అసెంబ్లీకి రారు.. రిజిస్ట‌ర్‌లో మాత్రం సంత‌కాలా?

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాకుండా, కేవ‌లం రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేయ‌డంపై స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు సీరియ‌స్ అయ్యారు.

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాకుండా, కేవ‌లం రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేయ‌డంపై స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు సీరియ‌స్ అయ్యారు. ఇదేం సంప్ర‌దాయ‌మ‌ని వైసీపీ స‌భ్యుల్ని ఆయ‌న నిల‌దీశారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఇవాళ్టితో ముగియ‌నున్నాయి. ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ జ‌గ‌న్ నేతృత్వంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం రోజు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌భ‌లో నినాదాలు చేశారు. అయితే ప్ర‌భుత్వం వైపు నుంచి సానుకూల స్పంద‌న రాలేదు.

ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాల్ని వైసీపీ బ‌హిష్క‌రించింది. అయితే కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం స‌భ‌కు హాజ‌రైన‌ట్టు సంత‌కాలు చేయ‌డంపై స్పీక‌ర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీలో అయ్య‌న్న‌పాత్రుడు మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష స‌భ్యుడు ప్ర‌శ్న‌లు వేయ‌డం వ‌ల్ల మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు అడ‌గ‌డానికి ఇబ్బంది వ‌స్తోంద‌న్నారు. ఇది స‌రైంది కాద‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నికైన స‌భ్యులు సగౌర‌వంగా స‌భ‌కు రావాల‌ని సూచించారు.

వైసీపీకి చెందిన ఏడుగురు స‌భ్యులు వై.బాల‌నాగిరెడ్డి, తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్‌, రేగం మ‌త్స్య‌లింగం, విరూపాక్షి, దాస‌రి సుధ‌, ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డి, విశ్వ‌రాజు త‌దిత‌రులు దొంగ‌ల్లా స‌భ‌కు వ‌చ్చి, సంత‌కాలు పెట్టి వెళుతున్నార‌ని అయ్య‌న్న‌పాత్రుడు ఘాటు కామెంట్స్ చేశారు.

రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేసిన వాళ్లు స‌భ‌లో త‌న‌కు కనిపించ‌డం లేద‌ని ఆయ్య‌న్న‌పాత్రుడు అన్నారు. ప్ర‌జాప్ర‌తినిధులుగా ముఖం చాటేయడం ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌కు త‌ల‌వంపులు తేవ‌ద్ద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

16 Replies to “అసెంబ్లీకి రారు.. రిజిస్ట‌ర్‌లో మాత్రం సంత‌కాలా?”

  1. వైసీపీ సభ్యులు కొంత మంది దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదు. దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరమేంటి? మీరు ఎమ్మెల్యేలు, దర్జాగా రండి. రిజిస్టర్ లో సంతకాలు పెట్టి సభలో కనిపించడంలేదు. వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరం. రిజిస్టర్ లో సంతకాలు చేసి సభలో కనిపించని ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధరెడ్డి, విశ్వేశ్వరరాజులు.

    మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నాం.

    #APAssembly

    #AndhraPradesh

  2. తూ.. దరిద్రులారా ఆంధ్ర పరువు తీస్తున్నారు కదరా ! ఈ వైసీపీ వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు.

    1. సింగిల్ సింహం పార్టీ వాళ్లు తొడలు కొడతారు..

      చేసే పనులు ఇలా ఉంటాయి..

  3. అవినీతి కేసు లు వున్నా వ్యక్తుల పేర్లు విగ్రహాలు పెట్టకూడదని అసెంబ్లీ తీర్మానం పాస్ చెయ్యాలి వీళ్ళ పేర్లు విగ్రహాలు పెట్టడం వాళ్ళ స్థానిక ప్రజలు బాధపడుతున్నారు అవినీతి కేసు లలో నిర్దోషులు గ వస్తే పెట్టొచ్చు

Comments are closed.