అది బెట్టింగ్ యాప్ కాదు, స్కిల్ గేమ్

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం విజయ్ ఆ ప్రచారం చేయలేదని పరోక్షంగా చెబుతోంది.

బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేస్తున్న నటీనటులు, ఇన్ ఫ్ల్యూయన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 318 (A), 112, 49 BNS, 3 లాంటి పలు సెక్షన్లపై కేసు రిజిస్టర్ చేశారు. ఇందులో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయన్సర్లతో పాటు విజయ్ దేవరకొండ పేరు కూడా ఉంది.

దీనికి సంబంధించి మీడియాలో రకరకాల కథనాలు రావడంతో, విజయ్ దేవరకొండ టీమ్ అప్రమత్తమైంది. ఈ వ్యవహారానికి సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రధానంగా వాళ్లు చెప్పేది ఏంటంటే.. విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదంట, అదొక స్కిల్ గేమ్ అంట.

“నైపుణ్యంతో కూడిన ఆటలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడమనే పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే విజయ్ దేవరకొండ ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆన్‌లైన్ లో స్కిల్ గేమ్స్ ను చట్టబద్ధంగా అనుమతించే ప్రాంతాలకు మాత్రమే అతడి ప్రచారం పరిమితం చేశారు.”

2023తోనే ఆ ఒప్పందం ముగిసిందని, ప్రస్తుతం ఆ స్కిల్ బేస్డ్ గేమింగ్ కంపెనీకి విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. లీగల్ గా రివ్యూ చేసిన తర్వాతే విజయ్ దేవరకొండ ఆ యాప్ కు ప్రచారం చేశారని తెలిపింది.

విజయ్ దేవరకొండ చెబుతున్న స్కిల్ బేస్డ్ రమ్మీ గేమ్ తో పాటు, మిగతా బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ తెలుగు రాష్ట్రాలు నిషేధించాయి. అటు టీమ్ మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం విజయ్ ఆ ప్రచారం చేయలేదని పరోక్షంగా చెబుతోంది. విజయ్ స్టేట్ మెంట్ పై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

6 Replies to “అది బెట్టింగ్ యాప్ కాదు, స్కిల్ గేమ్”

Comments are closed.