ఎమ్మెల్సీగా ఎంపిక చేయడానికి చాలా కాలం ముందే నాగబాబు మంత్రి అంటూ ప్రకటించారు తెలుగుదేశం తరఫున దాని అధినేత చంద్రబాబు. అధికారికంగా నోట్ రూపంలో ఈ విషయం ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడానికే చాలా కాలం పట్టింది. ఒక విధంగా ఇస్తారో ఇవ్వరో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఒక దశలో కార్పొరేషన్ పదవి ఇస్తారని ఫీలర్లు వదిలారు. ఆఖరికి కూటమి తరఫున ప్రకటించకుండానే, జనసేన నేరుగా తమ అభ్యర్థి నాగబాబు అంటూ ప్రకటించాల్సి వచ్చింది. మొత్తానికి ఎమ్మెల్సీ అయిపోయారు నాగబాబు.
నిజానికి చంద్రబాబు తలచుకుంటే మంత్రి చేయడానికి ఈ ఎమ్మెల్సీ తంతు ఏమీ అడ్డం కాదు. మంత్రి అయిన ఆరు నెలలలోగా ఎమ్మెల్సీ కావచ్చు. కానీ అలా చేయలేదు. జరగలేదు.
ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ. మంత్రి పదవి ఇవ్వాలంటే క్షణంలో ఇవ్వవచ్చు. కానీ ఈ లోగా పిఠాపురం సభలో చాలా డ్యామేజ్ చేసుకున్నారు. పవన్ కామెంట్లు కూడా కొంత డ్యామేజ్ చేశాయి. ఎమ్మెల్సీ ఇచ్చిన టైమ్‌లోనే మంత్రి పదవి ఇప్పట్లో ఉండదని తెలుగుదేశం వర్గాల్లో వినిపించింది. ఈ డ్యామేజ్ తర్వాత అసలు ఇప్పట్లో మంత్రి పదవి అన్నది ఉండదనే గట్టిగా వినిపిస్తోంది.
కేవలం నాగబాబును చేర్చుకోవడం కోసం మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అన్నది అనుమానం. కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర అయితే తప్ప మంత్రివర్గంలో మార్పులు చేర్పులు సాధారణంగా జరగవు. పైగా చంద్రబాబు వర్కింగ్ స్టైల్ వేరు. ఏ నిర్ణయం అంత వేగంగా, అంత సులభంగా తీసుకోరు. అందువల్ల ఇప్పట్లో నాగబాబును మంత్రిగా చూడడం కష్టం కావచ్చు.
తెలుగుదేశం శ్రేణులు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం వల్ల కావచ్చు, జనసేనకు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల కావచ్చు, కాస్త అసంతృప్తిగా ఉన్నాయి. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే అసంతృప్తి మరింత పెరుగుతుంది. వర్మ, కిమిడి నాగార్జున ఇంకా చాలా మంది అర్హులైన నాయకులు బ్యాక్ బెంచ్‌లో కూర్చొని వెయిటింగ్‌లో ఉండగా, నాగబాబుకు వైల్డ్ ఎంట్రీ కార్డ్ ఇస్తే రచ్చ మామూలుగా ఉండదు కదా!
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
మంత్రి పదవి తీసుకోగానే సరిపోదు, బాగా పని చెయ్యాలి.
వీడి నోటిదూల , డబ్బు మీద ఉన్న అత్యాశ , జబర్దస్త్ స్కిట్స్ వీడిని వెధవని చేసాయి , ఇంకా ఈ వెధవకి పదవి కూడానా
Chusuko
పార్టీ కి ఏదో చేశాడని నామినేటెడ్ పోస్ట్ వరకు పార్టీ ఇష్టం, ఇంకా మంత్రి పదవి కూడానా. ప్రజలకు ప్రత్యక్షంగా ఏమి చేశాడు? సిగ్గు లేకపోతె సరి.