకో నీ కోరిక నెరవేరుతుంది నీ అనుమానం తీరుతుంది

    2. రామారావు గారి టైంలోనే కానిది ఇప్పుడెలా సాద్యం.పైగా విజనరీ అని కులమీడియా తో ముద్ర వేయించుకున్న ఓ దద్దమ్మ వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ కదా

  14. ప్రతి పక్షం పార్టీ వాళ్ళు చెయ్యవల్సిన వాటిని అదికార పార్టిలో ఉన్నవాడు చేస్తున్నాడు పవన్ కి అదికార పక్కచ్మ్ లేక ఎడైన ఒక్కటే

Comments are closed.