త‌మ్ముడూ మా అమ్మ‌ను తిట్టావ్‌.. మ‌రిచిపోను!

చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడ‌ని ఆమె మండిప‌డ్డారు.

నంద్యాల జిల్లా నందికొట్కూరు అంటే బైరెడ్డి అడ్డా. అయితే నందికొట్కూరు ఎస్సీకి రిజ‌ర్వ్‌డ్ కావ‌డంతో బైరెడ్డి కుటుంబం ప్ర‌త్యామ్నాయం వెతుక్కోవాల్సి వ‌చ్చింది. వైసీపీ హ‌యాంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌ను గెలిపించే బాధ్య‌త‌ల్ని బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డికి జ‌గ‌న్ అప్ప‌గించారు. వైసీపీ గాలిలో నందికొట్కూరు వైసీపీ గెలిచింది. అయితే ఆ త‌ర్వాత ఎమ్మెల్యే, బైరెడ్డికి తీవ్ర‌స్థాయిలో విభేదాలు వ‌చ్చాయి. వైసీపీ రాజ‌కీయంగా న‌ష్ట‌పోయింది.

ఇదే సంద‌ర్భంలో నందికొట్కూరులో రాజ‌కీయ ప‌రిస్థితులు మారాయి. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డికి స్వ‌యాన త‌మ్ముడి కుమారుడే సిద్ధార్థ‌రెడ్డి. పెద‌నాన్న‌తో సిద్ధార్థ‌కు తీవ్ర‌స్థాయిలో విభేదాలొచ్చాయి. రాజ‌కీయంగా బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ఒక ద‌శ‌లో సిద్ధార్థ‌రెడ్డి చావుదెబ్బ కొట్టారు. అప్ప‌ట్లో బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె శ‌బ‌రి, సిద్ధార్థ మ‌ధ్య డైలాగ్ వార్ సాగింది. బీజేపీ నుంచి టీడీపీలో చేరిన శ‌బరి.. నంద్యాల ఎంపీగా గెలుపొందారు.

ఇదే సంద‌ర్భంలో సిద్ధార్థ‌రెడ్డి కొంత‌కాలం మౌనాన్ని ఆశ్ర‌యించారు. మూడు నాలుగు రోజులుగా బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. శాప్ చైర్మ‌న్‌గా ఆడుదాం ఆంధ్రాలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డాడ‌ని, జైలుకు పంపుతామ‌ని టీడీపీ వార్నింగ్ ఇస్తోంది. అయితే అలాంటి వాటికి బెదిరేది లేద‌ని ఇప్ప‌టికై బైరెడ్డి తేల్చి చెప్పారు.

తాజాగా త‌మ్ముడు బైరెడ్డికి అక్క శ‌బ‌రి స‌వాల్ విస‌ర‌డంతో మ‌ళ్లీ నంద్యాల రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. మీడియాతో శ‌బ‌రి మాట్లాడుతూ అభివృద్ధి ఏం చేశారో చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని, సిద్ధార్థ‌రెడ్డి సిద్ధ‌మా అని స‌వాల్ విసిరారు. బైరెడ్డి అంటే తానే అని, సిద్ధార్థ‌రెడ్డి కాద‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. బైరెడ్డి ఇంటిపేరు త‌న సొంత‌మ‌న్న‌ట్టు ఆమె మాట్లాడ్డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అలాగే అక్క అని కూడా చూడ‌కుండా త‌న‌పై కేసులు పెట్టించార‌ని శ‌బ‌రి వాపోయారు. ఏనాడూ బ‌య‌టికి రాని త‌న అమ్మ‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసిన‌ట్టు ఆమె ఆరోపించారు. తానెప్ప‌టికీ మ‌రిచిపోన‌ని త‌మ్ముడికి అక్క వార్నింగ్ ఇచ్చారు.

ఏ విధంగా అయితే జగన్ తల్లిని, చెల్లిని చేశారో.. ఇక్కడా అదే చేస్తున్నారని త‌మ్ముడిపై విరుచుకుప‌డ్డారు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడ‌ని ఆమె మండిప‌డ్డారు. తొమ్మిది నెల‌లుగా సిద్ధార్థ‌రెడ్డి ఎక్క‌డికి పోయినాడ‌ని ఆమె ప్ర‌శ్నించారు.

8 Replies to “త‌మ్ముడూ మా అమ్మ‌ను తిట్టావ్‌.. మ‌రిచిపోను!”

  1. వీడొక పిల్ల బచ్చా! విషయం తక్కువ హైప్ ఎక్కువా!

    నదికొట్కూరు వీది అడ్దా అయితె 2024 లొ ఎందుకు Y.-.C.-.P అబ్యర్దిని గెలిపించ లెకపొయాడు!

Comments are closed.