లైకా సంస్థ అంటే అత్యంత భారీ ప్రొడక్షన్ హౌస్. పాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు ఇప్పుడు అందరూ తీస్తున్నారు. కానీ ఈ రేంజ్ సినిమాలు చాలా ముందుగానే మొదలుపెట్టిన సంస్థ లైకా. టేకప్ చేసిన ప్రతి సినిమా భారీ కాంబినేషన్ తో కూడినవే. ఈ జర్నీలో హిట్ లు వున్నాయి..ఫ్లాపులు వున్నాయి. గట్టి దెబ్బలు తిన్న సంఘటనలు వున్నాయి. కానీ లైకా అంటే మాత్రం ఒక భారీ సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటోందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
కొన్నాళ్ల క్రితం ఓ చిన్న సంస్థకు తెలుగు భాగస్వాముల కోసం వెదికారు అన్న వార్తలు వినిపించాయి. లైకా లాంటి సంస్థ ఇరవై కోట్ల సినిమాకు తెలుగు భాగస్వాముల కోసం వెదకడం ఏమిటి అని కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు అదే సంస్థ నిర్మించిన భారీ సినిమా ఎల్ 2 ఎంపరర్. మోహన్ లాల్..పృధ్వీరాజ్ లాంటి వాళ్ల కాంబినేషన్. పైగా లూసిఫర్ లాంటి మంచి సినిమాకు సీక్వెల్. ఇలాంటి సినిమా ఈ నెలాఖరులో విడుదల కావాల్సి వుంది.
అయితే గత వారం రోజులుగా వస్తుందా..రాదా అన్న అనుమానాలు వినిపించడం ప్రారంభమైంది. ఆర్థిక ఇబ్బందులే అందుకు కారణమని కూడా వినిపించింది. ఇలాంటి టైమ్ లో ఈ సినిమాను జెమిని ఫిలిం సర్క్యూట్స్, గోకులం సంస్థ టేకోవర్ చేసాయని తెలుస్తోంది. లైకా లాంటి సంస్థ సినిమా వేరే సంస్థలు రెండు కలిసి టేకోవర్ చేసాయి అంటే కాస్త ఇంటస్ట్రింగ్ వార్త నే.
Ayo
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
sankar debba….lyca abaa