జ‌గ‌న్‌.. కోటరీ వదలదు, కోట మిగలదు!

ఇక రాజకీయ సన్యాసం చేస్తున్న, అన్ని పదవులకు రాజీనామా చేస్తున్న, ఇక నేను వ్య‌వ‌సాయం చేసుకుంటా, ఎప్పటికీ జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటా అని డైలాగులు చెప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పదేపదే…

ఇక రాజకీయ సన్యాసం చేస్తున్న, అన్ని పదవులకు రాజీనామా చేస్తున్న, ఇక నేను వ్య‌వ‌సాయం చేసుకుంటా, ఎప్పటికీ జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటా అని డైలాగులు చెప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పదేపదే వైసీపీని, జగన్ చుట్టూ ఉండే కోటరీని అటాక్ చేస్తున్నారు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి అంటూ ప‌రోక్షంగా జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇస్తూ ట్వీట్ చేశారు.

పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కోట‌రీ వ‌ల్లే వైసీపీకి దూరం అయ్యాన‌ని విజ‌యసాయిరెడ్డి ఇప్ప‌టికే చెప్పిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా కోట‌రీ చూట్టూ పెట్టుకుంటే పార్టీలో ఏమి జ‌రుగుతుందో, ప్ర‌జ‌లు ఎమీ అనుకుంటున్నారో తెలియ‌దని తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌దిలి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తే విష‌యం అర్థం అవుతుంద‌ని లేక‌పోతే పార్టీ న‌శ‌నం అవుతుంద‌ని జ‌గ‌న్‌ను హెచ్చరించారు.

మూడు రోజుల క్రితం జ‌గ‌న్ కోట‌రీపై విజ‌య‌సాయిరెడ్డి కామెంట్స్ చేసిన అనంత‌రం ఆ కోట‌రీ పెద్ద‌లు రంగంలోకి దిగి కొంత మంది నాయ‌కుల‌తో విజ‌య‌సాయిని తిట్టించారు. దీంతో వైసీపీ కోట‌రీ ఎంత బ‌లంగా ఉందో అంద‌రికి అర్థం అయింది. అందుకే తాజాగా జ‌గ‌న్ కోట‌రీ నుండి బ‌య‌టివ‌చ్చి పార్టీలో ఏమి జ‌రుగుతోందో తెలుసుకోవాల‌ని హిత‌వు చెప్పిన‌ట్లుగా అర్థం అవుతోంది. పార్టీ వ‌దిలి వెళ్లిన ఇంకా మాకు స‌ల‌హాలు ఇవ్వ‌డం ఎంట‌ని కొంత‌మంది వైసీపీ నేతలు విజ‌య‌సాయిని ప్ర‌శ్నిస్తున్నారు.

పార్టీ ఓడిపోయిన‌ప్ప‌టి నుండి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను జ‌గ‌న్ పెద్ద‌గా క‌ల‌వ‌లేదు. జ‌గ‌న్ ను క‌ల‌వ‌డానికి తాడేప‌ల్లికి వెళ్లిన కోట‌రీ ఆయ‌న్ను క‌లిసే అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని కొంత మంది వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. సంక్రాంతి త‌ర్వాత నియెజ‌క‌ర్గాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి ప‌ర్య‌ట‌న చేయ‌డం లేదు. విజ‌యసాయిరెడ్డి చెప్పిన‌ట్లు కోట‌రీని దాటి బ‌య‌టికి వ‌చ్చి సామన్య కార్య‌క‌ర్త‌ల‌ను జ‌గ‌న్ క‌లుస్తారా లేదా అనేది ముందుముందు తెలుస్తుంది.

22 Replies to “జ‌గ‌న్‌.. కోటరీ వదలదు, కోట మిగలదు!”

  1. వెంకట్ రెడ్డి.. నువ్వు అడక్కపోయినా .. నీకు నా ఉచిత సలహా..

    నువ్వు మోకాళ్ళ మీద నిల్చుని.. రా.. కదలిరా.. అంటూ మొత్తుకున్నా.. వాడు పాలస్ వదిలేసి రాడు ..

    ..

    వాడు రోడ్డు మీదకు వస్తే లక్షల మందిని పోగెయ్యడానికి.. 2024 కి ముందు నాయకులు ఖర్చు పెట్టుకున్నారు..

    2024 తర్వాత.. ఇప్పుడు పార్టీ లో నాయకులే లేరు.. ఉన్న వాళ్ళెవరూ పైసా కూడా ఖర్చు పెట్టుకోరు..

    మనోడికేమో.. జనాలను చూస్తే గాని మూడు రాదు.. మూడొస్తే గాని నోరు పెగలదు..

    ..

    ఒక పని చెయ్యి.. 25 కోట్లు ఖర్చు పెట్టుకుని.. రెండు “సిద్ధం” సభలు అరెంజ్ చెయ్యి.. వైసీపీ కి ఏమైనా ఊపు వస్తుందేమో చూడు..

    ముద్దుకు మూడొందలు.. ఆశీర్వాదానికి అయిదొందలు..

    జగన్ రెడ్డి ని “మామయ్యా” అని అరిచి పిలవడానికి.. వెయ్యి..

    జగన్ రెడ్డి చేసిన సంక్షేమం గురించి మాట్లాడటానికి .. 2 వేలు ..

    ..

    వస్తే జగన్ రెడ్డి పార్టీ కి ఊపు.. పోతే నీ పాతిక కోట్లు బూడిద లోకి .. అంతే కదా..

    రోజూ ఇక్కడ ఆర్టికల్స్ లో కూర్చుని.. నీ ముండమోపి ఏడుపులు ఏందీ..

    1. పరామర్శించడానికి వస్తున్నాడు అన్నయ్య జై-లు కి లేదా చనిపోయిన వారి ఇంటికి ..

      1. చనిపోయిన వారికి సంతాపం.

        బ్రతికున్నవారికి పరామర్శ.

        ఇది అన్నియ్య పాలసీ.

    2. అక్కడికి ఎదో జనం లో తిరగేస్తే …. జనాలు అన్ని మర్చిపోతారు అని మన వెంకట్రావు గారి భ్రమః ..

    3. వాడికి ఉబలాటం ఎక్కువ, ఊపుడు తక్కువ.

      ఎంత మూడు వచ్చినా స్క్రిప్ట్ లేకపోతే మాట రాదు.

      కూసాలు లేనివాడిని ఇన్నిరోజులు జాకీలతో నెట్టుకొచ్చారు.

  2. సంక్రాంతి కి వస్తున్నాం ( పార్ట్ 1 )

    సంక్రాంతి కి మళ్లీ వస్తున్నాం ( పార్ట్ 2 )

    కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్…సకల శాఖా మంత్రి ( ఒకప్పటి )

  3. వాడికి వొళ్ళు అంత బద్దకం.

    పైగా బుర్ర లో గుజ్జు లేదు.

    వాడిని ఇలా కాకి పొడిచినట్లు రోజు గు*డ్డ లో పొడుస్తూ,

    వాడిని బయటకి రమ్మంటే ఎలా ?

    పాపం పిల్లా*డు గు*క్క పెట్టీ ఏడు*స్తాడు.

  4. వాడికి వొళ్ళు అంత బద్దకం.

    పైగా బుర్ర లో గుజ్జు లేదు.

    వాడిని ఇలా కాకి పొడిచినట్లు రోజు గు*డ్డ లో పొడుస్తూ,

    వాడిని బయటకి రమ్మంటే ఎలా ?

    పాపం పిల్లా*డు గు*క్క పెట్టీ ఏడు*స్తాడు.

  5. ఇప్పుడు రాయి RK కొత్త పలుకులు

    ——————————–

    ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి ఆయనను చుట్టుకోబోతున్నాయా?

    .

    నాటి పాపాలలో చేదోడు వాదోడుగా ఉండిన వాళ్లు ఇప్పుడు అడ్డం తిరిగి ఆయా కేసులలో కుండబద్దలు కొట్టినట్టు అప్పుడు ఏమి జరిగిందో విచారణాధికారులకు చెప్పేయబోతున్నారా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ప్రకటన ఈ అనుమానాలను రేకెత్తిస్తోంది.

    .

    జగన్‌రెడ్డి హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అని, కాకినాడ పోర్టు యాజమాన్యం చేతులు మారడంలో కర్త, కర్మ, క్రియ ప్రస్తుత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డి అని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. భయం అనేది తన రక్తంలో లేదని, అప్పట్లో ఏం జరిగిందో విచారణాధికారుల ఎదుట చెప్పేస్తానని కూడా ఆయన స్పష్టంచేశారు.

  6. జగన్ చుట్టూ ఉన్న కోటరీ గురించి, ముఖ్యంగా సజ్జల గారి ప్రాధాన్యత గురించి ప్రపంచం మొత్తం తెలిసినా

    జగన్ కి మాత్రం తెలియక పోవడానికి కారణం సజ్జలే.

    తన అధికార, అనధికార గణాన్ని, సొంత మీడియా ను, పార్టీ సోషల్ మీడియా ను ఇంకా ఇతరత్రా సమాచారం వచ్చే మార్గాలన్నింటినీ గంప గుత్తగా సజ్జలకి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించారు. దాంతో ఎవ్వరినీ అంటే ఆఖరికి తల్లీ చెల్లీ తో సహా పార్టీ కి, జగన్ కి అత్యంత ముఖ్యమైన విజయసాయిరెడ్డిని

    కూడా అత్యంత చాకచక్యంగా బయటికి పంపేశాడు.

    అప్పుడే అవలేదు ఇంకా ముందుంది ముసళ్ల పండుగ. పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొనే రోజులు త్వరలోనే చూస్తాం.

    జగన్ ఇప్పటికైనా కళ్లు తెరిచి తేరుకొంటే బాగుపడుతాడు.లేదంటే శంకర గిరి మాన్యాలే

    1. సజ్జాల మేడం గారి కోటరీ..

      మేడం గారి కోటరీ నీ కాదని చేసే దమ్ము లేదు జగన్ కీ , మేడం కోసం అమ్ము నీ , చెల్లి నీ రోడ్డున పడేసాడు.. మనోడు ఇంట్లో మేడం కొంగు చాటు మొగుడూ మరీ…

      ఇంట్లో పిల్లి

      వీధి లో పులి…

  7. 2019 ముందూ అంటే అధికారం కోసం పాదయాత్ర చేపట్టారు

    తల్లీ చెల్లీ సహకారం అందించారు…

    అధికారం వచ్చాక ప్రజల్లో కీ రావడం మాత్రం మానేశాడు…ప్రజలకూ పథకాల ద్వారా రూపాయి లు ఇస్తే ఓట్లు వేసేస్తారు అనీ భ్రమ పడ్డాడు… తీరా ప్రజలూ ఓటు అనే చెప్పు తో కొట్టారు…. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటే కొంచెం కష్టమే…. ఇప్పుడు తల్లీ లేదు, చెల్లి లేదు… ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తే ఈయన తిరిగిన గ్రామాలలో ఓ నెల తర్వాత చెల్లి కూడా పాదయాత్ర చేసీ తిట్టినా తిట్టు తిట్టకుండా తిడుతుంది జగన్ నీ… పాదయాత్ర చేయడం బొక్క.

    శుభ్రంగా రాజకీయాలా నుండీ రిటైర్ అయి బెంగళూర్ ప్యాలెస్ లో హాయిగా రెస్ట్ తీసుకోండి…..

  8. ఏం వెం*కట రెడ్డి, ఒక విషయం సూటిగా చెప్పు.

    ఇక్కడ రాసిన విషయాలు, నేరుగా జగన్ రెడ్డి అనే బద్దకం గాడు చెవిలో చెప్పడానికి నీకు అడ్డం ఏంది,?

    వాడు నిన్ను వాడి గడప లోకి కూడా రానివ్వడు నా ?

    అంత విలువ లేని బతుకా నీది?

  9. విజయసాయి రెడ్డి గారు తెలివైన వాడు వైసీపీ అవినీతి రహస్యాలు అన్ని తెలిసిన వాడు అదే ఆయన ప్రాణాలమీదకు తెస్తుందని ఆయనకు తెలుసు వైసీపీ నాయకత్వంతో నిజమైన గొడవలైతే ఈ పాటికే ఆ రహస్యాలు బయటపెట్టేవాడే కానీ వచ్చిన ప్రాబ్లెమ్ ఆయన బయట పెట్టిన cbn గారు ఏ చర్య తీసుకోడు కనీసం పట్టించుకోడు వైసీపీ నాయకత్వాన్ని ఆయన ఏమి చెయ్యడు వాళ్ళు ఉన్నంత సేపు వాళ్ళు రాకూడదని నుఎట్రాల్ వోటింగ్ బాబు గారికి అడగకపోయినా వస్తుంది ఆల్రెడీ వైసీపీ పాలనా ఎంత అరాచకం గ ఉంటాడో చూసేసారు అదే బాబు గారి బలం

Comments are closed.