జస్ట్ ఆస్కింగ్.. తప్పు చేయలేదా?

అందర్నీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా. 2016లో ఇలాంటి ఓ యాడ్ నా దగ్గరకొచ్చింది. నేను చేశాను.

జస్ట్ ఆస్కింగ్.. ఈ డైలాగ్ వినగానే ఎవరికైనా ప్రకాష్ రాజ్ గుర్తొస్తారు. ఈ హ్యాష్ ట్యాగ్ తో ఆయన సోషల్ మీడియాలో ఎంతోమందిని ప్రశ్నిస్తుంటారు, విమర్శిస్తుంటారు, రెచ్చగొడుతుంటారు. ఇలాంటి వ్యక్తిపై ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ సెటైర్లు పడుతున్నాయి.

ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించి నమోదైన కేసులో ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉంది. నటీనటుల్లో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల ఉండగా.. వీళ్లతో పాటు ప్రకాష్ రాజ్ పేరును కూడా చేర్చారు. దీంతో “ఏంటీ పని.. జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ పడుతున్నాయి.

వీళ్లలో విజయ్ దేవరకొండ ఇప్పటికే స్టేట్ మెంట్ ఇవ్వగా, ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. తను బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసింది నిజమే కానీ, అదంతా 9 ఏళ్ల కిందటి వ్యవహారం అంటున్నాడు ఈ నటుడు.

“అందర్నీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా. 2016లో ఇలాంటి ఓ యాడ్ నా దగ్గరకొచ్చింది. నేను చేశాను. ఆ తర్వాత కొన్ని నెలలకే అది తప్పని నాకు అర్థమైంది. కానీ అగ్రిమెంట్ వల్ల నేనేం చేయలేకపోయాను. మరుసటి ఏడాది అగ్రిమెంట్ పొడిగించమని వాళ్లు మళ్లీ నా దగ్గరకు వచ్చారు. అది తప్పు అని వాళ్లకు చెప్పాను. 2017 నుంచి నా యాడ్ వాడొద్దని చెప్పాను. 2021లో ఆ కంపెనీని వేరే కంపెనీ కొనుక్కుంది. వాళ్లు మళ్లీ నా వీడియోలతో ప్రచారం చేశారు. వాళ్లకు నేను నోటీసులిచ్చాను, ఈ-మెయిల్ పంపించాను. తప్పని చెబితే వాళ్లు ఆపేశారు.”

అప్పుడు తను చేసిన ప్రచారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు లీక్ అయిందని, కేసు కూడా దానికి సంబంధించిందేనని క్లారిటీ ఇచ్చారు ప్రకాష్ రాజ్. పోలీసుల నుంచి తనకు ఇంకా నోటీసులు రాలేదని, ప్రజలకు విషయాలు తెలియాలి కాబట్టి ఇవన్నీ ముందుగానే చెబుతున్నానని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారొద్దంటూ యువతకు పిలుపునిచ్చారు.

13 Replies to “జస్ట్ ఆస్కింగ్.. తప్పు చేయలేదా?”

  1. సినిమాలలో ఎర్ర చందనం దొంగిలించటం నేర్పుతున్నారు , ఇంకోడు రాజ్య సభ కి ఎన్నికయి ,సహాయ మంత్రిగా చేసి ఖై!దీ!లు ఎలా పారిపోవాలో చూపిస్తాడు అవన్నీ తప్పులు కాదా ?

  2. Appudeppudo murder chesanu, tharvatha thappani thelsi vadilesanu malla cheyyaledu annatu antha simple ga chepthaventra dikkumalina sannasi, entha mandi families road na paddaro neelanti neechula valla.. movies lo sampadinchedi chaaladu annattu ee lanthkoor sampadana okati.. bokkalo vesi bokkalu viragottandi JustAsking gaadni

  3. తప్పని తెలిసిన వెంటనే కాంట్రాక్ట్ కాన్సిల్ చేసుకుని రెమ్యూనరేషన్ వెనక్కి ఎందుకు ఇవ్వలేదు? నీతులు పక్కవాళ్ళకేనా? #justasking

Comments are closed.