రాను రాను తెలుగు సినిమా జనాలు డిజిటల్ ప్రమోషన్‌కు బాగా అలవాటు పడుతున్నారు. అయితే డిజిటల్ ప్రమోషన్ వరకు ఒకే. అలా కాకుండా యూట్యూబ్ లైక్‌లు, వ్యూస్, ట్విట్టర్ లైక్‌లు, వ్యూస్, బుక్ మై షో ఇంట్రెస్ట్‌లు, లైక్‌లు లెక్కలు పెట్టుకుంటూ, వాటి కోసం కిందా మీదా అయిపోతున్నారు. వాటి కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఈ లైక్‌లు, వ్యూస్ జనాలను సినిమా దిశగా మళ్లిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు.
రెగ్యులర్ పబ్లిసిటీ మీద దృష్టి ఉంచుతూనే ఈ డిజిటల్ ప్రచారం మీద ఎక్కువ దృష్టి, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. డిజిటల్ పబ్లిసిటీ కొంత వరకు అవసరమే కానీ మరీ బుక్ మై షో లాంటి యాప్స్‌లో లైక్‌లు కోసం ఖర్చు చేసేంత మాత్రం కాదు. కుర్రాళ్లు డిజిటల్ ట్రెండ్ ఫాలో అవుతారు. కానీ అదే సమయంలో వాళ్లకు ఈ టక్కు టమర విద్యలు అన్నీ తెలిసిపోయాయి. నిజమైన ట్రెండ్‌ను కూడా కుర్రాళ్లు అంత సులభంగా నమ్మడం లేదు. పెయిడ్, బోట్స్, యాడ్స్ ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయని వాళ్లకు తెలిసిపోయింది.
అయినా కూడా నిర్మాతలు, వాళ్ల వాళ్ల డిజిటల్ టీమ్‌లు మాత్రం ఇంకా ఈ తరహా ప్రమోషన్‌ను నమ్ముకుంటున్నాయి. బుక్ మై షో లాంటి యాప్స్‌కు యాడ్స్ ఇవ్వడం, రేటింగ్‌ను ప్రభావితం చేయడం, ఇంట్రెస్ట్‌లను పెంచడం, బోట్ రివ్యూలు పెట్టించడం వంటివి చేస్తున్నారు. ఇవన్నీ చూసి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఒక మాయా ప్రపంచంలోకి వెళుతున్నారు. తమ సినిమాకు వీర బజ్ వచ్చేసిందని నమ్ముతున్నారు. కానీ తీరా సినిమా విడుదలైన తర్వాత కేవలం గ్రౌండ్ రిపోర్ట్ మాత్రమే సినిమాను ముందుకు నడిపిస్తుంది.
డిజిటల్ ప్రమోషన్ వల్ల ఉపయోగం ఉండదా అంటే ఉంటుంది. కానీ అది ఎలా అంటే కంటెంట్‌ను జనంలోకి తీసుకెళ్లడం ద్వారా. అంతే తప్ప కంటెంట్‌కు ఫేక్ వ్యూస్, లైక్‌లు రప్పించడం ద్వారా కాదు. నిజంగా కంటెంట్ జనంలోకి వెళ్లిపోతే ఈ వ్యూస్, లైక్‌లు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. కానీ హీరోలను, దర్శకులను, తమకు పని ఇచ్చిన నిర్మాతలను మెప్పించడం కోసం ఈ తరహా ఫేక్ వ్యూస్, లైక్‌లు కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.
సినిమాకు సరైన ఓపెనింగ్ కావాలంటే మంచి వైరల్ కంటెంట్ కావాలి. తర్వాత దాన్ని మరింత వైరల్ చేయాలి. అప్పుడు ఓపెనింగ్ తెగుతుంది. కానీ ప్రమోటర్ల ఆలోచనలు కావచ్చు, వాళ్లకు పనులు ఇచ్చేవారి ఆలోచనలు కావచ్చు, ఇలా వెళ్లకుండా కేవలం హీరోలను, దర్శకులను సంతృప్తి పరిచే దిశగా వెళ్తున్నాయి.
Hmm
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Public theatres ki raruuuu fake publicity ni nameee paristhithi ledhu inkka ott best mega mafiya vunantha varaku industry bagupadadhu