Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నీహారిక 'ఒక్క మనసు'

నీహారిక 'ఒక్క మనసు'

కొణితల కుటుంబం నుంచి వస్తున్న తొలి హీరోయిన్ నీహారిక. 'మెగా'మద్దతుతో నీహారిక నటిస్తున్న సినిమాను మధుర శ్రీధర్, టీవీ 9 కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి రామరాజు దర్శకుడు. ఈ సినిమా ఒక్క మనసు అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ముందు సత్యను హీరోగా అనుకున్నా, నీహారిక ప్రాజెక్టులోకి వచ్చాక, నాగ శౌర్యను చేర్చుకున్నారు.

 కాస్త మంచి క్లాస్ సబ్జెక్ట్ కావడంతో ఒక్క మనసు అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఏ మాత్రం కామెంట్లకు, కాంట్రావర్సీలకు తావివ్వని, క్లీన్ ప్లస్ మంచి సబ్జెక్ట్ లు మాత్రమే నీహారిక అంగీకరిస్తుందని తెలుస్తోంది. నీహారిక కు కథలు చెప్పాలనుకునేవాళ్లు ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలని ఆమె తండ్రి నాగబాబు సూచించినట్లు బోగట్టా. 

మెగా స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఇమేజ్, ఇవన్నీ దృష్టిలో వుంచుకుని, ఇలా కాస్త క్లాస్ పాత్రలు, స్టోరీలకే మొగ్గు చూపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?