బాలినేనిపై అంబ‌టి వెట‌కారానికి అర్థాలే వేరులే!

బాలినేనిపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు త‌న‌దైన స్టైల్‌లో వెట‌క‌రించారు.

మాజీ మంత్రి, జ‌న‌సేన నాయ‌కుడు బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మెప్పుకోసం త‌న ఆస్తుల్ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి లాక్కున్నార‌నే ఆరోప‌ణ‌లు చేశార‌నే చర్చ జ‌రుగుతోంది. వైసీపీ ఓడిపోయిన త‌ర్వాత జ‌న‌సేన‌లో బాలినేని చేరిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో బాలినేని ప్ర‌సంగిస్తూ జ‌గ‌న్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌పై వైసీపీ నేత‌లు విరుచుకుప‌డ‌తార‌ని తెలుస‌ని కూడా ఆయ‌న అదే స‌భ‌లో అన్నారు.

ఈ నేప‌థ్యంలో బాలినేనిపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు త‌న‌దైన స్టైల్‌లో వెట‌క‌రించారు. మీడియాతో అంబ‌టి మాట్లాడుతూ బాలినేని చ‌రిత్ర ఏంట‌ని ప్ర‌శ్నించారు. అధికారం కోసం పార్టీలు మారుతుంటార‌ని బాలినేనిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బాలినేని ఆస్తుల్ని ఎక్క‌డ పోగొట్టుకున్నారో అంద‌రికీ తెలుస‌ని న‌ర్మ‌గ‌ర్బ వ్యాఖ్య చేశారు.

బాలినేనిపై అంబ‌టి సెటైర్స్‌కు అర్థాలే వేరులే అని నెటిజ‌న్లు అంటున్నారు. బాలినేని అల‌వాట్ల గురించి ప‌రోక్షంగా అంబ‌టి ప్రస్తావించార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంబ‌టి స‌హ‌జంగానే కాస్త వెటకారం జోడించి విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అంబ‌టి వ్యంగ్యానికి అర్థం… అంద‌రికంటే బాలినేనికి బాగా తెలుస‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

అంబ‌టి దెప్పి పొడుపు బాలినేనికి బాగానే గుచ్చుకుని వుంటుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

11 Replies to “బాలినేనిపై అంబ‌టి వెట‌కారానికి అర్థాలే వేరులే!”

  1. హే సంజనా!!! బాలినేని ఎక్కడ పోగొట్టుకున్నాడో తరువాత, మనం మన పరువు ఎక్కడ పోగొట్టుకున్నామో తెలుసా?

  2. ఇలాంటి వాళ్ళతో వెటకారాలు ఆడినందుకే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోయారు..

  3. బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి , అంబ‌టి రాంబాబు ఇద్దరూ ఎధవలే ఇలాంటి వాళ్ళని ఏ పార్టీ చేర్చుకున్న వాళ్ళు ఎధవలే

  4. అయన ఎక్కడ డబ్బులు పోగొట్టుకున్నాడో నీకు తెలిస్తే కొంచెం రాయొచ్చు కదా

Comments are closed.