నటి, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పించిన కేసులో విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే నోటీసులిచ్చిన వెంటనే ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు సీరియర్స్ అయ్యారు. దీంతో ఈరోజు లాయర్ ను వెంటబెట్టుకొని విచారణకు హాజరైంది విష్ణుప్రియ. దాదాపు రెండున్నర గంటల పాటు ఆమెను విచారించారు పోలీసులు.
ముందుగా ఆమె ప్రమోట్ చేసిన ఓ వీడియోను చూపించి, ‘ఇందులో ఉన్నది మీరేనా..’ అని ప్రశ్నించారు. దానికి ఆమె ఔనని సమాధానమిచ్చింది. అలా మరికొన్ని వీడియోల్ని కూడా ఆమె ముందు ప్రవేశపెట్టారు. మొత్తంగా 12-15 బెట్టింగ్ యాప్స్ కు ఆమె ప్రచారం కల్పించినట్టు తెలుస్తోంది.
ఇనస్టాగ్రామ్ ద్వారా ఆమె ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పించినట్టు గుర్తించారు పోలీసులు. ఒక్క ప్రమోషనల్ వీడియోకు ఎంత తీసుకున్నారని ఆరా తీసిన పోలీసులు, దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్ మెంట్స్ ను కూడా అడిగి తీసుకున్నారు. మొబైల్ నుంచే ఈ వీడియోల్ని అప్ లోడ్ చేసిందని తెలుసుకున్న పోలీసులు, ఆమె ఫోన్ ను సీజ్ చేసినట్టు తెలుస్తోంది.
నటీనటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయన్సర్లతో కలిపి మొత్తంగా 25 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు… ఒక్కొక్కర్ని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్ల్యూయన్సర్లను విచారిస్తున్న పోలీసులు, సినీ తారలపై ఎలా ముందుకెళ్తారో చూడాలి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Manchidi
seize the ship