ఔను, కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న టీడీపీ మనోభావాలు భారీగా దెబ్బతిన్నాయి. తెలుగుదేశం పార్టీ మనసును ఎవరో ప్రత్యర్థులు దెబ్బతీశారంటే, ఇంతగా మనోవేదన వుండేది కాదు. కూటమిలో భాగస్వామి పార్టీ అయిన జనసేన నేతలే టీడీపీ హృదయాన్ని గాయపరచడం ఆ పార్టీ కార్యకర్తలు , నాయకులు తట్టుకోలేకపోతున్నారు.
నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీని తానే నిలబెట్టానని, ఆ పార్టీకి అధికారం తన చలువే అని పవన్ మాట్లాడ్డం …అధికార పార్టీ తట్టుకోలేకపోతోంది. కనీసం ఆరు శాతం ఓటు బ్యాంక్ కూడా లేని పార్టీ అధ్యక్షుడు తన దయపై అధికారం దక్కిందనే మాటల్ని జీర్ణించుకోవడం టీడీపీకి సాధ్యం కావడం లేదు. దీనికంటే ఓడిపోయి, ప్రతిపక్షంలో ఉండడమే గౌరవమని , ఆత్మాభిమానాన్ని చంపుకుని… సంస్కారం లేని జనసేనతో కలిసి రాజకీయ ప్రయాణం చేయడం ఆత్మహత్యా సదృశ్యమే అనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది.
ముఖ్యంగా టీడీపీ యువ నాయకులు జనసేనాని పవన్ తీరుపై విరుచుకుపడుతున్నారు. తమతో పొత్తు పెట్టుకుంటే తప్ప, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పదేళ్లు వేచి చూడాల్సిన నాయకుడు… ఇలా మాట్లాడ్డం ఏంటనే ఆవేదన టీడీపీ యువతలో చూడొచ్చు. టీడీపీని నిలబెట్టే శక్తిసామర్థ్యాలే వుంటే, మరి తన అన్న స్థాపించిన ప్రజారాజ్యాన్ని ఎందుకు నిలుపుకోలేకపోయారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడ్డం పవన్ నైజం అని, ఎదుటి వాళ్ల మనోభావాలు ఆయనకు పట్టడం లేదని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
గతంలో వైసీపీ హయాంలో తమను తిట్టారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం, వెంటనే జైలుకు పంపడాన్ని చూస్తున్నాం. నెలలతరబడి జైళ్లలోనే ఉంచుతున్నారు. ఇప్పుడు టీడీపీ మనోభావాల్ని పవన్‌కల్యాణ్, జనసేన నాయకులు తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. మరి వాళ్లపై ఫిర్యాదు చేసే, అలాగే కేసులు పెట్టించగలిగే దమ్ముందా? అనే ప్రశ్న ఎదురవుతోంది. పవన్ కంటే టీడీపీ మనోభావాల్ని దెబ్బ తీసిందెవరని ప్రశ్నిస్తున్నారు. నీడలా వెన్నంటి వుంటూ, మనోభావాల్ని దెబ్బతీస్తే మాత్రం తియ్యగా వుంటుందా? అని నిలదీస్తున్నారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
నీ ఫ్రస్ట్రేషన్ అర్ధం అవుతుంది…. కానీ ఎంత ఏడ్చినా ఏమి లాభం…పని జరగదులే
ఎంకటి రెడ్డి నీ రోదన వర్ణనాతీతం. నీ మనోభావాలు బాగా దెబ్బ తినట్లునాయి. మన సుధా తో నువ్వే ఒక్క కేసు వేయించొచ్చుగా!! లేకపోతే ముసుకు కూర్చోరా పూల చొక్కా!!
ఎంకటి నీ రోదన వర్ణనాతీతం. నీ మనోభావాలు బాగా దెబ్బ తినట్లునాయి. మన సుధా తో నువ్వే ఒక్క కే.సు వేయించొచ్చుగా!! లేకపోతే ముసుకు కూర్చో పూల చొక్కా!!
ఏదో అయిపోద్ది అని బాగా ఆశలు పెట్టుకున్నట్లున్నారు:) హహహ.. మీ వల్ల కాదు GA..
Bokka lo politician andaru dongale , kastho kustho ycp ne better prajalaku
Levu
Issari tdp party single ga poticheyali
మడిచి మూలపెట్టుకోవడమే… అంతకి మించి పీకేదేమ్ లేదు..
There is no other option for these two weak parties in the state except scratching each other’s back in the name of alliance and making false allegations. People started realizing truth and now they are ready to show their power.