కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడచిపోతున్నాయి. ఇంకా నామినేటెడ్ పోస్టులు కొన్ని వేలకొద్దీ భర్తీకాకుండా మిగిలి ఉన్నాయి. అయితే నామినేటెడ్ పోస్టుల ఎంపిక విషయంలో చంద్రబాబునాయుడు మీనమేషాలు లెక్కిస్తూ ఉంటారని, ఒక పట్టాన ఆ వ్యవహారాలు తేల్చరని ఆయన పనితీరును ఎరిగిన వారు అంటూ ఉంటారు. ఈసారి కూడా అదే జరుగుతోంది. టీటీడీ వంటి బోర్డును ఏర్పాటుచేశారు తప్ప.. ఇంకా వందల కొద్దీ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన రానేలేదు. కొన్ని నెలలనుంచి చంద్రబాబు మాత్రం.. ఇదిగో అదిగో అంటూ రోజులు నెట్టేస్తున్నారు. అయితే తాజాగా ఆయన- ఈ విషయంలో నేరం నాది కాదు, తమ పార్టీ నేతలది అంటూ సెలవివ్వడం విశేషం.
నామినేటెడ్ పదవుల భర్తీకి పేర్లు సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఈమేరకు ఫ్రస్ట్రేట్ అయ్యారట. కొందరు నేతలు ఇంకా సిఫారసులు ఇవ్వలేదంటూ ఆయన చెప్పిన మాటలు నిజమే అనుకుందాం.. మరి వారిని ఫాలో అప్ చేసి.. జాబితాలు తెప్పించుకోవాల్సిన పార్టీ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? అనేది అనుమానం.
కొందరు నాయకులు సిఫారసు జాబితాలు ఇవ్వలేదనుకుందాం. మరి.. ఎంతో కాలం కిందటే జాబితాలు ఇచ్చిన నాయకుల పరిధిలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయవచ్చు కదా..! అలాంటి వార్తలు రావడం వలన.. ఏ నేతలైతే సిఫారసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారో.. వారి పరిధిలోని ఆశావహులనుంచి వారికి ఒత్తిడి వస్తుంది కదా.. ఆటోమేటిగ్గా సిఫారసులు కూడా వస్తాయి కదా.. అని కార్యకర్తలు అంటున్నారు.
9 నెలల తర్వాత త్వరలో 21 ప్రధాన దేవాలయాలకు ట్రస్టుబోర్డులు ఏర్పాటుచేస్తాం అని చంద్రబాబు అంటున్నారు. ఆ పర్వం పూర్తయినా కూడా చిన్నా పెద్దా కలిపి మరో 80కి పైగా ఆలయాల ట్రస్టుబోర్డుల పదవులే ఉంటాయి. మరి అవి ఎప్పటికి భర్తీ చేస్తారో సంకేతాలు కూడా ఇవ్వడం లేదు.
సాధారణంగా ఒక ఆలయ ట్రస్టు బోర్డు పదవి రెండేళ్ల పాటు ఉంటుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే.. పదవులను భర్తీ చేసి ఉంటే.. కనీసం ఈ ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోగా.. మూడు సార్లు ట్రస్టుబోర్డులు మారి ఉంటాయి. అంటే.. ఆశావహులు అందరికీ అవకాశం కల్పించి ఉండడం సాధ్యమయ్యేది. ఇంత సుదీర్ఘమైన కాలయాపన వలన.. ఇప్పుడు రెండుసార్లు మాత్రమే బోర్డులు వేయగలిగే వెసులుబాటు ఉంటుంది. కనీసం పూర్తిగా రాష్ట్రాస్థాయి నేతల చేతుల్లో ఉండే పదవులను కూడా ఇంకా భర్తీ చేయకుండా.. నేతల మీదికి నెట్టేయడం కేవలం పలాయనవాదం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Evm machine
Sampradhayini sudhapusani


















