పవన్ కల్యాణ్.. చంద్రబాబు వ్యూహాల్నే అనుసరిస్తున్నారా?

రాజకీయ వ్యూహ చాతుర్యంలో పవన్ కల్యాణ్.. చంద్రబాబునాయుడు బాటనే అనుసరిస్తున్నట్టుగా ఉంది.

పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఏకంగా 51వేల మెజారిటీతో ఎలా గెలిచారు? 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ క్రేజ్ కు, ఇప్పటి ఎన్నికల్లో క్రేజ్ కు ఏం తేడా వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన ఏ సినిమాలు బాక్సాఫీసును కుదిపేసి.. ప్రజల్లో ఆదరణ పెంచాయి? లేదా, ఈ మధ్య కాలంలో చేసిన ఏ పనులు.. ఆయన ఒక అద్భుతమైన ప్రజానాయకుడు అనే గుర్తింపును తెచ్చాయి? అప్పట్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన వ్యక్తి.. ఈసారి ఏకంగా 51 వేల మెజారిటీతో ఎలా గెలిచారు?

ఈ ప్రశ్నలు ఎవరికి తలెత్తినా సరే.. కూటమిలో భాగం కావడం వల్ల, తెలుగుదేశం నుంచి పూర్తి మద్దతు దక్కడం వల్ల మాత్రమే.. ఆయన ఘనమైన మెజారిటీ గానీ, నూటికి నూరుశాతం సీట్లు గానీ సాధ్యమయ్యాయని ఎవరైనా చెబుతారు! కానీ, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మాత్రం.. భిన్నమైన భాష్యం చెప్పి ఒక సరికొత్త చర్చకు తెరతీశారు.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిచారంటే.. రెండే కారణాలు అని, ఒకటి- పవన్ కల్యాణ్ పోటీచేయడం.. రెండు- నియోజకవర్గంలోని జనసైనికుల కష్టం.. అని నాగబాబు చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

పిఠాపురం వర్మ ను ఉద్దేశించి మాత్రమే ‘అదివారి ఖర్మ’ అని అన్నారనేది చాలా మంది అనుకుంటున్న సంగతి. కానీ కాస్త లోతుగా గమనిస్తే.. ఏకంగా తెలుగుదేశం కారణంగా జనసేన, పవన్ ఘనంగా గెలిచారని అనుకునే చంద్రబాబును కూడా ఉద్దేశించి.. నాగబాబు ఈ ‘ఖర్మ’ అనే మాటలు వాడారని అనిపిస్తుంది.

ఈ వైఖరి గురించి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు.. చంద్రబాబునాయుడు అనుసరించే రాజకీయ వ్యూహాలనే ఇప్పుడు పవన్ కూడా అనుసరిస్తున్నారనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే.. చంద్రబాబు.. ఏదైనా వివాదంగా మారగలదనే అనుమానం ఉన్న విధానాన్ని ఎంచుకునేప్పుడు ఒక టెక్నిక్ అనుసరిస్తారు. పార్టీలో ఏదో ఒక నాయకుడి ద్వారా ఆ మాటలు ప్రజల్లోకి వదలుతారు. దానికి వచ్చే స్పందనల్ని బట్టి.. ఆ మాటను పార్టీ పాలసీగా మార్చుకోవాలా? లేదా, వివాదం రేగితే గనుక ఆ నాయకుడిని మందలించినట్లుగా నటించి.. అక్కడి సర్దేయాలా అనేది అనుసరిస్తారు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే టెక్నిక్ అనుసరించినట్టుగా కనిపిస్తోంది. జనసేన గెలిచినదంటే.. కేవలం జనసైనికుల వల్ల మాత్రమే.. తెలుగుదేశంతో పొత్తు వల్ల కాదు.. అనే వాదనను జనసేనాని పవన్ కల్యాణ్ ముందు ముందు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటుండవచ్చు. కానీ.. దానివల్ల పొత్తు ధర్మంలో ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉన్నది గనుక.. ముందు జాగ్రత్తగా తనకు ఎంతో విశ్వసనీయుడైన అన్నయ్య ద్వారా ఆ మాటల లీకులు ఇప్పించారు.

ఇప్పుడు తెలుగుదేశం వారంతా మండిపడితే.. ఆ విధానం మార్చుకుంటారు. లేదా, వారు మిన్నకుంటే ముందు ముందు పవన్ కూడా అదే మాటలు చెప్పేలా రెచ్చిపోతారు..అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి రాజకీయ వ్యూహ చాతుర్యంలో పవన్ కల్యాణ్.. చంద్రబాబునాయుడు బాటనే అనుసరిస్తున్నట్టుగా ఉంది.

9 Replies to “పవన్ కల్యాణ్.. చంద్రబాబు వ్యూహాల్నే అనుసరిస్తున్నారా?”

  1. మన అన్నయ్య చేతగానితనం గురించి vi sa re యెంతో గొప్పగా చెప్తున్నాడు అని బాధ పడుతున్నావా GA…..😂😂😂

  2. Ide pavan kalyan ..TDP tho pottu pettukovaddani phone chesi batimalina mana annaya ki munde telusu…

    Janasena kalisthe.. tanu odipothadani…

    Ippudu ade technique… elagaina vidakottalani…

    CBN and PK are pretty much intelligent and smart enough .they know how to work together…

Comments are closed.