వివేకా హత్య కేసులో నిందితుల కంటే… శిక్ష వాళ్లకే!

సీబీఐ విచారణ జరగలేదని ఆమె అన్నారు. ట్రైల్స్ నడవలేదని సునీత వాపోయారు. ఇలాగైతే న్యాయం జరగుతుందా?

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు గురై ఆరేళ్లవుతోంది. ఈ హత్య కేసులో పలువురు జైలుపాలయ్యారు. అయితే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం అరెస్ట్ కాలేదు. ప్రధానంగా అవినాష్ ను అరెస్ట్ చేయాలని వివేకా కుమార్తె సునీతతో పాటు టీడీపీ నాయకులంతా కోరుకున్నారు. కానీ అది జరగలేదు. ముందస్తు బెయిల్‌పై అవినాష్ బైటే ఉన్నారు.

ఈ నేపధ్యంలో వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సంచలన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పులివెందులలోని సమాధుల తోటలో వివేకా సమాధికి పులమాల వేసి సునీత, ఆమె కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ న్యాయం కోసం ఆరేళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేదని వాపోయారు. హత్య కేసులో ఒక్కరు తప్ప, మిగిలిన అందరూ యథేచ్ఛగా బైట తిరుగుతున్నారని ఆమె అన్నారు.

సీబీఐ విచారణ జరగలేదని ఆమె అన్నారు. ట్రైల్స్ నడవలేదని సునీత వాపోయారు. ఇలాగైతే న్యాయం జరగుతుందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య కేసులో నిందితుల కంటే, తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎక్కువ శిక్ష పడుతోందని ఆమె చెప్పుకొచ్చారు. సీబీఐ విచారణ తిరిగి ప్రారంభం అవుతుందనే నమ్మకం మేము కలిగి ఉన్నామని సునీత తెలిపారు. సాక్షుల మరణాలపై త‌మ‌కు కూడా అనుమానం ఉందని అన్నారు. సాక్షులకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారామె. అయితే తన తండ్రి కేసులో నిందితులకు శిక్ష పడేలా పోరాడుతూనే ఉంటానని ఆమె అన్నారు.

సాక్షుల మరణాలపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదే మాటను సునీత కూడా బలపరచడం గమనార్హం. తమకు అనుకూలమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని సునీత గ్రహించాలి. ఇప్పుడు కాకపోతే, ఎప్పటికీ తాను కోరుకున్న న్యాయం జరగదని సునీత గుర్తించాలి.

14 Replies to “వివేకా హత్య కేసులో నిందితుల కంటే… శిక్ష వాళ్లకే!”

  1. అంటే బాబాయ్ కేసు లో అన్న న్యాయం చేయలేదు అని ఒప్పుకున్నట్లే అంటావ్?

  2. అన్న న్యాయం చేయలేదు అంటావ్.ఎందుకు చెయ్యలేదు? అంటే కుమ్మక్కు అయ్యాడు అంటావ్

  3. సునీత గారికి ఎవరు హత్య చేయించారో ఒక అవగాహనకు వచ్చేసేరు చట్టప్రకారం నిందితులకు శిక్ష వేయటం కుదరకపోతే మహాభారతంలో కృష్ణ పరమాత్మా చెప్పినట్టు ఏ విధం గ నైనా చెడుని దుర్మార్గులను పారద్రోలాలి అని చెప్పిన విధం గ ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం సునీత గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి

  4. భూమి బద్దలయ్యే 151 నుండి గుండె బద్దలయ్యే 11 కి పడిపోవడం ఒకలాంటి శిక్షే.

  5. జ*గ్గు గాడి త*ల పైన తిరు*గుతున్న ఇంట్లో వాళ్ళ ఆ*త్మ లు.

    రాజశే*ఖర్ రెడ్డి – కు*ట్ర చేసి పైకి పం*పేశాడు.

    వివేక* రెడ్డి – కు*ట్ర చేసి చంపే*శాడు.

Comments are closed.