కొన్ని రోజుల కిందటి సంగతి. నిర్మాత ఎస్.కె.ఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇకపై తెలుగు హీరోయిన్లతో సినిమాలు చేయనని నిండు సభలో ప్రకటించాడు. “తెలుగొచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమౌతుందో సినిమాలు చేసిన తర్వాత నాకు తెలిసొచ్చింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిల్నే ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నాం.” అంటూ చాలా పెద్ద బాంబ్ పేల్చాడు.
ఆయన ఆ స్టేట్ మెంట్ ఇచ్చిన వెంటనే అంతా ‘బేబి’ హీరోయిన్ వైష్ణవి చైతన్య వైపు చూశారు. ఆమె వల్లనే ఎస్.కె.ఎన్ అంత పెద్ద మాటన్నాడని అనుకున్నారు. ఆ తర్వాత తన స్టేట్ మెంట్ ను కవర్ చేస్తూ ఈ నిర్మాత ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఎప్పట్లానే తెలుగు టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు.
ఈ రెండు సందర్భాల్లో వైష్ణవి చైతన్య స్పందించలేదు. ఎట్టకేలకు ఆ వివాదంపై ఆమె రియాక్ట్ అయింది. సదరు నిర్మాత తన పేరు చెప్పలేదు కాబట్టి తను స్పందించలేదంటోంది.
“ఆయన ఎవ్వర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో నాకు తెలియదు. ఆ తర్వాత ఆయనే ఆ వార్తల్ని ఖండిస్తూ ఓ వీడియో కూడా పెట్టారు కదా. దాంతో అందరికీ సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. ఆయన నా పేరు పెట్టి ఏం అనలేదు కదా. అందుకే నేను రియాక్ట్ అవ్వలేదు.”
నిజానికి ఎస్.కె.ఎన్ బ్యానర్ పై వైష్ణవి చైతన్య మరో సినిమా చేయాలి. ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. దీనిపై స్పందించిన వైష్ణవి.. దురదృష్టవశాత్తూ ఆ బ్యానర్ పై మరో సినిమా చేయలేకపోయానని, అవకాశం వస్తే తప్పకుండా ఎస్.కె.ఎన్ తో సినిమా చేయడానికి తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని తెలిపింది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Super mam