సప్తగిరి టెన్షన్..టెన్షన్

సినిమా అనుకున్న టార్గెట్ చేరకపోతే మళ్లీ సినిమా చేతిలోకి రావాలంటే ఇంకా కష్టం. అదే ఇప్పుడు సప్తగిరి టెన్షన్.

పెళ్లి కాని ప్రసాద్. మరి కొన్ని గంటల్లో స్క్రీన్ మీదకు రాబోతోంది. పెద్ద సినిమా కాదు. పెద్దగా బజ్ వున్న సినిమా కాదు. కానీ హీరో టర్న్డ్ కమెడియన్ సప్తగిరికి మాత్రం ఈ సినిమా ఒక విధంగా లైఫ్ అండ్ డెత్ టైపు సినిమా. కమెడియన్ గా వుంటూ హీరోగా సినిమాలు చేయడం ప్రారంభించాడు. మంచి కమెడియన్ అయినా ఎందుకో ఎక్కడో దారి తప్పడంతో తనను తానే ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కమెడియన్ గా దొరికిన అవకాశాలు చేసుకుంటూనే హీరో ప్రయత్నాలు వదలలేదు.

అలా లేటెస్ట్ గా చేసిన సినిమా పెళ్లి కాని ప్రసాద్. ఈ ట్రెండ్ లో మగపిల్లలకు పెళ్లి కావడం కష్టం అవుతోంది. పైగా కట్నం అనే రూల్స్ పెట్టుకుంటే మరీ కష్టం. ఇలాంటి కాంటెంపరరీ సబ్జెక్ట్ తీసుకుని చేసిన సినిమా ఇది. కొత్త నిర్మాత. కొత్త దర్శకుడు. కొత్త హీరోయిన్. ఇలా అంతా కలిసి ప్రయత్నించారు. ఎలా వచ్చింది. ఫలితం ఎలా వుండబోతోంది అన్నది రేపు సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.

కమెడియన్లు అందరూ హీరోలుగా ప్రయత్నించే వారే. వైవా హర్ష దగ్గర నుంచి వెన్నెలకిషోర్ వరకు. కానీ వారి అందరికీ దర్శకులు కమెడియన్లుగా కూడా ఏదో ఒక అవకాశం ఇస్తూనే వస్తున్నారు. దాని వల్ల వాళ్లంతా రెండు పడవల మీద సులువుగా ప్రయాణం సాగిస్తూనే వున్నారు. సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయిపోయారు. హ్యాపీగా వుంది ఆయన పరిస్థితి. కానీ సప్తగిరి మంచి కమెడియన్ అయినా ఎందుకో దర్శకులు అంతా దగ్గర తీయడం లేదు. మిగిలిన కమెడియన్లకు దొరికుతున్నన్ని అవకాశాలు సప్తగిరికి దొరకడం లేదు. సమస్య ఎక్కడ వుందో సప్తగిరికే తెలియాలి.

ఇలాంటి నేపథ్యంలో విడుదలవుతున్న పెళ్లి కాని ప్రసాద్ మంచి హిట్ కావాలి. అలా హిట్ అయితే ఇటు హీరోగా మరో సినిమా చేసుకోవచ్చు. దర్శకులు కూడా కామెడీ పాత్రలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. హీరోగా ఓ సినిమా సాధించడం ఒక కమెడియన్ కు చాలా కష్టం. అలాంటి సినిమా అనుకున్న టార్గెట్ చేరకపోతే మళ్లీ సినిమా చేతిలోకి రావాలంటే ఇంకా కష్టం. అదే ఇప్పుడు సప్తగిరి టెన్షన్.

4 Replies to “సప్తగిరి టెన్షన్..టెన్షన్”

  1. అది సరేలే కాని,, ఇంత గా బాధ పడుతున్నావు , మరి ఆ సినిమా కి కొంచెం చూసి రేటింగ్ ఇవ్వు మరి

Comments are closed.